Education-Article
దివ్యాంగుల కళాశాలల్లో కోర్సులు

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగజన్‌ విభాగం- అనుబంధ సంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో  ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌) 2021 ద్వారా డిగ్రీ కోర్సుల్లో; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈటీ) 2021 ద్వారా మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. వీటిని ఒడిషాలోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) నిర్వహిస్తుంది. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆర్నెల్ల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మాస్టర్స్‌ కోర్సుల వ్యవధి రెండేళ్లు.

సీట్లు: అన్ని క్యాంపస్‌లలో కలిపి మొత్తం 376 సీట్లు ఉన్నాయి.

ఒడిషా క్యాంప్‌సలో బీపీటీ 62, బీఓటీ 62, బీపీఓ 46 సీట్లు ఉన్నాయి. కోల్‌కతా క్యాంపస్‌లో బీపీటీ 57, బీఓటీ 56, బీపీఓ 37 సీట్లు ఉన్నాయి. చెన్నై 


క్యాంప్‌సలో బీపీటీ 18, బీఓటీ 18, బీపీఓ 20 సీట్లు ఉన్నాయి. 

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయించారు. దివ్యాంగులకు 4 శాతం సీట్లు ప్రత్యేకించారు.

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ మేథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు 40 శాతం చాలు. 

సెట్‌ 2021 వివరాలు: పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. రెంటిలో కలిపి ఇంటర్‌ / పన్నెండో తరగతి స్థాయిలో 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొదటి విభాగంలో జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలకు సంబంధించి 10 ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/మేథమెటిక్స్‌ నుంచి ఒక్కోదానిలో 30 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. రుణాత్మక మార్కులు లేవు.


మాస్టర్స్‌ కోర్సుల వివరాలు

క్యాంపస్‌: స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) - ఒడిషా

కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ), మాస్టర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (ఎంఓటీ), మాస్టర్‌ ఇన్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (ఎంపీఓ)

ఎంపీటీ స్పెషలైజేషన్లు: రిహాబిలిటేషన్‌, మస్క్యులోస్కెలటల్‌ కండిషన్స్‌, పీడియాట్రిక్స్‌, న్యూరాలజీ

ఎంఓటీ స్పెషలైజేషన్లు: రిహాబిలిటేషన్‌, హ్యాండ్‌ రిహాబిలిటేషన్‌, డెవల్‌పమెంటల్‌ డిజెబిలిటీస్‌, న్యూరాలజీ.

సీట్లు: ఎంపీటీలో 15 సీట్లు, ఎంఓటీలో 15 సీట్లు, ఎంపీఓలో 10 సీట్లు ఉన్నాయి. 

అర్హత వివరాలు: అభ్యర్థులు ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ను అనుసరించి ద్వితీయ శ్రేణి మార్కులతో బీపీటీ / బీఓటీ/ బీపీఓ/ బీఎస్సీ (పీటీ/ ఓటీ/ పీ అండ్‌ ఓ) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తికావాలి.

పీజీఈటీ 2021 వివరాలు: పరీక్ష సమయం గంటన్నర. మొత్తం మార్కులు 100. డిగ్రీ స్థాయిలో 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు.


డిగ్రీ కోర్సులు

బ్యాచిలర్‌ ఆఫ్‌ఫిజియోథెరపీ (బీపీటీ)

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీఓటీ)

బ్యాచిలర్‌ ఇన్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీఓ)


క్యాంప్‌సలు

స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) - ఒడిషా.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఎల్‌డీ) - కోల్‌కతా.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ) - చెన్నై.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: సెట్‌కు రూ.900 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800). పీజీఈటీకి రూ.1200 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: జూన్‌ 30

సెట్‌ 2021, పీజీఈటీ 2021 తేదీ: జూలై 18

పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్‌, విజయవాడ

ఫలితాలు విడుదల: సెట్‌కు ఆగస్టు 6, పీజీఈటీకి ఆగస్టు 16

ధృవపత్రాల పరిశీలన: డిగ్రీ కోర్సులకు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 9 వరకు; మాస్టర్స్‌ కోర్సులకు సెప్టెంబరు 29

చెన్నై క్యాంప్‌సలో తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 1 నుంచి

క్యాంప్‌సలో తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 20 నుంచి

ఒడిశా క్యాంప్‌సలో తరగతులు ప్రారంభం: అక్టోబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: svnirtar.nic.in

Tags :