Education-Article
నేషనల్‌ లా యూనివర్సిటీలో భిన్న కోర్సులు

ఢిల్లీలో బీఏ.ఎల్‌ఎల్‌బీ 

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ డిగ్రీ (ఆనర్స్‌), పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 

ఏఐఎల్‌ఈటీ వివరాలు: ఇందులో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 150. పరీక్ష సమయం గంటన్నర. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) కోర్సుకు నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ (కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌), లీగల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాల నుంచి ఒక్కోదానిలో 35 ప్రశ్నలు, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌(న్యూమరికల్‌ ఎబిలిటీ)నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు క్రిమినల్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, లా ఆఫ్‌ కాంటాక్ట్‌, జ్యూరీ్‌సప్రుడెన్స్‌, లా ఆఫ్‌ టార్ట్‌, ఇంటర్నేషనల్‌ లా తదితర అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. పీహెచ్‌డీ కోర్సుకు మాత్రం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో సగం ప్రశ్నలను రీసెర్చ్‌ మెథడాలజీ నుంచి ఇస్తారు. మిగిలిన ప్రశ్నలను ప్రధాన లా విభాగాల నుంచి అడుగుతారు.


అడ్మిషన్స్

బిఏ.ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)

సీట్లు: 110 + 10

కోర్సు వ్యవధి: అయిదేళ్లు

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ / పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


పీహెచ్‌డీ 

సీట్లు: 13 + 2

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌ఎం/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 


ఎల్‌ఎల్‌ఎం

సీట్లు: 70 + 10

కోర్సు వ్యవధి: ఏడాది

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఎల్‌ఎల్‌బీ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.3,050 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,050)

అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడింగ్‌: జూన్‌ 5

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 20  ఠ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్టణం

వెబ్‌సైట్‌: nludelhi.ac.in

Tags :