ఇండియన్ నావీలో ప్రవేశాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇండియన్ నావీలో ప్రవేశాలు
నేవీ ఎంట్రీ స్కీం...ఎంపికైతే ఎదురులేదు
 
దేశ రక్షణలో నేవీ పాత్ర కీలకం. రొటీన్‌ కెరీర్‌కు భిన్నంగా స్థిరపడాలనుకునే వారికి, సవాళ్లను ఇష్టపడే వారికి ఇండియన్‌ నేవీలో అద్భుతమైన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇంటర్మీడియెట్‌ అర్హతతో క్యాడెట్‌ ఎంట్రీ స్కీం కోసం ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన వారికి ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం కూడా సొంతమవుతుంది. క్లిష్టమైన ఎంపిక ప్రక్రియను అధిగమించిన అభ్యర్థులు మంచి వేతనం, సౌకర్యాలతో నేవీలో స్థిరపడవచ్చు.
 
ఇండియన్‌ నేవీ అందిస్తున్న బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం (10 +2)లో చేరిన వారికి కెరీర్‌లో ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి. క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఎంపికైన వారికి పర్మినెంట్‌ కమిషన్‌ హోదా ఇస్తారు. సబ్‌ లెఫ్టినెంట్‌ స్థాయి నుంచి కమాండర్‌ స్థాయి వరకు ఎదగవచ్చు. ఆకర్షణీయమైన వేతనాలతోపాటు కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలకు ఇచ్చే అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా ఉంటాయి. వివిధ హోదాల్లో వేతనాలు ఇలా ఉంటాయి...
 
సబ్‌ లెఫ్టినెంట్‌: రూ.56100 - 110700
లెఫ్టినెంట్‌: రూ.61300 - 120900
లెఫ్టినెంట్‌ కమాండర్‌: రూ. 69400 - 136900
కమాండర్‌: రూ.121200 - 212400
 
ఎవరు అర్హులు?
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హత: 70 శాతం మార్కులతో 10+2 / ఇంటర్మీడియెట్‌ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ) ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్మీడియెట్‌ ఇంగ్లీష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: జనవరి 2, 1999 - జులై 1, 2001 మధ్య జన్మించి ఉండాలి (17 - 19 1/2 ఏళ్లు).
శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
 
ఎంపిక విధానం
ఇండియన్‌ నేవీ ఎంపిక ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ - 2017 మెయిన్‌ ర్యాంక్‌ ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి రెండో దశలో సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు ఉంటాయి. ఐదు రోజులపాటు కొనసాగే ఈ ఇంటర్వ్యూల్లో గట్టెక్కితే ఇక తిరుగుండదు. రెండు దశల్లో అర్హత సాధించిన వారికి చివరగా ఫిజికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.
 
