Education-Article
పదో తరగతితో ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌

సిపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2021

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) - అడ్మిషన్‌ టెస్ట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష రాయడానికి వయోపరిమితి నిబంధనలు లేవు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ క్యాంప్‌సలో పోస్ట్‌ డిప్లొమా కోర్సు లేదు. 

నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగం అత్యంత ప్రాధాన్యం గల అంశం. నిజానికి ప్లాస్టిక్‌ లేని వస్తువు ఏదీ అంటే చెప్పడం కష్టమే. టూత్‌ పేస్ట్‌  మొదలు కొని ఆయిల్‌ ప్యాకెట్‌, పాల ప్యాకెట్‌, సర్ఫ్‌ ప్యాకెట్‌ ఇలా... ఏది తీసుకున్నా దాని ప్యాకింగ్‌ ప్లాస్టిక్‌తోనే ముడి పడి ఉంటోంది. అదేవిధంగా అకడమిక్‌ పరంగా చూసినా... సివిల్‌, ఎలకా్ట్రనిక్స్‌, కెమికల్‌, మెకానికల్‌ వంటి కోర్‌ గ్రూపులతో పోటీ పడుతున్న మరొక రంగం ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని కోర్‌ గ్రూపులకు దీటుగా ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌లోనూ ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా బీఈ/ బీటెక్‌ చేయనవసరం లేకుండానే టెన్త్‌, డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ప్లాస్టింగ్‌ ఇంజనీరింగ్‌లో తమ అర్హతలకు తగ్గ కోర్సులను ఎంచుకోవచ్చు. అలాంటి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ సిపెట్‌. ఈ సంస్థలో ఏ కోర్సులో ఉత్తీర్ణులైనా ఉద్యోగం గ్యారెంటీ.


సిపెట్‌(సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)ని 1968లో చెన్నైలో యునైటెడ్‌ నేషన్స్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) సహకారంతో భారత ప్రభుత్వం స్థాపించింది. ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతానికి ఈ రంగంలో సిపెట్‌ను మించిన మరో సంస్థ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. 1968 నుంచి 1973 వరకు ప్రపంచ వ్యాప్తంగా యూఎన్‌డీపీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసిన సంస్థలుగా గుర్తింపు పొందిన వాటిలో సిపెట్‌ ఒకటి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న సిపెట్‌ స్టార్‌ (ఖిఖీఅఖ) కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తోంది. స్టార్‌ అంటే స్కిల్‌ డెవల్‌పమెంట్‌, టెక్నాలజీ సపోర్ట్‌ సర్వీసెస్‌, అకడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌. పాలిమర్‌, దాని అనుబంధ  పరిశ్రమల అవసరాల దృష్ట్యా సిపెట్‌ కార్యకలాపాలను  దేశవ్యాప్తంగా విస్తరించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటిగా సిపెట్‌ నిలవడమే కాదు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో చేస్తున్న కృషికిగానూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. డిజైన్‌, డెవల్‌పమెంట్‌, ప్రత్యేక కోర్సుల నిర్వహణకు సంబంధించి ఐఎ్‌సఒ- 9001ః2008 క్యుఎంఎస్‌, ఐఎ్‌సఒ/ఐఇసి-17025, ఐఎ్‌సఒ/ఐఇసి-17020 వంటి అంతర్జాతీయ సర్టిఫికెట్లు పొందడం ఇందుకు నిదర్శనం.  


దేశవ్యాప్తంగా సిపెట్‌కు 37 కేంద్రాలున్నాయి. మరో 5 కేంద్రాల స్థాపన ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటిలో ఆధునిక మౌలిక వసతులున్నాయి. అదేవిధంగా డిజైనింగ్‌, క్యాడ్‌/కామ్‌/సిఎఇ, టూల్‌ అండ్‌ మౌల్డ్‌ మాన్యుఫ్యాక్షరింగ్‌, ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌, టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ వాటికి సంబంధించిన ఆధునిక ల్యాబరేటరీలు కూడా ప్రతి సిపెట్‌ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ టూలింగ్‌, ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ అస్యురెన్స్‌ వంటి అంశాల్లో తన కేంద్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం సిపెట్‌ సేవలు అందిస్తోంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులకు త్వరితగతిన ఉపాధి అవకాశాలు లభింపచేయడంలో సిపెట్‌ కృషి చేస్తోంది.


డిప్లొమా కోర్సులు

విభాగాలు: ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ, ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ

కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి.

అర్హత: పదోతరగతి/ ఐటీఐ/ ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


పోస్ట్‌ డిప్లొమా

విభాగం: ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ - క్యాడ్‌ / క్యామ్‌

కోర్సు వ్యవధి ఏడాదిన్నర. ఇందులో మూడు సెమిస్టర్లు ఉంటాయి. 

అర్హత: మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌/ ప్లాస్టిక్స్‌/ పాలిమర్‌/ టూల్‌/ ప్రొడక్షన్‌/ మెకట్రానిక్స్‌/ ఆటొమొబైల్‌/ టూల్‌ అండ్‌ డై మేకింగ్‌/ పెట్రో కెమికల్స్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ సిపెట్‌ డిప్లొమాలు (డీపీఎంటీ/ డీపీటీ) పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా

విభాగం: ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌

కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. 

అర్హత: మూడేళ్ల సైన్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 


సిపెట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.  ఇందులో 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. డిప్లొమా కోర్సులకు జనరల్‌ నాలెడ్జ్‌ (క్రీడలు, చరిత్ర, రాజకీయాలు, కంప్యూటర్‌ సైన్స్‌, కరెంట్‌ అఫైర్స్‌) నుంచి 50 ప్రశ్నలు; మేథ్స్‌, సైన్స్‌ నుంచి 40 ప్రశ్నలు; ఇంగ్లీషు నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. పీజీ డిప్లొమా కోర్సుకు జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 40; మేథ్స్‌, సైన్స్‌ నుంచి 20; ఇంగ్లీష్‌ నుంచి 20; కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ నుంచి డిగ్రీ స్థాయిలో 20 ప్రశ్నలు ఇస్తారు. పోస్ట్‌ డిప్లొమాకు జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 40; సైన్స్‌, మేథ్స్‌ నుంచి 20; ఇంగ్లీష్‌ నుంచి 20; సంబంధిత డిప్లొమా విభాగం నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. 


ముఖ్య సమాచారం

సిపెట్‌ 2021 తేదీ: జూలై చివరి వారం

పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.250)

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై మూడో వారం

వెబ్‌సైట్‌: www.cipet.gov.in


Tags :