Education-Article
ఎస్‌వీపీఐఎ్‌సటీఎంలో భిన్న కోర్సులు

తమిళనాడులోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, ఎంబీఏ సహా పలు షార్ట్‌ టర్మ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తమిళనాడు సహకారం అందిస్తోంది. బీఎస్సీ, ఎంబీఏ కోర్సులకు ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా షార్ట్‌ టర్మ్‌ కోర్సులకు ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 


ఎంబీఏ

కోర్సు వ్యవధి: రెండేళ్లు

స్పెషలైజేషన్లు: టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌, అప్పారెల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలలనుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడు వర్గాలవారికి 45 శాతం మార్కులు చాలు. ఈ ఏడాది జూలై 15 నాటికి డిగ్రీ పూర్తిచేసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


బీఎస్సీ కోర్సు వ్యవధి: మూడేళ్లు

విభాగం: టెక్స్‌టైల్స్‌

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌/ బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. 

ప్రవేశ పరీక్ష వివరాలు: దీనిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. బీఎస్సీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌/ బయాలజీ అంశాలకు సంబంధించి ఇంటర్‌/ పన్నెండో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఎంబీఏ ప్రవేశానికి పెట్టే పరీక్షలో ఇంగ్లీష్‌ వెర్బల్‌ ఎబిలిటీ, మేథ్స్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంట్రప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి డిగ్రీ స్థాయి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం గంట.


షార్ట్‌ టర్మ్‌ సర్టిఫికెట్‌ కోర్సులు 

విభాగాలు: మెడికల్‌ టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌, నాన్‌ ఓవెన్‌ టెక్స్‌టైల్‌ మేనేజ్‌మెంట్‌ 

కోర్సు వ్యవధి: 12 వారాలు. 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టెక్స్‌టైల్‌ రంగంలో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు ఫీజు: రూ.10,000

ఈ మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 18

ఈ మెయిల్‌: [email protected] svpitm.ac.in


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 18

ఎంట్రెన్స్‌ టెస్టు తేదీ: మే 27  

వెబ్‌సైట్‌: svpistm.ac.in

Tags :