విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం
పోలీసుల అదుపులో ఇద్దరు
పరారీలో సంస్థ హెచ్‌ఆర్‌

హైదరాబాద్, అడ్డగుట్ట: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి కాజేసిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన డేవిడ్‌, మోజెస్‌ తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న ఓ భవనంలో ఆరోన్‌ మ్యాన్‌ పవర్‌ కన్సల్టెన్సీ పేరుతో సంస్థ ఏర్పాటుచేశారు. రెండు నెలల క్రితం సంస్థలో హీనా అనే మహిళా హెచ్‌ఆర్‌గా బాధ్యతలు చేపట్టింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. సంప్రదించిన వారికి లక్ష రూపాయలు సంస్థకు చెల్లించాలని ముందే చెప్పేవారు.
 
సుమారు 25 మంది నిరుద్యోగులు రూ. 25 వేల నుంచి 30 వేలు అడ్వాన్స్‌గా చ్లెలంచి రిజిస్టర్‌ చేసుకున్నారు. 20 రూపాయల బాండ్‌ పేపర్‌పై ఒప్పందం కూడా రాసుకున్నారు. బుధవారం ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిరుద్యోగులకు మెయిల్‌తోపాటు మెసేజ్‌లు పెట్టారు. సమాచారం అందుకున్న వారు సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు కూడా సంస్థ హెచ్‌ఆర్‌ రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి లాలాగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కార్యాలయానికెళ్లి పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌ఆర్‌ పరారీలో ఉన్నారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.