ఉద్యోగ భద్రత కోసం గళమెత్తుతున్న ఐటీ ఉద్యోగులు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఉద్యోగ భద్రత కోసం గళమెత్తుతున్న ఐటీ ఉద్యోగులు
బలవంతపు రాజీనామాలతో యూనియన్‌ బాట
 
వచ్చేది గడ్డు కాలమే

హైదరాబాద్: ఐటి ఉద్యోగం అంటే ఐదంకెల జీతం, ఏసీలో పని, కార్లలో షికార్లు అప్పుడప్పుడు విదేశీ టూర్లుగా సాగింది మొన్నటి వరకు. ప్రస్తుతం పరిస్థితుల్లో మారింది. అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి రావడం, ప్రాజెక్ట్‌లు తగ్గడం తదితర కారణాలతో ఐటి కంపెనీల్లో లే ఆఫ్‌ల(పింక్‌ సిప్ల్‌ల) సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. హెచ్‌ఆర్‌ విభాగం నుంచి ఫోన్‌ వస్తేనే ఐటి ఉద్యోగులు హడలెత్తి పోతున్నారు. రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదు. కంపెనీ కోరుకున్న విధంగా రాజీనామా చేస్తే రావాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తాం. లేకపోతే పనితీరు బాగాలేదనే సాకుతో పంపించాల్సి ఉంటుంది. ఇది మీ కెరీర్‌ మొత్తానికి ప్రమాదకరం. ఆలోచించుకోండి. ఇటువంటి సంభాషణలు ఈ మధ్య ఐటి కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగంలో సాధారణంగా మారిపోయాయి. దీంతో ఐటి కంపెనీల్లో బలవంతపు రాజీనామా(ఫోర్స్‌ఫుల్‌ రెసిగ్నేషన్‌), అక్రమంగా తొలగింపు(అన్‌ ఫెయిర్‌ టెర్మినేషన్‌) ఎక్కువయ్యాయి. ఇటువంటి పరిస్థితులు తిరిగి తలెత్తకుండా తగిన న్యాయం కోసం ఐటి ఉద్యోగులు యూనియన్‌ బాట పట్టారు.
 
ఉద్యోగ భద్రత కోసం
ఎప్పుడూ ప్రాజెక్ట్‌లు, డైడ్‌లైన్స్‌ అంటూ బిజీగా గడిపే సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ ప్రస్తుతం లేబర్‌ కమిషనర్‌, లేబర్‌ కోర్టు, ప్రభుత్వాధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కంపెనీలు ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి, అందులో పని చేసే వారికి ఎటుంటి హక్కులు ఉంటాయి. ఉద్యోగులను అర్థతరంగా తొలగించవచ్చా, తొలగించడానికి ఎటువంటి చర్యలను పాటించాలని అనే విషయాలు తెలుసుకునేందుకు కార్మిక చట్టాలను తిరగేస్తున్నారు. పక్కన ఉండే ప్రభుత్వ ఆఫీస్‌ ఏమిటో తెలుసుకోవడానికి బద్ధకించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, తమ నగరాల్లోని లేబర్‌ కమిషన్‌ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని ఆరా తీస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారి ముందు వాలిపోతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరైన న్యాయం కోసం హైకోర్టు వరకు వెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు.
 
మొదట చెన్నైలో
ఐటి ఉద్యోగుల తొలగింపుపై మొదట చెన్నైలో నిరసన గళం మొదలైంది. ఈ విషయంలో అక్కడి ఉద్యోగులు ఎఫ్‌ఐటిఈ-చెన్నై, ఎన్‌డిఎల్‌ఎఫ్‌ -ఐటి వింగ్‌ సహాకారంతో తమిళనాడు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఆ తరవాత ఈ విధమైన నిరసన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బెంగళూరు, అటుపై మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది.
ఆయా సందర్భాల్లో కొన్ని సంస్థలకు నోటిసులు కూడా ఇచ్చారు.
 
గత ఆగస్టులో బెంగళూరులో కొంత మంది ఐటి ఉద్యోగులు కలిసి కర్ణాటక ఐటి/ఐటిస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అనే కార్మిక సంఘాన్ని (ట్రేడ్‌ యూనియన్‌) స్థాపించారు.
బలవంతపు రాజీనామాలను వ్యతిరేకిస్తూ బెంగళూరులోని మూడు వేల మంది ఐటి ఉద్యోగులు లేబర్‌ కమిషన్‌కు 20 పిటిషన్లను సమర్పించారు.
 
చెన్నైలో 75 మంది ఇన్ఫోసిస్‌ ఎంప్లాయిస్‌ తరపున 1000 మంది లేబర్‌ కమిషనర్‌కు పిటిషన్లు సమర్పించారు. తమిళనాడుకు చెందిన న్యూ డెమెక్రటిక్‌ లేబర్‌ ఫ్రంట్‌ (ఎన్‌డిఎల్‌ఎ్‌ఫ)అనే ట్రేడ్‌ యూనియన్‌ ఐటి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక వింగ్‌ను ఏర్పాటు చేసింది.
 
హైదరాబాద్‌ లేబర్‌ కమిషనర్‌ ఆఫీసుకు కూడా ఇటువంటి పిటిషన్లు గత మే నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. 
 
మూడేళ్లలో ఐటి రంగంలో లక్ష మందిని తొలగించారు. ఐటి పరిశ్రమలో నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగులను తొలగించడంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ సంస్థలు గత మూడు నెలలోనే అయిదు వేల మంది ఉద్యోగులను తొలిగించాయి. లేబర్‌ కమిషనర్‌ దగ్గర 1600 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
 -కిరణ్‌ చంద్ర, ఫోరమ్‌ ఫర్‌ ఐటి ప్రొఫెషనల్స్‌ వ్యవస్థాపక సభ్యుడు, హైదరాబాద్‌
గడ్డు కాలమే
 
పరిశ్రమ వర్గాలు, నిపుణులు లేఆ్‌ఫల విషయంలో ఎంత వివరణలు ఇస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందుకు సంబంధించిన గణంకాలను పరిశీలిస్తే..2017 ప్రారంభం నుంచి ఐటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. లైవ్‌మింట్‌ వెబ్‌సైట్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇప్పటి వరకు ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, విప్రో తదితర ఐటి సంస్థలు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండొచ్చని అంచనా. గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ మెకెన్సీ రిపోర్ట్‌ ప్రకారం వచ్చే మూడు నాలుగేళ్లలో ఐటి సర్వీసెస్‌ వర్క్‌ఫోర్స్‌లో సగం మందికి ఉద్వాసన తప్పకపోవచ్చు.
 
ఎఫ్‌ఐటిఈ
బలవంతపు రాజీనామాలు, అక్రమంగా తొలగింపుల వంటి రూపంలో తమకు ఎదురవుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె వంటి నగరాల్లోని ఐటి ప్రొఫెషనల్స్‌ ఫోరమ్‌ ఫర్‌ ఐటి ఎంప్లాయి్‌స’(ఎ్‌ఫఐటిఈ) అనే అసోసియేషన్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో ఐటి రంగంలో ఇదే మొదటి వర్కర్స్‌ యూనియన్‌. బలవంతపు రాజీనామాల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఏకం చేసి వారికి న్యాయం జరిగేలా చూడటం, ఉద్యోగ భద్రత కోసం చర్యలు తీసుకునేలా సంబంధిత వర్గాలపై ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ఎఫ్‌ఐటిఈ పని చేస్తున్నాయి. దీనికి ఉద్యోగుల్లోంచి స్పందన కూడా భారీగానే ఉంటోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల తమకు మద్దతను కూడగట్టుకుంటున్నాయి. బెంగళూరు ఎఫ్‌ఐటిఈ కో-ఆర్డినేటర్‌ రాజేషన్‌ నటరాజన్‌కు ఇదే విషయంపై గత మార్చి ఇప్పటి వరకు ప్రతి రోజూ 50 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
-ఎడ్యుకేషన్‌ డెస్క్‌