Education-Article
స్టయిపెండరీ ట్రైనీలు

కోల్‌కతాలోని వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌ (వీఈసీసీ)- స్టయిపెండరీ ట్రైనీలు తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీలు: 52

ఉద్యోగాలు: కేటగిరీ - 1 స్టయిపెండరీ ట్రైనీలు 11 (ఫిజిక్స్‌ 4, ఎలకా్ట్రనిక్స్‌ 5, మెకానికల్‌ 1, సివిల్‌ 1); కేటగిరీ - 2 స్టయిపెండరీ ట్రైనీలు 29 (ఫిజిక్స్‌ 3, కంప్యూటర్‌ 2, ఎలకా్ట్రనిక్స్‌ 9, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 1, ఎలక్ట్రికల్‌ 6, మెషినిస్ట్‌ 3, ఫిట్టర్‌ 2, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ 3), మహిళా నర్సు 1, సబ్‌ ఆఫీసర్‌ 1, డ్రైవర్లు 3, వర్క్‌ అసిస్టెంట్లు 5, క్యాంటీన్‌ అటెండెంట్లు 2

అర్హత: నర్సులకు డిప్లొమా (నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)/ బీఎస్సీ (నర్సింగ్‌); సబ్‌ ఆఫీసర్‌కు ఇంటర్‌ (సైన్స్‌) + సంబంధిత కోర్సు;  డ్రైవర్లు, వర్క్‌ అసిస్టెంట్లు, క్యాంటీన్‌ అటెండెంట్లకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కేటగిరీ - 1 ట్రైనీల్లో ఫిజిక్స్‌ విభాగానికి ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ (మేథమెటిక్స్‌/ కెమిస్ట్రీ/ స్టాటిస్టిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌); మిగిలిన ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధిత డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కేటగిరీ - 2 ట్రైనీలకు ప్రథమ శ్రేణి మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. 

ఎంపిక: ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్‌డ్‌ టెస్టు, స్కిల్‌ టెస్టుల ద్వారా

దరఖాస్తు ఫీజు: పోస్టును అనుసరించి రూ100 / రూ.150

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 20 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

వెబ్‌సైట్‌: https://recruitment. vecc.gov.in

Tags :