నెగ్గుదాం నీట్...
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నెగ్గుదాం నీట్...
బైపీసీ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌ - యూజీ) నోటిఫికేషన్‌ వెలువడింది. దేశ వ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఈ పరీక్షను సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) నిర్వహిస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ప్రత్యేక నిబంధనల కారణంగా ఈ పరీక్షకు మన విద్యార్థులు అర్హులేనా? సెంట్రల్‌ పూల్‌లో చేరితే లాభమా? నష్టమా? అనే కోణంలో ఎన్నో చర్చలు జరిగాయి. అంతిమంగా నీట్‌ తప్పనిసరి అని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో డాక్టర్‌ కలను సాకారం చేసే నీట్‌ పరీక్ష విధానం, మెరుగైన ర్యాంక్‌కు చేయాల్సిన సన్నాహాలపై విశ్లేషణ...
 
సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే నీట్‌లో అర్హత సాధించటం (ఎయిమ్స్‌, జిప్‌మర్‌ సంస్థలకు మినహాయింపు ఉంది) తప్పనిసరి. నీట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా మే 6వ తేదీన నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో భాగస్వామ్యమైన అన్ని రాష్ర్టాలు.. తమ రాష్ర్టాల్లోని మెడికల్‌ / డెంటల్‌ కోర్సుల్లో 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించాల్సి ఉంటుంది. మిగతా 85 శాతం సీట్లు ఆయా రాష్ర్టాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
 
ఆల్‌ ఇండియా కోటాలోని 15 శాతం సీట్ల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు. దీనికి సంబంధించిన మెరిట్‌లిస్ట్‌ను సీబీఎస్‌ఈ రూపొందిస్తుంది. దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తుంది.
 
ఏఎఫ్‌ఎంసీ, ఈఎస్‌ఐ, బీహెచ్‌యూ, ఏఎంయూ, డీమ్డ్‌ యూనివర్సిటీలు ఆల్‌ ఇండియా కోటాలో ఉంటాయి.
 
తెలుగు రాష్ర్టాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు ఈ ఏడాది 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటాకు ఇవ్వడానికి అంగీకరించాయి. తద్వారా ఆల్‌ ఇండియా కోటాలోని సీట్లకు పోటీపడే అవకాశం తెలుగు విద్యార్థులకు లభిస్తుంది. దీంతో సీటు తెచ్చుకొనే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి. మిగతా 85 శాతం సీట్లను తెలుగు రాష్ర్టాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు. తెలుగు రాష్ర్టాల విద్యార్థులు గమనించాల్సిన కీలక మార్పు.. ఈ సంవత్సరం నుంచి ఆయుష్‌ కోర్సులకు (ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి వంటివి) కూడా నీట్‌ ర్యాంక్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు. కాబట్టి ఆయుష్‌ కోర్సులు లక్ష్యంగా ఉన్న వారు కూడా నీట్‌ రాయాల్సిందే. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ రాయాల్సి ఉంటుంది.
 
అబ్రాడ్‌ మెడిసిన్‌కు కూడా
మరో కీలక అంశం.. విదేశీ యూనివర్సిటీల నుంచి మెడిసిన్‌ / డెంటల్‌ కోర్సులు చేయాలనుకునేవారు నిర్దేశించిన విధంగా నీట్‌లో అర్హత సాధించాలి. లేనిపక్షంలో అనుమతించరు. విదేశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఆశించిన ప్రమాణాలు ఉండటం లేదు. దీంతో కొన్ని ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. గతంలో 12వ తరగతిలో 50 శాతం మార్కులుంటే విదేశాల్లో మెడిసిన్‌ చేసేందుకు మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్‌ఓసీ జారీ చేసేది.
 
పరీక్ష విధానం
పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, ఉర్దూ, తమిళం, అస్సామీ భాషల్లో కూడా నీట్‌ ఉంటుంది. తెలుగు విద్యార్థులకు తెలుగు / ఇంగ్లీష్‌ భాషల్లో ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ఇందులో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ నుంచి 180 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పునకు ఒక మార్కు కోత విధిస్తారు సమాధానాలను గుర్తించడానికి మూడు గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
సబ్జెక్ట్‌            ప్రశ్నలు           మార్కులు
బయాలజీ      90                   360
ఫిజిక్స్‌          45                   180
కెమిస్ర్టీ          45                   180
 
