ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్‌ కావాలంటే ఈ స్కిల్స్‌ ఉండాలి Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్‌ కావాలంటే ఈ స్కిల్స్‌ ఉండాలి
ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన అందరికీ క్యాంపస్‌ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పలేం. అందులోనూ లెక్కకు మించి ఉన్న ఇంజనీరింగ్‌ కోర్సులు చేసే విద్యార్థుల విషయంలో ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఐఐటి తదితర ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థల్లో చదివిన విద్యార్థుల విషయం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. టూ టైర్‌ కాలేజీల్లో చదివిన వారికి అవకాశాలు అంతంతమాత్రమే. త్రీటైర్‌ కాలేజీల్లో చదివిన వారి భవిష్యత్తు అస్సలు చెప్పలేం. అలాంటి ఇంజనీరింగ్‌ విద్యార్థులు సహజంగానే డైలమాలో ఉంటారు.
 
ఒక లెక్క ప్రకారం ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ముప్పుయ్‌ శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారిలో చాలా మంది నిరుద్యోగులు కాగా మరికొంత మంది వేరే రంగాలకు మరలుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటని విశ్లేషించుకుంటే కొంత మంది సొంత ఆలోచనల మేరకు పక్కకు వెళుతుంటే మిగిలినవారు మాత్రం ఆయా కంపెనీల అవసరాలకు తగ్గట్టు అప్‌డేట్‌ కాకపోవడమే కారణమని తేలుతోంది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి కంపెనీలు ఏమి కోరు కుంటున్నాయో చూద్దాం.
 
ఇండస్ట్రీకి ఏమికావాలో తెలుసుకోవాలి
సాంకేతికంగా ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా చేర్చుకోబోయే ఇంజనీర్లకు వాటిపై అవగాహన ఉండాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. మార్పులకు తగిన నైపుణ్యాలు నేర్చుకోవడమే కాదు, టీమ్‌ను ఉత్తేజపర్చేలా ఉండాలని అనుకుంటున్నాయి. అందువల్ల జాబ్‌కు ఉండాల్సిన నైపుణ్యాలను ఈ విద్యార్థులు తెలుసుకుని ఉండాలి. అలాగే తన నైపుణ్యాలు, ఆసక్తులు, ఆకాంక్షలకు తగిన ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిది కూడా. అసలు ఇండస్ట్రీ ఏమి అనుకుంటోందో తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుని ఆచరణలో పెడితే జాబ్‌ సులువుగా పొందే అవకాశం ఉంటుంది.
 
ఇన్నో క్రియేటివ్‌
అభ్యర్థులు పుస్తకాలకు ఆవల ఆలోచించే వ్యక్తులై ఉండాలని, ఇవాల్టి యాజమాన్యాలు భావిస్తున్నాయి. అలోచనలు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అకడమిక్‌ పరిజ్ఞానానికి పరిమితమైన వ్యక్తి నిజంగా మంచి ఇంజనీరు కాలేడు. ఐడియల్‌ అభ్యర్థి ఇన్వెంటర్‌లా ఆలోచించగలుగుతాడు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల్లో పని తీరులో విపరీతమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ కారణంగానే సరికొత్త ఆలోచనలు కలిగిన వండర్‌ బ్రెయిన్స్‌ కోసం ఈనాటి కంపెనీలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి.
 
సాంకేతికతలో ముందంజ
ఇవాళ కొత్తగా అనిపిస్తున్నది రేపటికి పాతది అవుతోంది. అందువల్ల సాంకేతికపరంగా ఇంజనీరింగ్‌ విద్యార్థి ఎప్ప టికీ సదరు అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలను అలవర్చుకుని ఉం డాలి. అప్‌డేట్‌ కాకుంటే జాబ్‌లో వెనకబడినట్లే. సరి కొత్త ట్రెండ్‌లకు అనుగుణంగా తన మెదడును పదును పెట్టు కోవాలి. సంబంధిత పరిజ్ఞానాన్ని పూర్తిగా విస్తృత పర్చు కోవాలి. అన్నింటికిమించి ఆకళింపు చేసుకుని ఉండాలి.
 
మల్టీ టాస్కింగ్‌
ఒకే పర్యాయం అనేకానేక విధులను ఇంజనీర్‌ నిర్వర్తిం చాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్‌ కళ చాలా అవసరం. టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నప్పుడు అందులో సహ ఉద్యోగులకు తోడు క్లయింట్లకూ వృత్తిపరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. వారి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. ఇంజరింగ్‌ నుంచి కొద్దిగా ముందుకు అంటే మేనేజ్‌మెంట్‌ రంగంవైపు మొగ్గితే పలు పనులను చక్కబెట్టాల్సి వస్తుంది. అంటే సంబంధిత సామర్థ్యాలను అల వర్చుకోవాలి.
 
