ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ విద్యే. గల్లీలో ఉండే స్కూల్ నుండి ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకు అంతా ఆన్లైన్ (ఈ లెర్నింగ్) ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చకుంటున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థులకు ఇటీవల కాలంలో ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. దీంతో అనేక రకమైన ఇబ్బందులు వస్తున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. వీటిలో సమూలైన మార్పులు వస్తే తప్ప విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్ధం కాని పరిస్థితులు ఉన్నాయి.
అయితే వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశాలను ప్రాక్టికల్లి సంస్థ గుర్తించింది. ఇందుకోసం తగిన ప్రణాళికను సిద్దం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల వరకు సులువుగా ఆన్లైన్ విద్యా అర్థం అయ్యేలా చేయనుంది. కరోనా వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగస్థులు ఇలా ప్రతి రంగానికి చెందిన వారు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుండి పనులు చక్కబెడుతున్న వారు ఇలాంటి సరళీకృతమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వీరందరి కోసం ఏ ఆర్ సాంకేతికతో కూడిన ప్రత్యేక పద్దతులను ఉపయోగించి, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యను ఆన్లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తుంది ప్రాక్టికల్లి.
సామాన్యంగా విద్యార్థులకు బోధన ఎలా ఉంటుంది అంటే.. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నంత సేపు వారికి అర్థం అయినట్టే ఉంటారు. తరగతి గది నుండి ఉపాధ్యయుడు బయటికి వెళ్లగానే మర్చిపోతారు. అయితే ఇక్కడ ఒక ఉదహారణ మనం చెప్పుకోవాలి. విద్యార్థి ఇంట్లో టీవీ కానీ, సినిమా కానీ ఇంకా ఏదైన కార్యక్రమం చూస్తే... మరసటి రోజు ఆ సన్నివేశాల గురించి తోటి మిత్రులకు వివరిస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. విద్యార్థులకు విద్య అనేది చిత్ర రూపకంగా చెబితే ఇంకా బాగా అర్ధం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రాక్టికల్లి సంస్థ ఇందుకు అనుగుణంగా విద్యార్థులకు చేరువయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
ఇక ఆన్లైన్ తరుగతులు విద్యార్థులకు చేరవేయడానికి నిత్యం ఒక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. నూతనంగా వస్తున్న వర్చ్యుయల్, ఆగ్ మెంటెడ్ రియాల్టీ మరియూ సిమ్ములేషన్ సాంకేతికతను వినియోగించడం వల్ల విద్యార్థులకు 90%ఎక్కువగా గుర్తుకు వుండే అవకాశం ఉంది.
సవాళ్లను ఎలా అధిగమిస్తాం :
ఎడ్టెక్ కంపెనీలు సరైన చర్యలను తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులకు మాత్రమే వారు సిద్ధం కాకుండా భవిష్యత్ సవాళ్లకు సైతం వారు చురుగ్గా సిద్ధంకావాలి అని ప్రాక్టికల్లీ కో–ఫౌండర్ అండ్ సీఓఓ శ్రీమతి చారు నోహారియా అభిప్రాయపడుతున్నారు