బయాలజీ
11, 12వ తరగతికి చెందిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని సీబీఎస్‌ఈ నీట్‌ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తెలుగు విద్యార్థుల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఎంచుకున్నవారు తక్కువగా ఉంటారు. సీబీఎస్‌ఈ విధానంలో 11వ తరగతి నుంచి బయాలజీని చదివిన వారు తెలుగు విద్యార్థులతో పోల్చితే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. మన దగ్గర ఇంటర్మీడియెట్‌లో బయాలజీని బోటనీ, జువాలజీగా విభజించారు. కానీ సీబీఎస్‌ఈలో బయాలజీ ఒకే సబ్జెక్ట్‌గా ఉంటుంది. బోటనీ, జువాలజీ అంటూ విభజన ఉండదు. తెలుగు రాష్ర్టాల్లోని ఇంటర్మీడియెట్‌ బోర్డులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను పరిశీలించి కొన్ని సబ్జెక్ట్‌లకు సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతుల పుస్తకాలను చదవడం మంచిది. అయితే కచ్చితంగా 11, 12 తరగతుల సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయని చెప్పలేం. కాబట్టి 8 నుంచి 10 తరగతి వరకు ఉన్న బయాలజీ సిలబస్‌పై కూడా అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీతో పోల్చినప్పుడు అదనపు పాఠ్యాంశాలను నేర్చుకోవడం సగటు విద్యార్థిపై అదనపు భారాన్ని మోపడమే. ఉదాహరణకు మన సిలబస్‌లో యానిమల్‌ టిష్యూ, ఎంజైమ్‌ల గురించి కొన్ని అదనపు అంశాలను చేర్చారు. నీట్‌ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో లేని అంశాలను చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
నీట్‌ కోసం నిర్దేశించిన ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో 11వ తరగతిలో 22 అధ్యాయాలు, 12వ తరగతిలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 38 అధ్యాయాలను సమగ్రంగా చదవాలి. ఇందులో ప్రతి అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు రావొచ్చు. వీటితోపాటు 11వ తరగతిలోని ప్లాంట్‌ ఫిజియాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, 12వ తరగతిలోని జెనెటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ యూనిట్‌లో ప్రతి అధ్యాయం నుంచి 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
బయాలజీలో డయాగ్రామ్‌ ఆధారంగా కాన్సెప్ట్స్‌ను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల అవగాహన పెరగడంతోపాటు కాన్సెప్ట్‌ / డయాగ్రామ్‌ ఆధారిత ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. 11వ తరగతిలో చదవాల్సిన అంశాలు...
ప్లాంట్‌ కింగ్‌డమ్‌, యానిమల్‌ కింగ్‌డమ్‌ అధ్యాయాలలో జీవరాశుల పేర్లు, శాస్త్రీయ నామాలతో ఉదాహరణలుగా ఇచ్చారు. వీటిపై అవగాహన పెంచుకోవాలి. ఫోటోసింథిసిస్‌, రెస్పిరేషన్‌ సైకిల్స్‌కు సంబంధించిన ఫ్లో చార్ట్స్‌ను విరివిగా ప్రాక్టీస్‌ చేయాలి.
డైజెస్టివ్‌ సిస్టమ్‌, రెస్పిరేటరీ సిస్టమ్‌, ఎక్రటరీ సిస్టమ్‌లలో భాగాల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి.
బయోమాలిక్యుల్స్‌ చాప్టర్‌ ఆర్గానిక్‌ కెమిస్ర్టీతో అనుసంధానమై ఉంటుంది. ప్రిపరేషన్‌లో కెమిస్ర్టీ పరిజ్ఞానాన్ని అన్వయించడం ప్రయోజనకరం.
సెల్‌ డివిజన్‌కు సంబంధించి మిటోసిస్‌, మీయోసిస్‌ మధ్య తేడాలను ఎక్కువగా నేర్చుకోవాలి.
స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్‌ అంశంలోని వానపాము, బొద్దింక, కప్పలకు సంబంధించిన వ్యవస్థలపై కచ్చితమైన అవగాహన ఉండాలి.
12వ తరగతిలో మొదటి నాలుగు అధ్యాయాలను డయాగ్రామ్‌ ఆధారిత కాన్సెప్ట్‌తో సులభంగా అవగాహన చేసుకోవచ్చు. 12వ తరగతిలో అంశాలు...
Principles of Inheritance and Variation చాప్టర్‌లోను తప్పనిసరిగా చదవాలి.
Molecular Basis of Inheritance చాప్టర్‌లో స్కీమాటిక్‌ డయాగ్రామ్స్‌ నేర్చుకోవాలి.
 
