Education-Article
ఎన్‌ఐటీటీటీఆర్‌లో ఎంఈ (మాడ్యులర్‌)

చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐటీటీటీఆర్‌)- ఎంఈ (మాడ్యులర్‌) ప్రోగ్రాములలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


కోర్సు వ్యవధి: ఒక్కో మాడ్యులర్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులో 11 స్పెల్స్‌ ఉంటాయి. మూడున్నరేళ్లు థీసెస్‌ వర్కు ఉంటుంది. ఇందులో 7 స్పెల్స్‌ ఉంటాయి. ఒక్కో స్పెల్‌ అయిదు వారాలు ఉంటుంది. కోర్సు మొత్తమ్మీద 12 థియరీ పేపర్లు ఉంటాయి. వీటికి 50 క్రెడిట్లు ఇస్తారు. ఆరో స్పెల్‌లో ప్రిలిమినరీ థీసెస్‌ వర్కు పూర్తిచేయాలి. ప్రతీ స్పెల్‌లో 50 శాతం క్రెడిట్లు సాధిస్తేనే తరవాతి దానిలో ప్రవేశానికి అనుమతిస్తారు.

విభాగాలు - సీట్లు: మొత్తం సీట్లు 107. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ) 18, సివిల్‌ ఇంజనీరింగ్‌ (కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) 35, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 18, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌) 18, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ 18 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 10 శాతం సీట్లు ప్రత్యేకించారు. 

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బోధన/ పరిశోధన/ ఇండస్ట్రియల్‌ రంగాల్లో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. ఏఎంఐఈ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం అవసరం.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2,000

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: మే 20

ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల: మే 25

కౌన్సిలింగ్‌: మే 30

ప్రోగ్రామ్స్‌ ప్రారంభం: జూన్‌ 8

వెబ్‌సైట్‌: nitttrchd.ac.in

Tags :