ఏపీలో సగం స్కూళ్లే ప్రారంభం.. సెంటిమెంటే కారణం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఏపీలో సగం స్కూళ్లే ప్రారంభం.. సెంటిమెంటే కారణం
సగం స్కూళ్లే ప్రారంభం
తెరిచిన పాఠశాలల్లో విద్యార్థులు గైర్హాజరు
మంగళవారం, అమావాస్య సెంట్‌మెంటే కారణం
 
గుంటూరు(సంగడిగుంట): సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థికి విద్యాభ్యాసం చేసే సమయంలో మంచి ముహూర్తం చూసుకోవడం పరిపాటి. కానీ ఈ ఏడాది యాజమాన్యాలు కూడా ముహూర్తాలు చూసుకుని స్కూళ్లను పునఃప్రారంభిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రెండు రోజుల ఆలస్యంగా ప్రైవేటు స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూన్‌ 12 మంగళవారం స్కూళ్లు ప్రారంభించాల్సి ఉండగా 70 శాతానికి పైగా ప్రైవేటు స్కూళ్లు తెరుచుకోలేదు. 12 మంగళవారమని, 13 అమావాస్య అని ప్రారంభించలేదు.
 
విద్య ద్వారా బాలబాలికలకు శాస్ర్తీయ విజ్ఞానం బోధించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై ఈ వయసులోనే ఇటువంటి నమ్మకాలు బలపర్చుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రం పలువుర్ని ఆశ్చర్య పరిచింది. తల్లిదండ్రులదీ అదే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలన్నీ మంగళవారం ప్రారంభమయ్యాయి. కానీ పది శాతానికి మించి హాజరు లేదు. కారణం మంగళవారమని పంపలేదు. మంగళవారం, అమావాస్య సెంటిమెంట్లు మాత్రం వారి మనస్సులో బలంగా నాటుకుంటాయి. ఇది సమాజానికి అంత శ్రేయస్కరమా అనేది కూడా ఆలోచించుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు మంగళవారం స్కూళ్లు తెరిచిన సందర్భాలున్నాయి. కాని ఈ ఏడాది ఇందుకు భిన్నంగా జరగడంపై పలువురు విస్తుపోతున్నారు.