ఎంబీఏ చదివానన్న విషయమే మర్చిపోయా.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఎంబీఏ చదివానన్న విషయమే మర్చిపోయా..
15 మందికి ఉపాధి కల్పిస్తున్న వైనం
ఆదర్శంగా నిలుస్తున్న ఎంబీఏ విద్యార్థి

పోలాకి, శ్రీకాకుళం: ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లి కష్టపడేకన్నా స్వశక్తిని నమ్ముకుంటే మంచిదని భావించాడు. ఓ సామిల్లు ప్రారంభించి స్వయం ఉపాధి పొదడంతో పాటు మరో 15 మందికి పని కల్పించి ఆదర్శంగా నిలిచాడు ఎంబీఏ చదివిన ఓ నిరుద్యోగ పట్టభద్రుడు.
 
జలుమూరు మండలం లింగాలవలసకు చెందిన గేదెల నారాయణరావు కుమారుడు గేదెల తేజేశ్వరరావు ఉన్నత చదువు చదివాడు. తండ్రి ప్రోత్సాహం అందడంతో ఎక్కడికో వెళ్లి ఉద్యోగం కోసం తాపత్రయపడే కన్నా స్వశక్తితో ఎదగాలని తలచాడు. పోలాకి మండలం ఈదులవలస కూడలి వద్ద ఓ సామిల్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునిక యంత్రపరికరాలను సమకూర్చుకుని అనతికాలంలోనే తనకాళ్లపై తాను నిలబడిగాడు. స్వయంగా ఉపాధి పొందుతూ మరో 15 మందికి పనికల్పిస్తున్నాడు.

నేపథ్యం ఇదీ...
తేజేశ్వరరావు జలుమూరు మండలం చల్లపేటలో పదో తరగతి(2008) చదివాడు. ఆ తర్వాత పాలిటెక్నిక్‌ చదవడానికి విశాఖపట్నం వెళ్లాడు. 2011లో పాలిటెక్నిక్‌ పూర్తిచేశాక విశాఖలోనే బుద్దా కళాశాలలో ఎంబీఏలో చేరి 2014లో పట్టా పొందాడు. ఆ తర్వాత తండ్రి నారాయణరావు శిక్షణలో అప్పారావు అనే వ్యక్తి ప్రోత్సాహం తోడవడంతో సామిల్లు ఏర్పాటుపై దృష్టిసారించాడు. వాస్తవానికి చల్లపేట కూడలిలో నారాయణరావుకు చిన్న సామిల్లు ఉంది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న తేజేశ్వరరావు వేరే ప్రాంతానికి మారితే మంచిదని తలచి ఈదులవలస కూడలికి వచ్చి గత ఏడాది దసరా పండగ రోజున రాజరాజేశ్వరి సామిల్లును ప్రారంభించాడు. అనతికాలంలోనే దాన్ని విస్తరించాడు. ప్రస్తుతం నెలకు రూ.5 లక్షల మేర టర్నోవర్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం రూ.కోటి వ్యవయంతో ఆధునిక యంత్రాలను సమకూర్చుకున్నాడు.
 
ఆనందంగా ఉంది
కర్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వశక్తితో రాణిస్తుండడం ఆనందంగా ఉంది. నేను ఎంబీఏ చదివాననే విషయాన్ని మరచి పోయాను. వ్యాపారంపైనే దృష్టిసారించా. నాన్న నారాయణరావు ప్రేరణ మరువలేనిది. ఆయన చేసిన ఆర్థిక సాయంతోనే సామిల్లు యంత్రాలు కొనుగోలు చేశా. 15 మంది వేతనదారులకు ఉపాధి కల్పించా. త్వరలో ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించాలన్న ఆలోచన ఉంది.