Education-Article
జోథ్‌పూర్‌లో ఎంబీఏ

జోథ్‌పూర్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ) - ఎంబీఏ (ఇన్సూరెన్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లు ప్రత్యేకించారు. 

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్‌/ జనరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. చివరి సంవత్సర పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 - 2021 క్యాట్‌లో 50 శాతం మార్కులు/ సీమ్యాట్‌లో 160 స్కోరు/ మ్యాట్‌లో 400 స్కోరు సాధించి ఉండాలి.  

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభకు 50 శాతం, క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 15   

అర్హులైన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల: జూన్‌ 20

ఫీజు డిపాజిట్‌ తేదీ: జూన్‌ 25  

వెబ్‌సైట్‌: nlujodhpur.ac.in

Tags :