Education-Article
ఆర్‌జీఐపీటీలో పీజీ, పీహెచ్‌డీ

అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 


ఎంటెక్‌ ప్రోగ్రామ్స్‌

సీట్లు: అమేథీ క్యాంప్‌సలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ 15, పెట్రోలియం ఇంజనీరింగ్‌ 15 సీట్లు ఉన్నాయి. బెంగళూరు ఎనర్జీ ఇనిస్టిట్యూట్‌లో రిన్యూవబుల్‌ ఎనర్జీ 15, పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ 10, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 15, ఎలకా్ట్రనిక్‌ వెహికిల్‌ టెక్నాలజీ 20 సీట్లు ఉన్నాయి.  


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బిఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు ఉన్నవారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. గేట్‌ స్కోరు లేనివారు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.  

అసిస్టెంట్‌షిప్‌: గేట్‌ అర్హత ఉన్నవారికి నెలకు రూ.12,400; గేట్‌ స్కోరు లేనివారికి నెలకు రూ.8,000 ఇస్తారు. 


పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌

విభాగాలు: ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌.

అర్హత: ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌/ సైన్సెస్‌/ హ్యుమానిటీస్‌/ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ సంబంధిత విభాగాల్లో  60 శాతం మార్కులతో పీజీ లేదా 75 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ గేట్‌/ నెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

అసిస్టెంట్‌షిప్‌: గేట్‌ అర్హత ఉన్నవారికి నెలకు రూ.31,000 ఇస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

రాత పరీక్ష, ఇంటర్వ్యూలు: జూలై 11 నుంచి 13

అడ్మిషన్‌ పొందినవారి జాబితా విడుదల: జూలై 17

తరగతులు ప్రారంభం: ఆగస్టు 2 నుంచి

వెబ్‌సైట్‌: rgipt.ac.in

Tags :