ఇస్రోలో 313 ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇస్రోలో 313 ఉద్యోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో కెరీర్‌ ప్రారంభించే అవకాశం వచ్చింది. డిగ్రీ అర్హతతో దాదాపు 300కుపైగా ఖాళీలతో ఇస్రో నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. సుస్థిర భవిష్యత్‌ అనే కక్ష్య దిశగా అడుగులు వేయడానికి రాకెట్‌లా ఉపయోగపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అత్యుత్తమ సంస్థలో చక్కని కెరీర్‌ సొంతమవుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఒక్కసారి చూద్దాం..
ఇస్రో నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా దేశంలోని ఇస్రో సెంటర్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ పరిధిలోని అటానమస్‌ సంస్థలు/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అసిస్టెంట్స్‌ (అడ్మినిస్ర్టేటివ్‌ సపోర్టివ్‌ స్టాఫ్‌), అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ) 313 పోస్టులను భర్తీ చేయనుంది.
ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో స్కిల్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌) నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులనే మెరిట్‌ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు.
 
ప్రిపరేషన్‌: ప్రస్తుతం ఏ నియామక పరీక్ష తీసుకున్నా సిలబ్‌సలో జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, అర్థమెటిక్‌, రీజనింగ్‌, కంప్యూటర్‌ లిటరసీ అంశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇస్రో వెబ్‌సైట్‌లోని గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ఆయా అంశాల్లో ప్రశ్నలను ఏ విధంగా అడుగుతున్నారో అవగాహన ఏర్పర్చుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. వివిధ బ్యాంక్‌ పరీక్షలు, ఎస్‌ఎ్‌ససి, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఆయా పరీక్షల ప్రిపరేషన్‌ దీనికి సరిపోతుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన స్టాండర్డ్‌ బుక్స్‌, టెస్ట్‌ మెటీరియల్‌, మాక్‌/మోడల్‌ టెస్ట్‌లు ఫాలో కావడం ప్రయోజనకరం. దాంతోపాటు ఇటీవలి కాలంలో ఐబిపిఎస్‌, ఎస్‌ఎ్‌ససి పరీక్షల్లో జనరల్‌ గ్రాడ్యుయేట్లకు బిఈ/బిటెక్‌ అభ్యర్థుల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. అంతేకాకుండా ఎంపికవుతున్న వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే ఉంటున్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం జనరల్‌ గ్రాడ్యుయేట్లు మాత్రమే అర్హులు. దీంతో బిఈ/బిటెక్‌ అభ్యర్థులకు ఆవకాశం ఉండదు. కాబట్టి మిగతా రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లతో పోలిస్తే పోటీ తీవ్రత తగ్గే ఆస్కారం ఎక్కువ. జనరల్‌ గ్రాడ్యుయేట్లు దీన్ని సదావకాశంగా తీసుకొని సీరియస్‌ ప్రిపరేషన్‌ సాగిస్తే సులభంగా విజయం సాధించవచ్చు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో ఇస్రో, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
డిస్ర్కిప్టివ్‌ కీలకం : రాత పరీక్షలో కీలకమైంది డిస్ర్కిప్టివ్‌ విభాగం. ఎస్సే రైటింగ్‌, ప్రెసిస్‌ రైటింగ్‌ అంశాలు ఉన్నాయి. ఇందులో వివిధ అంశాలపై అభ్యర్థుల అవగాహనను పరిశీలిస్తారు. వీటికి సమాధానాలను ఇంగ్లీ్‌ష/హిందీ భాషల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లీష్‌ భాషపై పట్టు పెంచుకోవాలి. ఎస్సే రైటింగ్‌లో మూడు అంశాలు ఇచ్చి అందులో ఒక దానిపై 400 పదాలకు మించకుండా ఒక వ్యాసం రాయమం టారు. కాబట్టి ఆంగ్ల దినపత్రికలను చదవడం ఉపయోగకరం. వాటిల్లో ఎడిటోరియల్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. తక్కువ పదాలతో ఎక్కువ మొత్తంలో సమాచారం రాసేలా అవగాహనను పెంచుకోవాలి.