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఇలా...
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను జులై - అక్టోబరు మధ్య బెంగళూరు, భోపాల్‌, కోయంబతూర్‌, విశాఖపట్నంలలో నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్‌-1, స్టేజ్‌-2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధిస్తేనే స్టేజ్‌-2కు అనుమతిస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ అందగానే నిర్దేశించిన సమయం, ప్రదేశంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు డాక్యుమెంటేషన్‌ చెక్‌, కొన్ని దరఖాస్తులను పూరించడం వంటివి ఉంటాయి.
స్టేజ్‌ - 1
ఈ దశలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో ఆఫీసర్స్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్ట్‌, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు. విశ్లేషణ సామర్థ్యం, మానసిక శక్తిని తెలుసుకోవడమే ఈ పరీక్షల ఉద్దేశం.
ఆఫీసర్స్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌: ఒక సమస్యను పరిష్కరించడానికి అభ్యర్థి ఉపయోగించే సామర్థ్యమే ఇంటెలిజెన్స్‌. ఇందులో వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటికి స్వల్ప కాలంలో సమాధానాలు ఇవ్వాలి. వెర్బల్‌ విభాగంలో అనాలజీ - క్లాసిఫికేషన్‌, కోడింగ్‌ - డికోడింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, నెంబర్‌ సిరీస్‌, డైరెక్షన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌; నాన్‌ వెర్బల్‌లో అనాలజీ, క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఫిగర్స్‌, కంప్లిట్‌ - ఇన్‌ కంప్లిట్‌ ప్యాటర్న్‌ ఫిగర్స్‌, క్యూబ్స్‌ - డైస్‌, వెన్‌ డయాగ్రమ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి మార్కెట్లో లభించే ప్రామాణిక పుస్తకాలను చదివితే సరిపోతుంది.
పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌: ముందుగా అందరిని ఒక పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెడతారు. పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ గురించి కొద్ది సేపు వివరిస్తారు. తరవాత లైట్లు ఆఫ్‌ చేసి 30 సెకన్లపాటు అస్పష్టంగా ఉన్న ఒక చిత్రాన్ని చూపిస్తారు. ఈ 30 సెకన్ల సమయంలోనే అభ్యర్థి ఆ చిత్రానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం (వయసు, లింగం, క్యారెక్టర్‌, మనోభావం, గత, వర్తమాన, భవిష్యత్‌ పరిణామాలు) నోట్‌ చేసుకోవాలి. వీటి ఆధారంగా మూడు నిమిషాల్లో ఒక కథను రాయాలి. తరవాత అందరూ వృత్తాకారంలో కూర్చొని వారి వారి కథల గురించి చర్చించుకోవాలి. దీని ఆధారంగానే రెండో దశకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టేజ్‌ - 2
ఈ దశలో నాలుగు రోజుల షెడ్యూల్‌ ఉంటుంది. ఇందులో సైకలాజికల్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ ఆఫీసర్‌ టాస్క్‌లు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్‌ వంటివి ఉంటాయి.
సైకలాజికల్‌ టెస్ట్‌: సైకాలజిస్ట్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. ప్రత్యేక పద్ధతి ద్వారా అభ్యర్థి మానసిక సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఇందులో థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌, వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌, సిచ్యూవేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌, సెల్ఫ్‌ డిస్ర్కిప్షిన్‌ టెస్ట్‌లు ఉంటాయి.
థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌: ముందుగా అందరిని ఒక పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెడతారు. తరవాత లైట్లు ఆఫ్‌ చేసి 30 సెకన్లపాటు 12 చిత్రాలను చూపిస్తారు. ఇందులో 11 చిత్రాలు అస్పష్టంగా, 12వ చిత్రం ఖాళీగా ఉంటుంది. అస్పష్టమైన 11 చిత్రాల్లోని ఉన్న కథను ఊహిస్తూ, 12వ చిత్రంలో ఏముంటుందో రాయాలి. ఇందుకు మూడు నాలుగు నిమిషాల సమయం ఇస్తారు. ఈ చిత్రాలు నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఉంటాయి.
వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌: అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌ను ఉపయోగిస్తారు. ఇందులో 60 పదాలను ప్రొజెక్టర్‌ ద్వారా చూపిస్తారు. ఇవి నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఉంటాయి. వీటిని చూసి పాజిటివ్‌ ప్రతిస్పందనను పేపర్‌పై రాయడానికి ప్రతి పదానికి 15 సెకన్ల సమయం కేటాయిస్తారు. ఈ ప్రతిస్పందనల ద్వారా మానసిక నిపుణులు అభ్యర్థి వ్యక్తిత్వంపై ఒక అంచనాకు వస్తారు.
సిచ్యూవేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌: విభిన్న పరిస్థితుల్లో ఏవిధంగా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ టెస్ట్‌ను ఉపయోగిస్తారు. దీని సమయం 30 నిమిషాలు. ఇందులో ప్రత్యేక ప్రశ్నపత్రం, సమాధాన పత్రం ఉంటుంది. రెండు మూడు వాక్యాల్లో జవాబులను రాయాలి. ఇందులో 60 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో కనీసం 40 ప్రశ్నలకైనా సమాధానం రాయాలి. ఇందులో అడిగే ప్రశ్నలకు ఉదాహరణ: THEO wins a lottery of 1 crore. What he will do?
సెల్ఫ్‌ డిస్ర్కిప్షిన్‌ టెస్ట్‌: ఇందులో అభ్యర్థులు ఎవరి గురించి వారు వివరించాల్సి ఉంటుంది. అంటే మీ గురించి, తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు వంటి వారి గురించి ఏవిధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాలను రాయాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా వివరించాలి.
 
