Education-Article
‘ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌’ యాప్ ఆవిష్కరణ

ప్రతి విద్యార్థి యొక్క వృద్ధిని అతి సన్నిహితంగా పర్యవేక్షించేలా ఉపాధ్యాయులకు సాధికారితను కల్పిస్తోంది ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌. దీనిలో 3వేలకు పైగా వీడియోలు మరియు 1000+పైగా సిమ్యులేషన్స్‌ ఉంటాయి. ఈ యాప్‌ను ప్రస్తుతం 13500కు పైగా టీచర్లు, 130కుపైగా పాఠశాలలతో పాటుగా విదేశాలలో కూడా వినియోగిస్తున్నారు. 


హైదరాబాద్‌, 20 జనవరి 2021: థర్డ్‌ ఫ్లిక్స్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఆచరణాత్మక, విప్లవాత్మకమైన ఉత్పత్తి ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ను పాఠశాల ఉపాధ్యాయుల అవసరాలను తీర్చనుంది. వీరు అభ్యాసాంశాలతో కూడిన విషయపరిజ్ఞానాన్ని అందించే రీతిలో తీర్చిదిద్దిన ప్రాక్టికల్లీ ద్వారా ఆరవ తరగతి నుంచి 12 వ తరగతి  వరకూ స్టెమ్‌ సబ్జెక్ట్‌ వ్యాప్తంగా పలు అంశాలను బోధించవచ్చు. కేవలం అభ్యసించడం మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా అభ్యసించండి అనే విధానంతో ఈ పరిష్కారం, భౌతిక తరగతి గది లేదంటే వర్ట్యువల్‌ ఫార్మాట్‌లో సైతం విద్యార్ధుల అనుసంధానతను వృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది.

అభ్యాసాన్ని మరింత ప్రత్యక్షంగా మలిచే రీతిలో తీర్చిదిద్దబడిన, ప్రాక్టీకల్లీ ఇప్పుడు ప్రపంచంలో గేమ్‌ ఇంజిన్‌, లీనమయ్యే అభ్యాస అంశాలు మరియు ఏఐ సహాయక అభ్యాసాన్ని ఒకే ఒక్క సమగ్రమైన క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ యాప్‌లో మిళితం చేసిన ఒకే ఒక్క యాప్‌గా నిలిచింది.


ఆచరణాత్మక పాఠశాల పరిష్కారం

ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ అనేది బీ2బీ2సీ ఆఫరింగ్‌. రాజమహేంద్రవరంలోని ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఛైర్మన్‌ శేఖర్‌ వీ దాస్‌ మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం మార్చిలో మేము మా క్యాంపస్‌ను మూసివేసిన తరువాత, మా సిబ్బందికి అత్యంత సవాల్‌తో కూడిన సమయం ఎదురైంది. ఎన్నో పరిష్కారాలను మేము అన్వేషించిన తరువాత, ప్రాక్టికల్లీ స్కూల్‌ సొల్యూషన్‌ మా దృష్టిని ఆకర్షించింది. దీనిని మేము గత 9 నెలలుగా వాడుతున్నాము.  వీడియోలు, సిమ్యులేషన్‌ల పట్ల విద్యార్థులు పూర్తి ఆసక్తిని కనబరిచారు. మా ఉపాధ్యాయులు సైతం అపారమైన కంటెంట్‌ లైబ్రరీ, షెడ్యూలింగ్‌, టెస్ట్‌ ప్రిపరేషన్‌ ఫీచర్లను అతి సులభంగా వినియోగించుకుంటున్నారు.

Tags :