రిఫరెన్స్‌ బుక్స్‌
Cengage Learning India A to Z Biology for NEET Class XI, XII.
Objective NCERT at your Fingertips (NEET) -Biology
 
కెమిస్ర్టీ
ఇందులో వచ్చే ప్రశ్నల్లో 35 వరకు సులభంగానే ఉంటాయి.
కెమిస్ర్టీ కోసం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అకాడమీ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. తరవాత మాక్‌ టెస్ట్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రతి ప్రశ్న నేపథ్యాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలి. తద్వారా ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలరు. పరీక్షలో సమయం ఆదా అవుతుంది. చాలా మంది ప్రిపరేషన్‌ కోసం రకరకాల పుస్తకాలను చదువుతుంటారు. ఏ పుస్తకాన్నీ పరిపూర్ణంగా చదవరు. ఏదైనా ఒక పుస్తకానికి మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయడం ఉత్తమం.
ఆవర్తన పట్టిక, రసాయన బంధం, సమన్వయ సంయోజనీయ బంధం, ఎస్‌, పీ, డీ, ఎఫ్‌ బ్లాక్‌ మూలకాలు.. అధ్యయాలను సమగ్రంగా చదవాలి. వాటిలోని ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి.
స్టాకియోమెట్రీలో మోల్‌, తుల్యాంక భారం, భారం - ఘనపరిమాణం అంశాలపై క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. తద్వారా రసాయన శాస్త్రంలోని ప్రాబ్లమ్స్‌ను సులభంగా చేసే అవకాశం ఉంటుంది.
కర్బన రసాయనశాస్త్రంలో నామకరణ విధానం, అణుసాదృశ్యం బాగా చదవాలి. ఇందులోని సమీకరణాలపై పట్టు సాధించాలి. అంతేకాకుండా భౌతిక ధర్మాలు, భేదపరిచే విషయాలను క్షుణ్నంగా చదివి ప్రాక్టీస్‌ చేయడం ఉత్తమం.
ప్రతి అధ్యాయంలో అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. ఎందుకంటే టాపిక్‌ చివరి కొన్ని తెలియని అంశాలు ఉండే అవకాశం ఉంటుంది. సులువే అని ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకూడదు.
ఒకే ప్రశ్నలో రెండు లేదా మూడు ప్రాబ్లమ్స్‌ ఇమిడి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించి వాటికి సరిపోయే సూత్రాలను నోట్‌ చేసుకోవాలి.
కర్బన రసాయనశాస్త్రంపై అధికంగా దృష్టి సారించాలి. భౌతిక రసాయన శాస్త్రంలో థియరీ భాగానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ఫిజిక్స్‌
ఇందులో 45 ప్రశ్నలను ప్రయత్నించే విధంగా ప్రిపరేషన్‌ ఉండాలి. ప్రతి అధ్యాయంలోని కాన్సెప్ట్స్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.
రోజూ మాక్‌ టెస్ట్‌లు రాయాలి. గంటకు 45 ప్రశ్నలు సాధించే విధంగా ప్రణాళికతో ఉండాలి. తద్వారా సమయపాలన, కచ్చితమైన సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం అలవడుతుంది.
ఫిజిక్స్‌లో 25 నుంచి 30 ప్రశ్నలను సాధించాలనుకునే విద్యార్థులు ఎలక్ర్టోడైనమిక్స్‌, మోడ్రన్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌, ఎస్‌హెచ్‌ఎం, వేవ్స్‌, సిస్టమ్‌ ఆప్‌ పార్టికల్స్‌, గ్రావిటేషన్‌, లాస్‌ ఆఫ్‌ మోషన్‌ పాఠ్యాంశాలపై దృష్టిసారించాలి. 2017 నీట్‌ ఫిజిక్స్‌
విశ్లేషణ..
అధ్యాయం              ప్రశ్నలు            మార్కులు
ఎలక్ర్టోడైనమిక్స్‌        10                   40
హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌ 5             20
మెకానిక్స్‌               13                    52
మోడ్రన్‌ ఫిజిక్స్‌         8                     32
ఆప్టిక్స్‌                    5                      20
ఎస్‌హెచ్‌ఎం, వేవ్స్‌    4                      16
 
ముఖ్య సమాచారం
అర్హత: 50 శాతం మార్కులతో 12వ తరగతి / తత్సమానం (ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ / బయోటెక్నాలజీ, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌లతో). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 17 ఏళ్లు (డిసెంబర్‌ 31, 2018 నాటికి).
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9, 2018.
తెలుగు రాష్ర్టాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు.
 
వెబ్‌సైట్‌: http://cbseneet.nic.in/