గ్రూప్‌ టాస్క్‌
ఎస్‌ఎస్‌బి మూడు, నాలుగో రోజు ఎంపిక ప్రక్రియలో గ్రూప్‌ టాస్క్‌లు ఉంటాయి. ఇందులో గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌ ఎక్సర్‌సైజ్‌, హాఫ్‌ గ్రూప్‌ టాస్క్‌, ఇండివిడ్యువల్‌ అబ్‌స్టకల్‌, కమాండ్‌ టాస్క్‌, స్నేక్‌ రేస్‌ / గ్రూప్‌ అబ్‌స్టకల్‌ రేస్‌, ఇండివిడ్యువల్‌ లెక్చర్‌, ఫైనల్‌ గ్రూప్‌ టాస్క్‌ వంటి పరీక్షలను నిర్వహిస్తారు.
గ్రూప్‌ డిస్కషన్‌: ఇందులో అభ్యర్థుల కమ్యూనికేషన్‌, లీడర్‌షిప్‌ స్కిల్స్‌, లిజనింగ్‌, నాలెడ్జ్‌, టీమ్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. అభ్యర్థులను ఎనిమిది లేదా పన్నెండు గ్రూపులుగా విభజిస్తారు. ఏదో ఒక టాపిక్‌ ఎంచుకోవాలి. మూడు నుంచి నాలుగు నిమిషాలు ఆలోచించి గ్రూప్‌ డిస్కషన్‌ ప్రారంభించాలి. తరవాత మరో అంశం ఇస్తారు. ఈసారి ఎస్‌ఎస్‌బీ ఇచ్చిన టాపిక్‌పైన తప్పనిసరిగా మాట్లాడాలి.
గ్రూప్‌ / మిలటరీ ప్లానింగ్‌ ఎక్సర్‌సైజ్‌: ఇందులో వివిధ రకాల సమస్యలను ఇస్తారు. ఒక గ్రూప్‌గా ఏర్పడి పరిష్కార మార్గాలను కనుక్కోవాలి. ముందుగా అభ్యర్థులను ఒక వృత్తాకారంలో కూర్చోబెడతారు. తరవాత అధికారులు వివిధ రకాల సమస్యలను వివరిస్తారు. ఆయా సమస్యలకు అభ్యర్థులు వారి వారి పరిష్కార మార్గాలను పేపర్‌పై రాయాలి. తరవాత పది నిమిషాల సమయం ఇస్తారు. అందరూ చర్చించుకొని ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలి. ఇందులో తుఫాన్లు, భూకంపాలు సంభవించినప్పుడు ప్రజలను ఏవిధంగా రక్షించాలి? వంటి ప్రశ్నలను అడుగుతారు.
ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ టాస్క్‌: ఇందులో ఒక ప్రదేశంలో తెలుపు, నలుపు, ఎరుపు రంగులో అడ్డంకులను ఉంచుతారు. వాటిని జట్టు సభ్యులు నిర్దేశించిన నియమాల ఆధారంగా బరువును మోస్తూ అదిగమించాల్సి ఉంటుంది. ఒక రంగు టాస్క్‌ పూర్తికాగానే మరో టాస్క్‌ ప్రారంభమవుతుంది. ప్రతి టాస్క్‌కు క్లిష్టత పెరుగుతూ ఉంటుంది.
హాఫ్‌ గ్రూప్‌ టాస్క్‌: ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ టాస్క్‌ తరవాత హాఫ్‌ గ్రూప్‌ టాస్క్‌ ఉంటుంది. సభ్యులను రెండు జట్లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో ఐదు నుంచి ఆరు మంది ఉంటారు. కమ్యూనికేషన్‌ లేదా మరేతర కారణాల వల్ల ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ టాస్క్‌లో సరిగ్గా చేయలేని వారిని పరీక్షించడం కోసం ఈ టాస్క్‌ను నిర్వహిస్తారు. ఇందులో కూడా ఒక ప్రదేశంలో తెలుపు, నలుపు, ఎరుపు రంగులోని అడ్డంకులను ఉంచుతారు. వాటిని జట్టు సభ్యులు నిర్దేశించిన నియమాల ఆధారంగా బరువును మోస్తూ అధిగమించాలి.
ఇండివిడ్యువల్‌ అబ్‌స్టకల్‌: అభ్యర్థుల ఓర్పు, ధైర్యం, అడ్డంకులను అధిగమించే తీరును పరిశీలిస్తారు. ఇందులో వివిధ అడ్డంకులు ఉంటాయి. ఈ దశలో ఉండే టాస్క్‌లు: కమాండో వాక్‌, డబుల్‌ డిజ్‌ జంప్‌, టార్జన్‌ స్వింగ్‌, బ్యాలెన్స్‌డ్‌ వాక్‌, జంపింగ్‌ ఓవర్‌ డ్రమ్‌ బై థోర్నీ వైర్స్‌, స్టెప్‌ బై స్టెప్‌ జంప్‌, జంపింగ్‌ ఓవర్‌ ది స్ర్కీన్‌, బుర్మా బ్రిడ్జి, హ్యాంగింగ్‌ ద రోప్‌ ఆఫ్టర్‌ జంపింగ్‌ ఫ్రమ్‌ ద ల్యాడర్‌, రోల్‌ క్లయింబింగ్‌.
