రైల్వే బోర్డు నుంచి మరో భారీ నోటిఫికేషన్
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
రైల్వే బోర్డు నుంచి మరో భారీ నోటిఫికేషన్
26 వేలకు పైగా అసిస్టెంట్ లొకో పైలట్, టెక్నిషియన్ పోస్టులకు మూడు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ రైల్వే.. తాజాగా గ్రూప్-డీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈసారి ఏకంగా 62,907 గ్రూప్-డి పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో విడుదలైన గ్రూప్-డీ నోటిఫికేషన్లకు అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ, బీటెక్ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పోస్టులకు కూడా భారీగా కాంపిటీషన్ నెలకొంది.
 
మొత్తం ఖాళీలు: 62,907
 
పోస్టులు: గ్రూప్-డి (గ్యాంగ్‌మన్, స్విచ్‌మన్, ట్రాక్‌మన్, కేబిన్‌మన్, లెవర్‌మన్, పాయింట్స్‌మన్, హెల్పర్, స్టోర్, కీమన్, షంటర్, వెల్డర్, ఫిట్టర్, పోర్టర్.. తదితర పోస్టులు)
 
అర్హత: పదో తరగతి, ఐటీఐ (చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే).
 
వయసు: 18 నుంచి 31 ఏళ్ల వయసు (జూలై 1, 2018 నాటికి)
 
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా
 
వేతనం: 18,000 మరియు అలవెన్స్‌లు
 
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 10-02-2018
 
దరఖాస్తులకు చివరి తేదీ: 12-03-2018
 
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మహిళలు, దివ్యాంగులకు రూ. 250. మరియు జనరల్ అభ్యర్థులకు రూ. 500.
 
వెబ్‌సైట్:   http://www.rrcb.gov.in/rrbs.html (ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ తర్వాత మాత్రమే లింక్స్ యాక్టివేట్ అవుతాయి)