టెట్‌న్షన్‌.. అభ్యర్థుల గుండెల్లో గుబులు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
టెట్‌న్షన్‌.. అభ్యర్థుల గుండెల్లో గుబులు
అనంతపురం అర్బన్‌, ఫిబ్రవరి 12 : ఆ అమ్మాయి పేరు రాములమ్మ. చెన్నేకొత్తపల్లి మండలవాసి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. పేపర్‌-2 పరీక్ష రాయనుంది. ఈ అమ్మాయికి ప్రకాశం జిల్లాలోని పరీక్ష కేంద్రం కేటాయించారు. మరో అమ్మాయి పేరు సాయిప్రియాంక. ఎస్‌జీటీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. పేపర్‌-1 పరీక్ష రాయాల్సి ఉంది. అనంతపురానికి చెందిన ఈమెకు చీరాల పరీక్ష కేంద్రం కేటాయించారు. అక్కడికి వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
 
ఇలా అనేకమంది అభ్యర్థులకు సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించారు. బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ట్రాల రాజధా నులనూ వదల్లేదు. వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న కేంద్రాలు కేటాయించడంతో కొన్ని గం టల పాటు అభ్యర్థులు ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరమైతే ఒక రోజు ముందుగానే అక్కడికి వెళ్లాలి. వేలాది రూపాయలు ఖర్చు కావడమే కాకుండా ప్రయాణం కోసం వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది.
 
డీఎస్సీ పోస్టు వస్తుందో..లేదో తెలియదు గానీ అభ్యర్థులకు మాత్రం అగ్నిపరీక్ష పెడుతున్నారు. డీఎస్సీ రాసే అభ్యర్థులు ముందుగా ఉ పాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)రాయాల్సి ఉం టుంది. ఇందులో అర్హత సాధించినవారే డీఎస్సీ ఫైనల్‌ పరీక్షకు అర్హులవుతారు. దీంతో టెట్‌ కూడా అభ్యర్థుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. ప్రస్తుతం టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి మార్చి 1 వరకూ టెట్‌ నిర్వహిం చనున్నారు. తొలిసారిగా దీన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టా రు. రెండురోజులుగా అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వాటిలో తమకు కేటాయించిన కేంద్రాలు చూసి నివ్వెరపోతున్నారు. చాలామందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరీక్ష కేంద్రాలు కేటాయించారు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. కొందరయితే ముం దస్తుగానే రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు కుస్తీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
 
డీఎస్సీ-2018 నియామకాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టెట్‌ నిర్వహణకు సిద్ధమ యింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. రెండురోజులుగా వాటిని సంబంధిత అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే వాటిలో పరీక్ష కేం ద్రాలు చూసుకుని చాలామంది అభ్యర్థులు షా క్‌కు గురవతున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో టె ట్‌ నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాల్లో సరైన సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాల్లోని కేంద్రాలను అ భ్యర్థులకు కేటాయించాల్సి వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 3.50 లక్షల మంది వరకూ టెట్‌ రాసే అవకాశాలున్నా యి. ఈ లెక్కన జిల్లాలో 30 నుంచి 40వేల మంది అభ్యర్థులు టెట్‌ రాయనున్నట్లు గణాంకా లు చెబుతున్నాయి. అయితే ఇష్టారాజ్యంగాప రీక్ష కేంద్రాలు కేటాయించారు. ఎక్కడో వందలా ది కి.మీ దూరంలో ఉన్న జిల్లాలు కేటాయించారు.
 
ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు సైతం గుంటూరు, చీరాల, ప్రకాశం, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి కేంద్రాలు కేటాయించారు. చివరగా దరఖాస్తు చేసుకు న్న అభ్యర్థులకు మాత్రం అనంతపురంతో పా టు చుట్టుపక్కల ఉన్న కడప, కర్నూలు, చిత్తూ రు జిల్లాల్లోని కేంద్రాలు కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్ష కొంత సౌలభ్యంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష రాసేటప్పుడు ఆన్‌లైన్‌లో అయితే చివరి వరకూ జవాబులు మార్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే ఆఫ్‌లైన్‌ పరీక్ష అయితే ఒకసారి ఆన్సర్‌ ఇచ్చిన తరువాత వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆన్‌లైన్‌ పరీక్ష అన్నప్పుడు తొలుత కొంత ఆందోళన చెందిన అభ్యర్థులు ఆ తరువాత ఆమోదం తెలుపుతూవ చ్చారు. అయితే ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముంది.
 
