ఉద్యోగంలో మొదటిరోజు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఉద్యోగంలో మొదటిరోజు
ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌... ఉద్యోగి - యజమానుల విషయంలోనూ ఇది అతికినట్టు సరిపోతుంది. దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూలో చూసినప్పుడు యజమానికి కలిగే మొదటి ఇంప్రెషన్‌... అతడికి కొలువు ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఉద్యోగం వచ్చాక, ఆఫీసులో తొలిరోజు అనుభవం, సంస్థపై ఉద్యోగికో అవగాహన కలిగిస్తుంది. ఆ అనుభవం గొప్పగా ఉంటే, అక్కడే కలకాలం పనిచేయాలని అనుకుంటాడు. చేదుగా అనిపిస్తే... తన ప్రయత్నాలు తను చేసుకుంటాడు. అందుకే, చాలా కంపెనీలు ఉద్యోగి మొదటి రోజును మరిచిపోలేనిదిగా మారుస్తున్నాయి. సృజనాత్మకంగా డిజైన్‌ చేస్తున్నాయి.
 
ఏక్‌ సెల్ఫీ బాస్‌!
బెంగళూరులోని రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ ‘నో బ్రోకర్‌’ సంస్థలో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు.. సీనియర్‌ ఉద్యోగుల్ని పరిచయం చేసుకుని వారితో కచ్చితంగా ఓ సెల్ఫీ తీసుకోవాలని షరతు. ఇలా చేయడం వల్ల మొదట్లోనే సీనియర్స్‌ అంటే భయం పోతుంది. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. దాంతోపాటే, తొలిరోజు జ్ఞాపకాలు పదిలంగా నిలిచిపోతాయి.
 
నెత్తిన టోపీ...
గూగుల్‌లో కొత్త ఉద్యోగులకు తొలిరోజు ప్రత్యేకంగా రూపొందించిన ఓ టోపీని బహూకరిస్తారు. అలాగే కొన్ని సంస్థల్లో టేబుల్‌ పైన పెట్టుకునేందుకు ఓ బెలూన్‌ అందిస్తారు. వీటి వల్ల, అతను కొత్త ఉద్యోగి అనే విషయం అందరికీ తెలుస్తుంది. పని భారం వేయరు. సాయం చేసేందుకు సీనియర్లు ముందుకొస్తారు. అలా బంధాలు బలపడతాయి.
 
ఇష్టమైన వంటకాలు కనుక్కోండి
ఓ స్టార్టప్‌లో కొత్త ఉద్యోగులను తొలిరోజే.. కనీసం 20 మంది సహోద్యోగులతో మాట్లాడి, వారికి ఇష్టమైన వంటకాల గురించీ, నచ్చిన సంగీతం గురించీ తెలుసుకోమని పురమాయిస్తారు. దీని వల్ల పక్కవారి ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. స్నేహపూర్వక వాతావరణం కూడా ఏర్పడుతుంది.
 
దుర్ఘటనలు చెప్పండి...
అమెజాన్‌, మనీటాప్‌ వంటి ఈకామర్స్‌ సంస్థల్లో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ‘మీ జీవితంలో ఎదుర్కొన్న ఏదైనా దుర్ఘటన గురించి కానీ, ఇబ్బందికరమైన పరిస్థితి గురించి కానీ చెప్పండి’ అని అడుగుతారట. ఓ మనీటాప్‌ ఉద్యోగి ‘‘ఓసారి ఓ స్నేహితుడికి, నా భార్యను పరిచయం చేసేటప్పుడు తన పేరు మరిచిపోయి ఇబ్బంది పడ్డా...’’ అని చెప్పాడట. అంతే అతని ఉద్యోగం ఊడిపోయింది. చిన్నచిన్న ఇబ్బందికర విషయాల నుంచే ఉద్యోగి వ్యక్తిత్వం, అతని జ్ఞాపకశక్తి తెలుస్తాయి. ఆ పరిస్థితుల నుంచి అతనెలా బయట పడ్డాడనే దాన్ని బట్టి ఉద్యోగి మానసికస్థైర్యం కూడా తెలుసుకోవచ్చు.
 
వెతికి పట్టుకోండి!
కొన్ని సంస్థల్లో కొత్త ఉద్యోగులతో ‘ట్రెజర్‌ హంట్‌’ లాంటి ఆటలు ఆడిస్తారు. ఆఫీసులో ఓ చోట రహస్యంగా దాచిపెట్టిన వస్తువులను వెతికి పట్టుకొమ్మని చెబుతారు. ట్రెజర్‌ హంట్‌ పేరుతో ఉద్యోగులు ఆఫీసంతా తిరుగుతారు, ఫలితంగా ఆఫీసు పరిసరాల గురించీ, ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయనే దాని గురించీ మంచి అవగాహన ఏర్పడుతుంది, భవిష్యత్తులో సహోద్యోగులను అదెక్కడ? ఇదెక్కడ? అని అడిగి డిస్టర్బ్‌ చేయడమూ జరగదు.
 
అపాయింట్‌మెంట్‌ తీసుకోండి...
పుణెలోని ‘జాంబే’ అనే సంస్థలో, ఉద్యోగంలో జాయినైన మొదటిరోజే, పది మంది క్లయింట్స్‌ నెంబర్లు ఇచ్చి, కనీసం ఒక్కరితోనైనా అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసుకోమని చెబుతారు. అయితే కొత్తఉద్యోగులు క్లయింట్స్‌కి కాల్‌ చేస్తున్నప్పుడు... వారి పేర్లు, కంపెనీ ఉత్పత్తుల వివరాలను తప్పుగా చెప్పి, తికమకకు గురిచేస్తారు సీనియర్లు. ఇలా చేయడం వల్ల కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆత్రుత పెరుగుతుంది కొత్త ఉద్యోగుల్లో!
 
ఓ మంచి డైలాగ్‌ చెప్పు గురూ...
ఫర్నీచర్‌ తయారీ సంస్థ ‘అర్బన్‌ లాడర్‌’ వ్యవస్థాపకులు... తమ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ‘మీరు చూసిన సినిమాల్లో నచ్చిన డైలాగ్‌ చెప్పండి’ అని అడుగుతారట. పని భయం పోగొట్టేందుకు ఇది బాగా ఉపయోగపడుతోంది.