సర్కారు బడిలో సీటుకు భలే డిమాండ్‌! Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సర్కారు బడిలో సీటుకు భలే డిమాండ్‌!
సీట్లు 80.. దరఖాస్తులు 180
ఉత్తమ బోధన, ఫలితాలే కారణం!

ఆమదాలవలస, జూన్‌ 12: ఆ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు ఉన్నవి 80 సీట్లు.. చేరాలని ఆసక్తిచూపుతున్న విద్యార్థులు 180 మంది! అలాగని ఇదేదో కార్పొరేట్‌ పాఠశాల కాదు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధిలోని లక్ష్మీనగర్‌ ఉన్నత పాఠశాల. అంతలా ఉంది ఇక్కడ అడ్మిషన్ల డిమాండ్‌. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతి శతశాతం ఉత్తీర్ణత సాధించారు. సుమారు 26 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులుండడం, కేరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు అందిస్తుండడమే ఈ డిమాండ్‌కు కారణం. మంగళవారం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పడంతో పెద్దఎత్తున తల్లిదండ్రులు పిల్లలతో అక్కడకు చేరుకోవడంతో సందడి నెలకొంది. 180 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పించాల్సి వచ్చింది.