ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు
ఇండియన్‌ ఆర్మీ - గ్రాంట్‌ ఆఫ్‌ పర్మనెంట్‌ కమిషన్‌ కోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఈ సెమిస్టర్‌ పరీక్షలన్నీ ఉత్తీర్ణులైన అభ్యర్థులను లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ హోదాలో నియమిస్తారు.
 
కోర్సు ప్రారంభం: 2019 జనవరి
 
అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ లేదా పన్నెండో తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయసు: కోర్సు ప్రారంభం నాటికి అభ్యర్థులు 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌ల్లో సంస్థ నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల ప్రకారం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్యూ నిర్వహిస్తారు. సైకాలజిస్టు, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అయిదు రోజులు జరిగే ఈ ఇంటర్వ్యూల్లో రెండు స్టేజ్‌లు ఉంటాయి. మొదటి స్టేజ్‌లో అర్హత పొందినవారిని మాత్రమే సెకండ్‌ సెకండ్‌ స్టేజ్‌కు పంపుతారు. ఇందులో అర్హత పొందినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఇంటర్వ్యూ మార్కుల ప్రకారమే మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు.
 
ఎస్‌ఎస్‌బీ సెంటర్లు: అలహాబాద్‌, భోపాల్‌, బెంగళూరు, కపుర్తల.
 
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ప్రారంభం: 2018 జూలై
 
ట్రైనింగ్‌ వ్యవధి: అయిదేళ్లు
 
ట్రైనింగ్‌ వివరాలు: మొదట ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ (గయ)లో ఏడాదిపాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ ఇస్తారు. ఆ తరవాత టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఇందులో రెండు ఫేజులు ఉంటాయి. మొదటి ఫేజులో మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. రెండో ఫేజులో ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. వీటిని సీఎంఈ - పుణెలోగానీ ఎంసీటీఈ - మహౌలోగానీ ఎంసీఈఎంఈ - సికింద్రాబాద్‌లోగానీ నిర్వహిస్తారు.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 14
 
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in