పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ - నార్తర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం కోసం డిప్లొమా ట్రైనీ, జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 28
 
పోస్టులవారీ ఖాళీలు: డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్‌ 20, సివిల్‌ 5), జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) 3
 
అర్హత: డిప్లొమా ట్రైనీలకు సంబంధిత విభాగంలో 70 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలకు 55 శాతం మార్కులతో (పీజీ / పీజీ డిప్లొమా / ఎంబిఏ) (హ్యూమన్‌ రిసోర్స్‌ / పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ / ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ / ఎంఎస్‌డబ్ల్యు) ఉత్తీర్ణులై ఉండాలి.
 
వయసు: దరఖాస్తు నాటికి 27 ఏళ్లు మించకూడదు.
 
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
 
స్టయిపెండ్‌: నెలకు రూ.16,500
 
ఎంపిక: అభ్యర్థులను సెలెక్షన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. జూనియర్‌ ఆఫీసర్లకు కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది.
 
సెలెక్షన్‌ టెస్ట్‌ వివరాలు: ఇందులో రెండు పార్టులు ఉంటాయి. పార్టు 1లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ టెస్ట్‌లో సంబంధిత విభాగం నుంచి 120 ప్రశ్నలు ఇస్తారు. పార్టు 2లో సూపర్‌వైజరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది.
 
దరఖాస్తు ఫీజు: రూ.300
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 27
 
వెబ్‌సైట్‌: www.powergridindia.com