Education-Article
ఐఐటీటీఎంలో బీబీఏ, ఎంబీఏ

గ్వాలియర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం), అమర్‌కంటక్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టూరిజం అండ్‌ ట్రావెల్‌)

కోర్సు వ్యవధి: మూడేళ్లు

సీట్లు: మొత్తం 375 సీట్లు ఉన్నాయి. గ్వాలియర్‌ క్యాంప్‌సలో 112, భువనేశ్వర్‌లో 75, నోయిడాలో 113, నెల్లూరులో 75 సీట్లు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులకు 152, ఓబీసీలకు 101, ఎస్సీలకు 56, ఎస్టీలకు 28, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 38 సీట్లు ప్రత్యేకించారు.

అర్హత:  కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 22 ఏళ్లు మించకూడదు.

కోర్సు ఫీజు: కోర్సు మొత్తం ఫీజు రూ.2,79,350.  మొదటి ఏడాదికి రూ.1,08,850; రెండో ఏడాదికి రూ. 88,000; మూడో ఏడాదికి రూ.82,500 చెల్లించాలి. 


మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)

కోర్సు వ్యవధి: రెండేళ్లు

సీట్లు: మొత్తం 750 సీట్లు ఉన్నాయి. గ్వాలియర్‌ క్యాంపస్‌లో 334, భువనేశ్వర్‌లో 112, నోయిడాలో 189, నెల్లూరులో 75, గోవాలో 40 సీట్లు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులకు 304, ఓబీసీలకు 203, ఎస్సీలకు 112, ఎస్టీలకు 56, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 75 సీట్లు ప్రత్యేకించారు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయశ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. మ్యాట్‌/ క్యాట్‌/ సీమ్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌/ ఏటీఎంఏ అర్హత స్కోరు ఉన్నవారు అడ్మిషన్‌ టెస్టు రాయనవసరం లేదు. ఈ జాతీయ పరీక్షలను  2020 జూన్‌ 1 నుంచి 2021 మే 31 మధ్య రాసి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు. 

కోర్సు ఫీజు: మొదటి ఏడాది రూ.1,88,600; రెండో ఏడాది రూ.1,51,250 చొప్పున మొత్తం రూ.3,39,850 చెల్లించాలి.


ప్రవేశ పరీక్ష

దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50, వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. బీబీఏకు ఇంటర్‌స్థాయిలో, ఎంబీఏకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ఇందులో సాధించిన మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు.

ఎంపిక: కోర్సును అనుసరించి జాతీయ పరీక్షల స్కోరు/ రాత పరీక్షలో సాధించిన స్కోరుకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 15 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్కాలర్‌షిప్‌: రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు ఒక్కో కోర్సులో సుమారు 150 మందికి స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. దీని కింద ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 21

అడ్మిషన్‌ టెస్టు (ఐఐఏటీ) తేదీ: జూన్‌ 6

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 14 నుంచి 18 వరకు

మెరిట్‌ లిస్ట్‌ విడుదల: జూన్‌ 25

అడ్మిషన్‌ ఫీజు చెల్లించే తేదీ: జూలై 9

అకడమిక్‌ కోర్సు ప్రారంభం: జూలై 19

వెబ్‌సైట్‌: www.iittm.ac.in

Tags :