గ్లోబ్‌ రూటింగ్‌
ఇంజనీర్‌ మరో స్థాయికి ఎదగాలంటే తను పని చేస్తున్న కంపెనీలో విధుల నిర్వహణకే పరిమితం కారాదు. మరిన్నింటిని తెలుసుకునేందుకు పలు ప్రదేశాలను సందర్శించాల్సి రావచ్చు. అది వివిధ దేశాల్లో పర్యటన కూడా కావచ్చు. తనకున్న పరిజ్ఞాన ప్రదర్శన మొదలుకుని కొత్తగా నాలెడ్జ్‌ని పొందడం వరకు ఎందుకైనా కావచ్చు. పర్యటనలకు కొంత మంది విముఖంగా ఉంటారు. అయితే ఈ రోజుల్లో అది తప్పనిసరి. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బైటకి వస్తేనే ఈ విషయంలో ఇంజనీర్లు ముందడుగు వేయగలగుతారు. ట్రావెల్‌లో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగాలి.
 
ఎప్పుడూ నాయకుడే
మంచి మార్కులు, ర్యాంక్‌తో చాలా మంది ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండవచ్చు. అయితే వారిలో కొద్ది మందికి మాత్రమే నాయకత్వ నైపుణ్యాలు ఉంటాయి. ఒక కంపెనీ తీసుకోవాలంటే నాయకత్వ లక్షణాలూ ఉండాలి. బృందాలకు నాయకుడిగా పని చేసిన విషయాన్ని ఇంటర్వ్యూ సమయంలోనే తెలియజేయండి. వివిధ అకడమిక్‌ ఈవెంట్లకు ఎలా నాయకులుగా వ్యవ హరించారో అందులో తెలియాలి.
 
ఉత్సుకత (యాంబిషస్‌)
ప్రైవేట్‌ సెక్టార్లో ఉద్యోగంలో ఎగుడుదిగుడులు సహజం. రిస్క్‌ను ఎదుర్కోగలగాలి. ఒక దాని తరవాత మరొకటి అన్నట్టు వేగంగా కదలాలి. సెల్ఫ్‌ మోటివేషన్‌ నిరంతరం ఉండాలి. స్ట్రాంగ్‌ మైండ్‌సెట్‌కు తోడు ఇంజనీర్‌గా విజయవంతం కావాలన్న ఆకాంక్ష బలంగా పని చేయాలి.
 
ఇంట్రప్రెన్యూర్‌
ఎంట్రప్రెన్యూర్‌లాంటిదే, సరిగ్గా అదే కాదు. సంస్థ తనది అనే భావన ఉండాలన్న మాట. ఇంట్రప్రెన్యూర్‌ లేదంటే కార్పొరేట్‌ ఎంట్రప్రెన్యూర్‌గా దీన్ని భావించాలి. ప్రతి ఉత్పత్తిని తానే రూపొందించి బైటకు పంపుతున్న భావన కలిగి ఉండాలి. ఫలితంగా సామర్థ్యాన్ని గరిష్ఠంగా ఉపయోగించే వీలు ఇంజనీర్‌కు కలుగుతుంది. ఒక్కోసారి తప్పులు దొర్లవచ్చు. లేదంటే అనుకున్న ఫలితం సాధించలేకపోవచ్చు. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. మళ్ళీమళ్ళీ ప్రయత్నించాల్సిందే. అప్పుడే విజయవంతమైన ఇంజనీర్‌ కాగలుగుతారు.
 
కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు
పేరొందిన సంస్థల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగం కావాలంటే మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి. క్లిష్టమైన థియరీలు నేర్చుకుని లాభం లేదు. వాటిని వల్లించడంతోనూ ఉపయోగం లేదు. ఇంజనీర్‌ తన ఆలోచనలను చక్కగా బైటపెట్ట గలగాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే సత్తా ఉంటే, మంచి కమ్యూనికేటర్‌ కావచ్చు. తోటి ఉద్యోగులు, క్లయింట్లతో చక్కగా మాట్లాడగలగాలి. పరస్పరం ఆలోచనలను పంచుకోగలగాలి. అప్పుడే పని సాఫీగా సాగుతుంది.