స్నేక్‌ రేస్‌ / గ్రూప్‌ అబ్‌స్టకల్‌ రేస్‌: ఇందులో తెలుపు, ఎరుపు రంగులతో కూడిన పెద్ద ఇనుప పైప్‌లు ఉంటాయి. ఎరుపును తాకకుండా శరీరాన్ని వంచుతూ ఇంగ్లీష్‌ అక్షరం ఎస్‌ ఆకారం వచ్చేలా ఆ పైప్‌లను దాటాలి. అలాగే పది ఫీట్ల గోడను కూడా దాటాలి.
ఇండివిడ్యువల్‌ లెక్చర్‌: నాయకుడిగా ముందుండి సహచరులను నడిపించడం రక్షణ దళాల్లో కీలకం. కాబట్టి ఈదశలో అభ్యర్థి భావ వ్యక్తీకరణ, ఆలోచనలు, బాడీ లాంగ్వేజ్‌, ఆత్మవిశ్వాసం, నాలెడ్జ్‌ వంటి అంశాలను క్షుణ్నంగా పరీక్షిస్తారు. ముందుగా అభ్యర్థులను వృత్తాకారంలో కూర్చోబెడతారు. వారి ముందు వివిధ రకాల కార్డులు ఉంటాయి. వాటిల్లో కష్టమైన, సాధారణమైన, సులువైన మూడు అంశాలు ఇస్తారు. ఆయా టాపిక్‌లను ప్రిపేర్‌ కావడానికి మూడు నిమిషాల సమయం ఇస్తారు. తరవాత లెక్చర్‌ ఇవ్వడం ప్రారంభించాలి. మూడు నిమిషాల్లో పూర్తిచేయాలి.
ఫైనల్‌ గ్రూప్‌ టాస్క్‌: ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ టాస్క్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ టాస్క్‌లో నాలుగు అడ్డంకులు ఇస్తే ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది. ఇందులో బురద మట్టి, వివిధ రకాల రంగులతో కూడిన కొన్ని అవుట్‌ బౌండ్‌ ఏరియాస్‌ ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు.
 
ఇంటర్వ్యూ
చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థుల గుణగణాలను పరీక్షించడానికి ప్రాధాన్యం ఇస్తారు. వ్యక్తిగత విషయాలు, చదువు, కుటుంబం, సమాజం, ఆసక్తులు, విద్యేతర విషయాలు, కరెంట్‌ ఆఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి అంశాలపై ప్రశ్నలు వేస్తారు.
 
శిక్షణ ఇలా...
ఎంపికైన వారికి శిక్షణ తరగతులు జులై 2018 నుంచి ప్రారంభవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లయిడ్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ / ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ / మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశం లభిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారికి న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు ఫీజు, భోజనం, వసతి, దుస్తులు, ఇతర ఖర్చులన్నీ నేవీ భరిస్తుంది. కోర్సు అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో చేరవచ్చు. అన్నీ కలిపి ప్రారంభంలోనే నెలకు రూ.83 వేలకు పైగా వేతనం పొందవచ్చు.
 
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
 
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30, 2017.
 
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in