Education-Article
కోర్‌ గ్రూపులకు దీటుగా ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌

ప్రస్తుతం కోర్‌ గ్రూపులకు దీటుగా ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫలితంగా పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు మొదలు డిప్లొమా, డిగ్రీ పాసైన వారిలో అనేక మంది ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. తమ అర్హతలకు తగిన కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి వారికి చెన్నైలోని ‘సిపెట్‌’(సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ - ఇంతకు మునుపు సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ) వివిధ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో శిక్షణను ఇచ్చి నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దుతోంది.అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులకు త్వరితగతిన ఉపాధి అవకాశాలు లభించేలా ‘సిపెట్‌’ కృషి చేస్తోంది. తాజాగా ‘సిపెట్‌’ అడ్మిషన్‌ టెస్ట్‌-2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 2021 జూలై చివరివారంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష గురించి తెలుసుకుందాం...


‘సిపెట్‌’ అడ్మిషన్‌ టెస్ట్‌తో ప్రవేశం లభించే కోర్సులు

‘సిపెట్‌’ ప్రధానంగా నాలుగు రకాల కోర్సులను నిర్వహిస్తోంది. అవి... 

1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌(పిజిడి-పిపిటి)-వ్యవధి ఏడాదిన్నర. 

2. పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌  క్యాడ్‌/కామ్‌ - వ్యవధి ఏడాదిన్నర

3. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డిపిఎంటి)- వ్యవధి మూడేళ్లు

4. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ(డిపిటి)- వ్యవధి మూడేళ్లు


అర్హతలు

పీజీడీ- పీపీటి  కోర్సుల్లో ప్రవేశానికి  కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ.

పీజీ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశానికి  మెకానికల్‌, ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, టూల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


పరీక్ష విధానం: సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఎలాంటి నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్షలో ముఖ్యంగా సైన్స్‌ గ్రూపులైన మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ టెన్త్‌, ఇంటర్‌ స్థాయిలోనే ఉంటాయి. 


మేథ్స్‌: వెక్టార్‌ ఆల్‌జిబ్రా, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, అనలిటికల్‌ జామెట్రీ, మేట్రీసెస్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌, డిస్ర్కీట్‌ మేథమెటిక్స్‌, కాంప్లెక్స్‌ నంబర్స్‌ అండ్‌ ట్రిగ్నామెట్రీ, ఇంటిగ్రల్‌ క్యాలిక్యులస్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌ మెథడ్స్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటింగ్‌ స్టాండర్ట్‌ టైప్స్‌ అండ్‌ థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్‌. కాబట్టి అభ్యర్థులు ఆయా చాప్టర్లలోని సూత్రాలను, ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ఎక్కువగా మోడల్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఇదే క్రమంలో షార్ట్‌కట్‌ మెథడ్స్‌ నేర్చుకోవాలి. తద్వారా సమాధానాన్ని వేగంగా, కచ్చితత్వంతో గుర్తించవచ్చు.


ఫిజిక్స్‌:  వేవ్స్‌, ఎలకో్ట్రస్టాటిస్టిక్స్‌, ఆస్కిలేషన్స్‌, మ్యాగ్నటిజం, గ్రావిటేషన్‌, లాస్‌ ఆఫ్‌ మోషన్‌, ఇంట్రడక్షన్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌, సాలిడ్స్‌ అండ్‌ సెమి కండక్టర్‌ డివైజెస్‌, మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కరెంట్‌, కరెంట్‌ ఎలక్ర్టిసిటీ, ఎలకా్ట్రన్స్‌ అండ్‌ ఫోటాన్స్‌, రే ఆప్టిక్స్‌ అండ్‌ ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డిస్ర్కిప్షన్‌ ఆఫ్‌ మోషన్‌ ఇన్‌ టు అండ్‌ త్రీ డైమెన్షన్స్‌, ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ వేవ్స్‌, రొటేషనల్‌ మోషన్‌, థర్మల్‌ అండ్‌ కెమికల్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కరెంట్‌, వర్క్‌, ఎనర్జీ అండ్‌ పవర్‌ అండ్‌ థర్మల్‌ అండ్‌ కెమికల్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కరెంట్‌. అభ్యర్థులు ముఖ్యమైన సూత్రాలు, ఫార్మూలాలకు సంబంధించిన ప్రత్యేక నోట్సును మెయింటెయిన్‌ చేయాలి. వాటిని తరచుగా మననం చేసుకూంటూ ఉండాలి. గత ప్రశ్న పత్రాల సరళిని పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి.


కెమిస్ట్రీ: సొల్యుషన్స్‌, ఎలకో్ట్ర కెమిస్ట్రీ, రియాక్షన్స్‌ ఆఫ్‌ బెంజిన్‌, సాలిడ్‌ స్టేట్‌, పెనాల్స్‌, గ్యాసియస్‌ అండ్‌ లిక్విడ్‌ స్టేట్స్‌, కెమికల్‌ ఎక్విలిబ్రియం అండ్‌ కెమికల్‌ కైనెటిక్స్‌, కార్బొహైడ్రేట్స్‌, ఎనర్జిటిక్స్‌, ప్రాక్టికల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎమినో ఆసిడ్స్‌ అండ్‌ పెప్టయిడ్స్‌, అటామిక్‌ స్ట్రక్షర్‌, కెమికల్‌ బాండింగ్‌, సర్ఫేస్‌ కెమిస్ట్రీ. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఫార్మూలాలు, ఈక్వేషన్స్‌పై గట్టి పట్టు సాధించాలి.


అపార అవకాశాలు

సిపెట్‌ ముఖ్యంగా పరిశోధన సంస్థ కాబట్టి ఇక్కడ చదివిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలుంటాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో  ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ నిపుణులకు మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా ప్రాంగణ నియామకాల ద్వారా కూడా అనేక కంపెనీలు రిక్రూట్‌మెంట్లు చేపడతున్నాయి. డిప్లొమా చేసిన వారు ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు,  పోస్టు డిప్లొమా పూర్తి చేసినవారు రూ.20 వేల నుంచి రూ.25 వరకు ప్రారంభ వేతనం పొందుతున్నారు. విదేశాల్లో అయితే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రారంభం వేతనం లభిస్తోంది. వ్యవసాయం, ఆటోమొబైల్‌, విమానయానం, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, వైద్యం, ప్యాకేజింగ్‌ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి.


ముఖ్య సమాచారం

సిపెట్‌ 2021 తేదీ: జూలై చివరి వారం

పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.250)

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై మూడో వారం

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/Tags :