Education-Article
ఆర్మీ కాలేజీల్లో బీఎస్సీ (నర్సింగ్‌)

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్లుఈఎస్‌)- బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అడ్మిషన్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షతో గువహటిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌, జలంధర్‌లోని ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆర్మీకి చెందిన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వితంతువుల కూతుళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు కాలేజీలకు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు ఉంది. 


ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (ఏఐఎన్‌) గువహటి

సీట్లు: 50

రిజర్వేషన్‌: ఆర్మీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కూతుళ్లకు 90 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 10 శాతం సీట్లను ఈశాన్య రాష్ట్రాల వారికి ప్రత్యేకించారు. 

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష మొదటిసారే ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. 

వెబ్‌సైట్‌: www.ainguwahat.org

ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (ఏసీఎన్‌) జలంధర్‌

సీట్లు: 60

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ (బైపీసీ) / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వెబ్‌సైట్‌: www.acn.co.in

అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ విభాగాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు; ఇంగ్లీష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 10 ప్రశ్నలు  ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌/ పన్నెండో తరగతి స్థాయిలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.


ముఖ్య సమాచారం

వయసు: డిసెంబరు 31 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు ఫీజు: రూ.1000

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 12 నుంచి

ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 27

ఫలితాలు విడుదల: జూలై 11

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

వెబ్‌సైట్‌: ain.cbtexam.in

Tags :