జిప్‌మర్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జిప్‌మర్‌లో ఉద్యోగాలు
జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌) - మంగళగిరి, నాగపూర్‌ ఎయిమ్స్‌ క్యాంపస్‌ల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 104 (ఒక్కో క్యాంపస్‌కు 52 ఖాళీలు ఉన్నాయి).
 
విభాగాలు: అనాటమీ/ ఫిజియాలజీ / బయోకెమిస్ట్రీ / కమ్యూనిటీ మెడిసిన్‌ / పాథాలజీ / మైక్రోబయాలజీ / ఫార్మకాలజీ / ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ
పోస్టులవారీ ఖాళీలు: ఒక్కో క్యాంపస్‌లో ప్రొఫెసర్‌ 8, అడిషనల్‌ ప్రొఫెసర్‌ 4, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 4, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 16, సీనియర్‌ రెసిడెంట్‌ 12, ట్యూటర్స్‌ / డెమాన్‌స్ట్రేటర్స్‌ 8 ఖాళీలు ఉన్నాయి.
 
అర్హత: ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో ఎండి / ఎంఎస్‌ / డిఎన్‌బి పూర్తిచేసి ఉండాలి. పోస్టును అనుసరించి నిర్దేశించినమేరకు టీచింగ్‌ / రీసెర్చ్‌ అనుభవం ఉండాలి. ట్యూటర్‌ / డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులకు ఎంబిబిఎస్‌ లేదా సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
 
వయసు: దరఖాస్తు నాటికి ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెసర్లకు 58; అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 50; సీనియర్‌ రెసిడెంట్‌కు 33; డెమాన్‌స్ట్రేటర్స్‌ / ట్యూటర్స్‌కు 35 ఏళ్లు మించరాదు
 
నెల వేతనం: ప్రొఫెసర్లకు రూ.1,59,100 అడిషనల్‌ ప్రొఫెసర్లకు రూ.1,39,600 అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రూ.1,31,400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.1,01,500 సీనియర్‌ రెసిడెంట్లకు రూ.67,700 ట్యూటర్‌/ డెమాన్‌స్ట్రేటర్లకు రూ.56,100 ఇస్తారు
 
ఎంపిక: ప్రొఫెసర్‌ పోస్టులన్నింటికీ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా సీనియర్‌ రెసిడెంట్‌, ట్యూటర్‌ / డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ / ఎస్టీలకు రూ.200 కాగా దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 16
 
వెబ్‌సైట్‌: www.jipmer.puducherry.gov.in