ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పీఓలు.. పారాహుషార్‌
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పీఓలు.. పారాహుషార్‌
ఏటా క్రమం తప్పకుండా వచ్చే ప్రధాన ఉద్యోగ ప్రకటనల్లో ఐబిపిఎస్‌ ఒకటి. దేశంలోని వివిధ బ్యాంకులకు అవసరాన్ని బట్టి పరీక్ష నిర్వహించి అర్హులను ఐబిపిఎస్‌ ఎంపిక చేస్తుంది. ఇందులో పలు ఉద్యోగాలు ఉంటాయి. నోటిఫికేషన్‌ వెలువడిన అయిదారు నెలల్లో యావత్తు ప్రక్రియ పూర్తవుతుంది. తాజాగా ఐబిపిఎస్‌ నుంచి ప్రొబేషనరి ఆఫీసర్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల రిక్రూట్‌మెంట్‌కు (సిడబ్ల్యుఇ పీఓ / ఎంటి-7) ప్రకటన వెలువడింది.
ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే (కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష) నిర్వహిస్తారు. పార్టిసిపేటింగ్‌ ఆర్గనైజేషన్స్‌లో ఉన్న ఈ పోస్టులకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తారు. ఇవి అక్టోబర్‌/ నవంబర్‌లో ఉండవచ్చు. రెండంచెల విధానంలో జరిగే ఈ పరీక్షలో అభ్యర్థులు మొదట ప్రిలిమినరీలో క్వాలిఫై కావాలి. వారే మెయిన్స్‌ రాయడానికి అర్హులు. మెయిన్స్‌లో క్వాలిఫై అయినవారు కామన్‌ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. కామన్‌ ఇంటర్వ్యూని ఆయా రాష్ట్రాల్లోని నోడల్‌బ్యాంక్‌లు నిర్వహిస్తాయి.
సిడబ్ల్యుఇ ఆన్‌లైన్‌ పరీక్షలు
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌)
మూడు టెస్ట్‌లు ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 100. కంపోజిట్‌ సమయం: ఒక గంట. దీనిలో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (35 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ టెస్ట్‌ (35 ప్రశ్నలు) ఉంటాయి. ఇవన్నీ ఆబ్జెక్టివ్‌ తరహా / మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు.
ఈ టెస్ట్‌కి కేటాయించిన సమయం 60 నిమిషాలే. ఈ సమయాన్ని మనకు అనుకూలంగా ఒక్కో టెస్ట్‌కు విభజించుకోవాలి. రీజనింగ్‌కు 20 నిమిషాలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 25 నిమిషాలు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌కి 15 నిమిషాలు కేటాయించుకొని ఈ టెస్ట్‌లో సఫలీకృతులు కావచ్చు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అభ్యర్థులు ప్రతి టెస్ట్‌లోనూ ఐబిపిఎస్‌ నిర్ణయించిన కటాఫ్‌ మార్కులు సంపాదించుకోవాలి. అప్పుడే దీనిలో క్వాలిఫై అవుతారు. ఐబిపిఎస్‌ ప్రతి కేటగిరీలోనూ, వేకెన్సీలకు తగిన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఆన్‌లైన్‌లో నిర్వహించే మెయిన్‌ పరీక్షకు పిలుస్తుంది.
రీజనింగ్‌ టెస్ట్‌లో ఇచ్చే ప్రశ్నలు ఈ కింది టాపిక్‌ల నుంచి ఉంటాయి
అనలిటికల్‌ రీజనింగ్‌: సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, గ్రూప్‌ సెలెక్షన్‌, మ్యాచింగ్‌ మొదలైనవి.
ఇతర వెర్బల్‌ రీజనింగ్‌: రక్త సంబంధాలు, కోడింగ్‌-డీకోడింగ్‌, ఇన్‌పుట్‌ - అవుట్‌పుట్‌, క్రిటికల్‌ రీజనింగ్‌(స్టేట్‌మెంట్‌ - అజెంప్షన్‌, స్ర్టాంగ్‌ అండ్‌ వీక్‌ ఆర్గ్యుమెంట్స్‌ కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌), డైరెక్షన్‌ సెన్స్‌, వెన్‌ డయాగ్రమ్‌లు.
 
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: దీనిలో ఇచ్చే 35 ప్రశ్నలు ఈ కింది అంశాలపై ఉంటాయి:
నంబర్స్‌: నంబర్‌ సిస్టమ్‌ బేసిక్స్‌, హెచ్‌సిఎఫ్‌ అండ్‌ ఎల్‌సిఎం, నంబర్‌ సిరీస్‌, సింప్లిఫికేషన్‌.
 
అర్థమెటిక్‌: సగటు, నిష్పత్తులు-ప్రపోర్షన్‌, శాతాలు, లాభ నష్టాలు, సాధారణ - చక్రవడ్డీలు, వయసు లెక్క కట్టడం, వేగం, కాలం-దూరం, కాలం-పని.
మోడరన్‌ మేథ్స్‌: ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌
జామెట్రీ: మెన్సురేషన్‌ (ఏరియా వైశాల్యం, చుట్టుకొలత, ఘనపరిమాణం)
డేటా ఇంట్రప్రిటేషన్‌: డేటా ఇంట్రప్రిటేషన్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ
ఇంగ్లీష్‌ టెస్ట్‌: ఇందులో ఉండే 30 ప్రశ్నలు కింది టాపిక్‌లపై ఉంటాయి.
1) రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 2) గ్రామర్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌
3) పారా జంబుల్స్‌ 4) క్లోజ్‌ టెస్ట్‌ అండ్‌ ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌
5) ఒకాబులరీ
రిఫరెన్స్‌ పుస్తకాలు
1) IBPS PO Exam guide
2) Fast Track Ojbective Arithmetic by Arihanth publications
3) Object English by Hari Mohan Prasad
4)Analytical reasoning by M.K.Pandey
మెయిన్‌ పరీక్ష
దీనిలో అయిదు టెస్ట్‌ ఉంటాయి. అవి-
రీజనింగ్‌ టెస్ట్‌ (50 ప్రశ్నలు - మార్కులు 50), దీనికి ప్రత్యేకంగా కేటాయించిన సమయం 40 నిమిషాలు). టెస్ట్‌ పేపర్‌: ఇంగ్లీష్‌, హిందీ మీడియంలో ఉంటుంది.
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (40 ప్రశ్నలు - మార్కులు 40), సమయం: 30 నిమిషాలు). టెస్ట్‌ పేపర్‌: ఇంగ్లీష్‌ మీడియంలో మాత్రమే ఉంటుంది.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (50 ప్రశ్నలు - మార్కులు 50), సమయం: 40 నిమిషాలు, టెస్ట్‌ పేపర్‌: ఇంగ్లీష్‌, హిందీ మీడియంలలో ఉంటుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌: బ్యాంకింగ్‌కి సంబంధించిన అంశాల స్పెషల్‌ రిఫరెన్స్‌తో ఉంటుంది. ప్రశ్నలు 40 - మార్కులు 40), సమయం: 20 నిమిషాలు. టెస్ట్‌ పేపర్‌: ఇంగ్లీష్‌, హిందీ మీడియంలో ఉంటుంది.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (20 ప్రశ్నలు-మార్కులు 20), సమయం: 10 నిమిషాలు. టెస్ట్‌ పేపర్‌: ఇంగ్లీష్‌, హిందీ మీడియంలలో ఉంటుంది.
మెయిన్స్‌లోని అన్ని టెస్ట్‌లకు కలిపి మొత్తం ప్రశ్నలు 200, మార్కులు 200. సమయం: 140 నిమిషాలు (2015లో 120 నిమిషాలే కేటాయించారు. ప్రస్తుతం 20 నిమిషాలు పెంచారు).
ప్రస్తుతానికి పై విధానం అమలులో ఉంది. అయితే ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు చేయవచ్చని ఐబిపిఎస్‌ తెలిపింది. ఏ మార్పులు చేసినా వాటిని వెబ్‌సైట్‌లో పెడతామని కూడా పేర్కొంది.
ఇంపార్టెంట్‌
నెగెటివ్‌ మార్కులు
యూపీఎస్సీ సహా పలు ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌, క్యాట్‌, బ్యాంక్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల కాన్సె్‌ప్ట ఉంది. అభ్యర్థి రియల్‌ నాలెడ్జ్‌ని తెలుసుకోవడానికి నెగెటివ్‌ మార్కుల పద్ధతిని ప్రవేశపెట్టారు. కేవలం ఊహించి/ గెస్‌ చేసి ప్రశ్నలకు ఆన్సర్‌ పెట్టే వారిని తొలగించుకోవడమే దీని లక్ష్యం.
సాధారణంగా ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండటంతో ఫైనల్‌ ఎగ్జామ్స్‌కి వచ్చేవారి సంఖ్య తగ్గుతుంది. మొదటిసారిగా బ్యాంక్‌ పరీక్షలు రాసేవారు నెగెటివ్‌ మార్కుల విషయమై బాధపడుతుంటారు. ప్రతి రాంగ్‌ ఆన్సర్‌కు 0.25 మార్కులు తగ్గిపోతుంటాయి.
ఈ సమస్యను అధిగమించాలంటే....
బ్యాంకు పరీక్షలకు సంబంధించి ప్రతి పాత ప్రశ్నపత్రాన్ని బాగా అనలైజ్‌ చేయండి. ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో సునిశితంగా పరిశీలించండి.
బాగా ప్రాక్టీస్‌ చేయండి. షార్ట్‌కట్‌ మెథడ్స్‌ని అలవర్చుకుంటే సమయం కలిసివస్తుంది.
మాక్‌టె్‌స్టలు రాయండి. ప్రతి మాక్‌టె్‌స్టకి ఎంత సమయం తీసుకుంటున్నారో చూసుకోండి.
ఫార్ములాలు, ఇంపార్టెంట్‌ థీరమ్‌లపై షార్ట్‌ నోట్స్‌ రాసుకోండి. ఇందువల్ల ప్రతిసారి టెక్ట్స్‌బుక్‌ రిఫర్‌ చేయాల్సిన అవసరం ఉండదు.
కూల్‌గా, ప్రశాంతంగా ఉండండి. పరీక్ష రాయడానికి ముందు, రాసే సమయంలో మీకు తెలియని ప్రశ్న వచ్చినా ఆందోళన చెందవద్దు. కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే సమాధానం రాయవచ్చు.
మీకు బాగా తెలిసిన ప్రశ్నలకే జవాబు రాయండి. ఆన్సర్‌ మార్క్‌ చేయండి.
ఊహించి ఏ ప్రశ్నకూ ఆన్సర్‌ మార్క్‌ చేయవద్దు.
కటాఫ్‌ మార్కులు
మెయిన్స్‌ పరీక్షలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 200 మార్కులకు కేవలం 80 మార్కులు వస్తే ఐబిపిఎస్‌ గతంలో ఇంటర్వ్యూకి పిలిచేవారు.
ఒబిసి: గతంలో అభ్యర్థులకు మొత్తం 200 మార్కులకు 70 మార్కులు వస్తే అభ్యర్థి పాసైనట్లు ప్రకటించి, ఇంటర్వ్యూకి పిలిచేవారు.
వెబ్‌సైట్‌: www.ibps.in
- ప్రాతూరి పోతయ్యశర్మ