Education-Article
గూగుల్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌

కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ చేయూత

మార్కెట్‌లో ఉన్న ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విధంగా అయిదు సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లను గూగుల్‌ అందిస్తోంది. అలాగే అందుకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కెనడాలోని కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌(సీఓఎల్‌) స్కాలర్‌షి్‌పలతో చేయూతనిస్తోంది. నిరుద్యోగులు ముఖ్యంగా ఏ బ్రాంచ్‌లో అయినా ఆఖరు ఏడాది చదువుతున్న యూజీ/ పీజీ విద్యార్థులు ఈ కోర్సులు చేసేందుకు అర్హులు. నేరుగా ఈ కోర్సుల్లో చేరితే ఫీజు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే సీఓఎల్‌ ద్వారా చేరితే కొంత వెసులుబాటు ఉంటుంది. సదరు కోర్సులు చేసే వ్యక్తుల్లో వెయ్యి మందికి స్కాలర్‌షి్‌పలను సీఓఎల్‌ మంజూరు చేస్తోంది. ఈ కోర్సులు చేసిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ఖాళీల్లో చేరేందుకు అవసరమైన నైపుణ్యాలను పొందవచ్చు. 


ఆఫర్‌ చేస్తున్న కోర్సులు

ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ గూగుల్‌ డేటా అనలిటిక్స్‌ 

(ఇందులో ఎనిమిది కోర్సులు ఉంటాయి)

ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ గూగుల్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఇందులో ఆరు కోర్సులు ఉంటాయి)  

ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ గూగుల్‌ యుఎక్స్‌ డిజైన్‌ 

(ఇందులో ఏడు కోర్సులు ఉంటాయి)

ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ గూగుల్‌ ఐటీ సపోర్ట్‌

ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ గూగుల్‌ ఐటీ ఆటోమేషన్‌ విత్‌ పైథాన్‌ (ఇందులో అయిదు కోర్సులు ఉంటాయి)

ఈ కోర్సుల్లో చేరిన వ్యక్తులకు 24గీ7 ప్రోగ్రామ్‌ యాక్సెస్‌ ఉంటుంది. తమకు ఉన్న అవకాశాన్నిబట్టి రోజులో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ప్రతి ప్రోగ్రామ్‌లో వీడియోలు, టెక్స్ట్‌, అసైన్‌మెంట్స్‌ ఉంటాయి. ఏ కోర్సులో చేరినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఇంగ్లీ్‌షను బాగా అర్థం చేసుకోవడానికి తోడు సీరియ్‌సగా ఈ శిక్షణను పూర్తి చేయాలనుకునే అభ్యర్థులు ఎక్సెల్‌ ఫార్మెట్‌లో తమ దరఖాస్తులను ఏప్రిల్‌ 29లోపు కింది మెయిల్‌కు పంపుకోవాలి.ఈ ప్రోగ్రామ్స్‌లో ఎంత తొందరగా చేరితే అంత మేరకు వెసులుబాటు కోర్సును పూర్తి చేసేందుకు ఉంటుంది. 

ఈ మెయిల్‌: [email protected] 

కోర్సుల వివరాలు: https://grow.google/certifi-cates/#?modal_active=none

స్కాలర్‌షిప్‌ వివరాలు: www.colskillsforwork.org, https://colsurvey.limequery.com/946334? lang=en


Tags :