Education-Article
టీఎస్‌ ఎడ్‌సెట్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) 2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్నది. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌, నమూనా ప్రశ్నపత్రాలు ఎడ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


పరీక్ష: టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2021

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)

కాలవ్యవధి: రెండేళ్లు


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు. అయితే ఎంబీబీఎస్‌/ బీఎస్సీ (అగ్రి)/ బీవీఎస్సీ/ బీహెచ్‌ఎంటీ/ బీఫార్మసీతో పాటు ఎల్‌ఎల్‌బీ అభ్యర్థులు బీఈడీ కోర్సులో చేరడానికి అనర్హులు.


వయసు: 2021 జూలై 1 నాటికి అభ్యర్థులకు 19 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.


పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌(మల్టిపుల్‌ చాయిస్‌)లో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్టు/కంటెంట్‌(10వ తరగతి స్థాయి రాష్ట్ర సిలబస్‌)లో భాగంగా మేథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ విభాగాల నుంచి 20  చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. అదేవిధంగా టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 20, జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 20, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌ నుంచి 30, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్‌/తెలుగు, ఇంగ్లీష్‌/ఉర్దూలో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించాలంటే ఇతరులు 25శాతం(38 మార్కులు)కనీస మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఫీజు: ఇతరులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15

ఎడ్‌సెట్‌ తేదీ: 2021 ఆగస్టు 24, 25 తేదీల్లో 

వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in/ TSEDCET/EDCET_HomePage.aspx

Tags :