బార్క్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బార్క్‌లో ఉద్యోగాలు
అణువిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలనే ఆకాంక్ష, సృజనాత్మక పరిశోధనల మీద ఆసక్తితోపాటు సైంటిస్టులుగా స్థిరపడాలనుకునే వారికోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డిఎఇ) సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్‌, సైన్స్‌ & ఫిజిక్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్దేశించిన OCES/ DGFS స్కీమ్‌లకు ప్రకటన విడుదల చేసింది. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూళ్లలో శిక్షణ ఇచ్చి గ్రూప్‌ A గెజిటెడ్‌ ఆఫీసర్‌ కేడర్‌తో సమాన హోదాగల సైంటిఫిక్‌ ఆఫీసర్లుగా రిక్రూట్‌ చేసుకుంటుంది. పరిశోధనా రంగంలో సమున్నత కెరీర్‌కి ఊతమిచ్చే ఈ స్కీమ్‌ల వివరాలు...
 
బార్క్‌ ప్రోగ్రామ్‌లు
బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రైనింగ్‌ స్కూల్స్‌ రెండు రకాల స్కీమ్స్‌ నిర్వహిస్తున్నాయి.
ఓరియంటేషన్‌ కోర్స్‌ ఫర్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ అండ్‌ సైన్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ (OCES)
డిఎఇ గ్రాడ్యుయేట్‌ ఫెలోషిప్‌ స్కీం ఫర్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ అండ్‌ ఫిజిక్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ (DGFS)
 
OCES (Scheme 1)
ఏడాది వ్యవధి గల ఈ స్కీమ్‌కు ఇంజనీరింగ్‌ గ్రాడ్యు యేట్స్‌, సైన్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్లకు ముంబై, కల్పక్కం, ఇండోర్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ట్రైనింగ్‌ ఉంటుంది.
 
OCES క్యాంపస్‌లు
బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ముంబై
ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ ఆటమిక్‌ రీసెర్చ్‌, కల్పక్కం
రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఇండోర్‌
న్యూక్లియర్‌ ఫ్లూయెల్‌ కాంప్లెక్స్‌, హైదరాబాద్‌
ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌
ఈ కోర్సు పూర్తిచేసిన ట్రైనీలను డిఎఇ యూనిట్లలో సైంటిఫిక్‌ ఆఫీసర్లుగా నియమిస్తారు. అంతకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి హోమి బాబా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌బిఎన్‌ఐ)లో ఎంటెక్‌ / ఎంఫిల్‌ చేసే అవకాశం ఇస్తారు.
 
DGFS (Scheme 2)
ఇది రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌, ఫిజిక్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఐఐటి క్యాంపస్‌ల్లో ఎంటెక్‌ / ఎం. కెమికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తారు.
 
DGFS క్యాంపస్‌లు
ఐఐటి- బాంబే/ ఢిల్లీ/గువహటి/కాన్పూర్‌/ఖరగ్‌పూర్‌/ మద్రాస్‌/ రూర్కీ
బిహెచ్‌యు - వారణాసి నిట్‌ - రూర్కెలా
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ - ముంబై
ఈ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులను బార్క్‌ - ముంబై, ఐజిసిఎఆర్‌ - కల్పక్కం యూనిట్లలో సైంటిఫిక్‌ ఆఫీసర్లుగా నియమిస్తారు.
ట్రైనింగ్‌ సమయంలో నెలకు రూ.35,000 స్టయిపెండ్‌తో పాటు బుక్‌ అలవెన్స్‌ కింద రూ.10,000 ఇస్తారు. DGFS ఫెలోస్‌కు కోర్సు ట్యూషన్‌ ఫీజు, కంటిజెన్సీ గ్రాంట్‌ కింద రూ.25,000, ప్రాజెక్ట్‌ వర్క్‌ ఖర్చులు కూడా ఇస్తారు. ఉచిత హాస్టల్‌ సౌకర్యం ఉంది.
 
వేతనం: డిఏ, హెచ్‌ఆర్‌ఏ, టిఏ అన్నీ కలిపి నెలకు రూ.84,000 వరకు వేతనం లభిస్తుంది.
 
అర్హత వివరాలు
ఇంజనీరింగ్‌ విభాగం: మెకానికల్‌, కెమికల్‌, మెట లర్జికల్‌, మెటీరియల్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచుల్లో బిఇ/ బిటెక్‌/ బిఎస్సీ - ఇంజనీరింగ్‌/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేసి ఉండాలి. న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌, న్యూక్లియర్‌ టెక్నాలజీ, న్యూక్లియర్‌ సైన్స్‌ & టెక్నాలజీ అభ్యర్థులు కూడా అర్హులే.
సైన్స్‌ విభాగం: బిఎస్సీ (ఎంపిసి) తోపాటు ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ ఫిజిక్స్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బిఇ/ బిటెక్‌ (ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కెమిస్ట్రీ, బయోసైన్సెస్‌, రేడియోలాజికల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌, జియాలజీ, జియో ఫిజిక్స్‌ అభ్యర్థులను కూడా అనుమతిస్తారు. ఏ డిగ్రీలోనైనా అభ్యర్థులకు తప్పనిసరిగా 60 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో కానీ, ఫిజిక్స్‌ / ఇంజనీరింగ్‌ సైన్స్‌లోకానీ గేట్‌ 2017 / 2018 స్కోరు ఉండాలి.
డిజిఎఫ్‌ఎస్‌: పైన తెలిపిన బ్రాంచుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ బిఎస్సీ (ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు పీజీ (ఫిజిక్స్‌) / తత్సమాన అర్హత ఉన్నవారు ఈ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. OCES స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు కూడా అర్హులే.
 
వయసు: ఆగస్టు 1 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 26 ఏళ్లు, ఒబిసిలకు 29 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 31 ఏళ్లు మించకూడదు.
 
ఎంపిక
ఆన్‌లైన్‌ టెస్ట్‌ లేదా గేట్‌ 2017/2018 స్కోరు ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ సంబంధిత అంశాల్లో బిఇ / బిటెక్‌ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ రాయాలి. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (UM -DAE CBS), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (NISER - Bhubaneswar) నుంచి 7.5 జిపిఏతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు. వీరిని నేరుగా ఇంటర్వ్యూకి అనుమతిస్తారు.
 
ఆన్‌లైన్‌ టెస్ట్‌ వివరాలు
పరీక్ష సమయం 2 గంటలు. ఈ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌లో 100 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఇంజనీరింగ్‌/ సైన్స్‌ విభాగాల్లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని, అభ్యర్థి జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
ఈ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఇసిఐఎల్‌) నియామకాలకు నేరుగా పరిగణనలోకి తీసుకుంటారు.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 4
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 3 వరకు
వెబ్‌సైట్‌: www.barconlineexam.in