ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఒసిఎల్‌) - వివిధ రిఫైనరీ యూనిట్లలో ట్రేడ్‌ అప్రెంటీస్‌ (నాన్‌ టెక్నికల్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 101
 
విభాగాలవారీ ఖాళీలు: సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ 75, అకౌంటెంట్‌ 26
రిఫైనరీ యూనిట్లు: గువహటి, దిగ్భోయ్‌, బాన్‌గైగాన్‌, బరౌనీ, వడోదర, హల్దియా, మథుర, పానిపట్‌, పారదీప్‌
 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బిఏ/ బికాం/ బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ వారి డిగ్రీ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. బిఇ/ బిటెక్‌/ ఎంబిఏ/ ఎంసిఏ/ సీఏ/ ఎల్‌ఎల్‌బి అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. పార్ట్‌ టైం/ డిస్టెన్స్‌ / కరస్పాండెన్స్‌ డిగ్రీలను అనుమతించరు.
 
వయసు: జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 3
రాత పరీక్ష జరుగు తేదీ: ఫిబ్రవరి 18
ఫలితాల విడుదల: ఫిబ్రవరి 23
పర్సనల్‌ ఇంటర్వ్యూ: మార్చి 5, 6
 
వెబ్‌సైట్‌: www.iocl.com