ఎస్‌బిఐలో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎస్‌బిఐలో ఉద్యోగాలు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)- స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
డిప్యూటీ మేనేజర్‌(లా) ఖాళీలు: 40
 
వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(లా) ఖాళీలు: 1
 
వయసు: సెప్టెంబరు 1 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: ఎల్‌ఎల్‌బి/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. బార్‌ కౌన్సెల్‌లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకొని ఉండాలి. లా ఆఫీసర్‌గా మేనేజర్లకు కనీసం నాలుగేళ్లు, జనరల్‌ మేనేజర్‌కు పదిహేనేళ్ల అనుభవం ఉండాలి.
 
ఎంపిక: డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు అభ్యర్థులను ఆన్‌లైన్‌ రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
 
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాలు
పరీక్ష వివరాలు: పరీక్ష సమయం 135 నిమిషాలు. మొత్తం మార్కులు 220. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఈ రెంటికీ కలిపి 90 నిమిషాల సమయం ఇస్తారు. తరవాత ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కుల ఈ టెస్ట్‌కు 45 నిమిషాల సమయం ఉంటుంది.
 
కాల్‌ లెటర్‌ డౌన్‌లోడింగ్‌: అక్టోబరు 25 నుంచి
 
ఆన్‌లైన్‌ టెస్ట్‌: నవంబరు 11 నుంచి
 
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 6
 
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 10
 
వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers