ఎస్‌ఎన్‌సిసిఎఫ్‌ఎల్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎస్‌ఎన్‌సిసిఎఫ్‌ఎల్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని స్త్రీ నిధి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(ఎస్‌ఎన్‌సిసిఎఫ్‌ఎల్‌)- తెలంగాణ జిల్లాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌(మానిటరింగ్‌) పోస్టుల భర్తీకిగాను మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 77
 
జిల్లాలవారీ ఖాళీలు: ఆదిలాబాద్‌ 2, భద్రాద్రి 3, జగిత్యాల 4, జనగాం 3, జయశంకర్‌ 1, జోగు లాంబ 1, కామారెడ్డి 3, కరీంనగర్‌ 4, ఖమ్మం 4, కొమరం భీం 1, మహబూబాబాద్‌ 2, మహబూబ్‌ నగర్‌ 3, మంచిర్యాల 3, మెదక్‌ 2, మేడ్చల్‌- మల్కాజిగిరి 1, నాగర్‌కర్నూలు 1, నల్గొండ 6, నిర్మల్‌ 2, నిజామాబాద్‌ 3, పెద్దపల్లి 3, రాజన్న 2, రంగారెడ్డి 2, సంగారెడ్డి 3, సిద్దిపేట 3, సూర్యాపేట 2, వికారాబాద్‌ 1, వనపర్తి 1, వరంగల్‌ రూరల్‌ 4, వరంగల్‌ అర్బన్‌ 4, యాదగిరి భువనగిరి 3.
 
వయసు: ఆగస్టు 31 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీ ర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్‌ భాషలు చదవడం, రాయడంలో ప్రావీణ్యం ఉండాలి. ఎస్‌హెచ్‌జి మెంబరుగా కనీసం ఆరు నెలలు పనిచేసి ఉండాలి.
 
వేతనం: నెలకు రూ.13,000 + ఎఫ్‌టిఏ కింద రూ.3,500 + వెహికిల్‌ అలవెన్స్‌ కింద రూ.700 ఇస్తారు. ప్రొబెషన్‌: ఆరు నెలలు
 
కాంట్రాక్ట్‌ వ్యవధి: అభ్యర్థుల పర్ఫార్మెన్స్‌ ఆధారంగా ఏటా కాంట్రాక్టు వ్యవధిని పెంచుతుంటారు.
 
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా
రాత పరీక్ష: అక్టోబరు 8న
పరీక్ష కేంద్రం: TSIPARD, Rajendranagar, Hyderabad.
రాత పరీక్ష వివరాలు: పరీక్ష సమయం గంటన్నర. ఇందులో 65 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు, 10 మార్కులకు డిస్ర్కిప్టివ్‌ టైప్‌ ప్రశ్నలు, 5 మార్కులకు కాంప్రహెన్షన్‌ ఇస్తారు. కరెంట్‌ అఫైర్స్‌ & జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లీష్‌, అర్థమెటిక్‌ & రీజనింగ్‌, ఎస్‌హెచ్‌జి & ఫెడరేషన్స్‌, బేసిక్‌ నాలెడ్జ్‌ ఆన్‌ కంప్యూటర్స్‌ సంబంధిత అంశాలనుంచి ప్రశ్నలు వస్తాయి.
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 22
 
వెబ్‌సైట్‌: www.serp.telangana.gov.in
www.streenidhi.telangana.gov.in
www.tsipard.gov.in