ఇందుకు సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను తీసుకొని ఎస్సేలను రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా ఉంటున్న అంశాల నుంచి ఎస్సే విభాగంలో ప్రశ్నలు ఇస్తారు. 2016 పేపర్‌లో ఎస్సే రైటింగ్‌లో ఇచ్చిన అంశాలు-Contribution of Indian Space Programme in improving the quality of life, Global warming-reasons and solutions, Digital India Programme.
-ప్రెసిస్‌ రైటింగ్‌లో ఇచ్చిన వ్యాసాన్ని కుదించి రాయాలి. తగిన హెడ్డింగ్‌ పెట్టాలి.
-లెటర్‌ రైటింగ్‌లో వివిధ అంశాలపై లెటర్స్‌ రాయాల్సి ఉంటుంది. 2016 పేపర్‌లో ఈ విభాగంలో ఇచ్చిన అంశాలు-Write a letter to the inspector of the nearby police station, about the disappearance of your younger brother.
Write a letter to the Chairman, State Electricity Board for continued and uninterrupted power supply during the school/College Annual Examination season.
స్కిల్‌ టెస్ట్‌: రాత పరీక్ష ఆధారంగా స్కిల్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌)కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను మెరిట్‌ లిస్ట్‌లో ప్రిపరేషన్‌ సమయంలో పరిగణనలోకి తీసుకోరు. స్కిల్‌ టెస్ట్‌ను 100 పాయింట్లకు నిర్వహిస్తారు. ఇందులో 60 శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫైడ్‌గా పరిగణనిస్తారు. స్కిల్‌ టెస్ట్‌ కోసం ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకెళ్లాలి. అంతేకాకుండా స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికైన వారికి సెకండ్‌ క్లాస్‌ రైల్వే ఛార్జీలు చెల్లిస్తారు. ఇందుకు అభ్యర్థి నివాస ప్రదేశం నుంచి స్కిల్‌ టెస్ట్‌ సెంటర్‌కు దగ్గరగా ఉండే ట్రైన్‌ రూట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌-సర్వీ్‌సమన్‌, దివ్యాంగులకు మినహాయింపునిచ్చారు)
చివరి తేదీ: ఆగస్ట్‌ 1, 2017
రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 15, 2017
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌ తదితర నగరాలు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2017.
వెబ్‌సైట్‌: www.isro.gov.in/careers
రాత పరీక్ష
వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను రాత పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి అక్టోబర్‌ మొదటి వారంలో ఈ-మెయిల్‌ ద్వారా కాల్‌ లెటర్‌ పంపిస్తారు. రాత పరీక్ష కోసం ఇది సిలబస్‌ అంటూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఇందుకు గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ప్రామాణికంగా తీసుకోవాలని ఇస్రో తెలిపింది. దీని ప్రకారం 2016, ఏప్రిల్‌ 17న(అసిస్టెంట్స్‌ కోసం 2014 అక్టోబర్‌ 12న నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ కూడా ఇదే విధంగా ఉంది) నిర్వహించిన జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్స్‌/ స్టెనోగ్రాఫర్‌/ అసిస్టెంట్స్‌ పరీక్ష పత్రాన్ని పరిశీలిస్తే.. రాత పరీక్షను 300 మార్కులకు నిర్వహించారు. సమాధానాలను గుర్తించడానికి 180 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ రెండు విభాగాలు ఉన్నాయి. రెండో దశ కోసం అర్హత సాధించాలంటే అబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో జనరల్‌ ఇంగ్లీష్‌ (23 ప్రశ్నలు, 69 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ (23 ప్రశ్నలు, 69 మార్కులు), అర్థమెటిక్‌ (23 ప్రశ్నలు, 69 మార్కులు), రీజనింగ్‌ (13 ప్రశ్నలు, 39 మార్కులు), కంప్యూటర్‌ లిటరసీ (8 ప్రశ్నలు, 24 మార్కులు) అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. డిస్ర్కిప్టివ్‌ విధానంలో ఎస్సే రైటింగ్‌, ప్రెసిస్‌ రైటింగ్‌, లెటర్‌ రైటింగ్‌ (3 ప్రశ్నలు, 30 మార్కులు)అంశాలు ఉన్నాయి.