కెనరా బ్యాంకులో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కెనరా బ్యాంకులో ఉద్యోగాలు
బ్యాంకింగ్‌లో శిక్షణ.. వెంటనే ఉద్యోగం
 
కెనరా బ్యాంక్‌ నుంచి భారీ ప్రకటన విడుదలైంది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌ 1 కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌’ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు పూర్తిచేసుకొన్న అభ్యర్థులను వివిధ బ్రాంచ్‌ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్‌గా నియమిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం....
 
మొత్తం ఖాళీలు: 450 (వీటిలో జనరల్‌ వర్గానికి 227, ఒబిసిలకు 121, ఎస్సీలకు 67, ఎస్టీలకు 35 ఖాళీలను కేటాయించారు.)
 
వేతనం
పిఓగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,700 - 42020 వేతనశ్రేణితోపాటు డియర్‌నెస్‌ అలవెన్స్‌, హెచ్‌ఆర్‌ఏ, సిసిఎ, మెడికల్‌ ఎయిడ్‌, లీవ్‌ ఫేర్‌ కన్సెషన్‌ ఇస్తారు. క్వార్టర్స్‌, ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
 
అర్హత
జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రిజర్వుడు వర్గాలవారికి 55 శాతం మార్కులు వస్తే చాలు.
 
కోర్సు వివరాలు
ఏడాది వ్యవధి గల ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి గానీ మంగళూరులోని ఎన్‌ఐటిటిఇ ఎడ్యుకేషన్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి గానీ చేయాల్సి ఉంటుంది. కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు 9 నెలలపాటు రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లో బోధనాపరమైన శిక్షణ ఉంటుంది. తరవాత కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌/ ఆఫీస్‌లో 3 నెలలు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు పోస్టింగ్‌ తరవాత రెండేళ్లు ప్రొబేషన్‌ ఉంటుంది. అభ్యర్థులు పోస్టింగ్‌ తీసుకున్న నాటినుంచి అయిదేళ్లపాటు బ్యాంకులో పనిచేయడానికి అంగీకరిస్తూ బాండ్‌ సమర్పించాలి.
 
ఎంపిక
అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేసి వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ను ముంబైలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబిపిఎస్‌) నిర్వహిస్తుంది.
 
ఆన్‌లైన్‌ టెస్ట్‌ వివరాలు
పరీక్ష సమయం 2 గంటలు. మొత్తం మార్కులు 200. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు) అడుగుతారు. ఇంగ్లీష్‌ మినహా అన్ని విభాగాలను ఇంగ్లీష్‌ అండ్ హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలను గుర్తించినపుడు వాటిలో సరైన సమాధానం ఉన్నా కూడా దానిని తప్పుగా పరిగణించి కోత విధిస్తారు. ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే ఎటువంటి పెనాల్టీ ఉండదు. బ్యాంకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల మేరకు అభ్యర్థి ప్రతి విభాగంలోను కనీసార్హత సాధించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్టులో అర్హత పొందినవారిని బ్యాంకులో ఉన్న ఖాళీలను అనుసరించి అభ్యర్థుల మెరిట్‌ ప్రకారం 1:3 నిష్పత్తిలో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకి పిలుస్తారు.
 
జిడి, ఇంటర్వ్యూ వివరాలు
ఒక్కోదానికి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు అర్హత సాధించాలంటే రెండింటిలో 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ / ఒబిసి / దివ్యాంగులకు 35 శాతం వస్తే చాలు. ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల వెయిటేజీని 50:20:30గా నిర్ణయించారు.
 
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
 
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.708 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.118)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 31
కాల్‌ లెటర్‌ డౌన్‌లోడింగ్‌: ఫిబ్రవరి 20 తరవాత
ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: మార్చి 4
వెబ్‌సైట్‌: www.canarabank.com