కానీ ఇక్కడ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పి ప్రభుత్వం చేతులెత్తేయడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. తమసౌల భ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇ ష్టానుసారంగా కేంద్రాలు కేటాయించిందని అ భ్యర్థులు మండిపడుతున్నారు. చంటిబిడ్డలు, గ ర్భవతులు, దివ్యాంగులు, మహిళలు అంతదూ రం వెళ్లి పరీక్షలు రాయాలంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక దృష్టిపెట్టి.. అభ్యర్థుల ఇబ్బందులు గుర్తించి అనుకూలమైన ప్రాంతాల్లోనే సౌకర్యాలు కల్పిం చి పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
జిల్లాలో నిర్వహణకు అవకాశం..
ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించడానికి జిల్లాలో అవకాశముందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో 16 ఇంజనీరింగ్‌ కళాశాలలున్నా యి. ఇందులో సుమారు 10 కళాశాలల్లో కం ప్యూటర్‌ సౌకర్యాలున్నట్లు ఎస్కేయూ, జేఎన్‌టీయూ అధికారులు చెబుతున్నారు. అలాగే కం ప్యూటర్‌ వసతులున్న డిగ్రీకళాశాలలు కూడా జి ల్లాలో ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగించుకుంటే ఒకపూటకు 1500 నుంచి 2000 మంది వరకూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష రాయడాని కి అవకాశముంటుంది. ఇటీవల జిల్లాలో ఎం సెట్‌ పరీక్ష ఇలాగే నిర్వహించారు. ఒకపూటకు 2000 మంది చొప్పున రోజుకు 4 వేల మంది అభ్యర్థులు ఈనెల 21 నుంచి మార్చి 1 వరకూ టెట్‌ రాయవచ్చు. అయితే ఏజెన్సీ ఇలా ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్లు అభ్యర్థులను ఇతర జిల్లాలు, ప్రాంతాలకు కేటాయించడం విమర్శల కు తావిస్తోంది.
 
ముందస్తు రిజర్వేషన్‌లకు కుస్తీ..
అభ్యర్థులు ఒకవైపు టెన్షన్‌ పడుతూనే.. మరోవైపు పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. హాల్‌టిక్కెట్లలో తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను చూసుకుని ఆం దోళన చెందుతూ.. ఆయా ప్రాంతాలకు ఎలా వె ళ్లాలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటు న్నారు. ఏఏ రోజుల్లో ఏ ఏ వేళల్లో ఆయా ప్రాం తాలకు రైళ్లు, బస్సులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. సోమవారం నుంచి రైలులో రిజర్వేషన్‌ చేసుకోవడానికి అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. రైల్వేస్టేషన్‌లోనూ డీఎస్సీ అభ్యర్థులతో సందడి కనిపిస్తోంది.
 
చంటిబిడ్డతో ఎలా వెళ్లాలి
- అమరావతి, డీఎస్సీ అభ్యర్థిని
నేను ఎస్‌జీటీ పోస్టుకు పోటీపడుతున్నాను. టెట్‌కు ద రఖాస్తు చేసుకోగా.. గుంటూ రు కేంద్రం కేటాయించారు. రెండు నెలల బాలింతను. చంటిబిడ్డతో అన్ని వందల కిలోమీటర్లు ఎలా వె ళ్లి పరీక్ష రాయాలో అర్థం కాలేదు. ఆ ప్రాంతాని కి వెళ్లాలంటే అక్కడి వాతావరణం చంటిబిడ్డకు అనుకూలంగా ఉంటుందో... లేదో తెలియదు. వెంట మరో ఇద్దరిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. డ బ్బు ఖర్చుతో పాటు ప్రయాస పడాలి. ముందుగానే టెన్షన్‌ పడుతున్నాం. ఆ పైన పరీక్ష కేంద్రా లు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చంటిబిడ్డలు, గర్భవతులు, దివ్యాంగులు, మహి ళా అభ్యర్థులకు జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశం కల్పించాలి.
 
ప్రభుత్వతీరు సరికాదు
- ఉషారాణి, డీఎస్సీ అభ్యర్థిని
డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం వ్యవహరిస్తు న్న తీరు సరిగ్గా లేదు. ఏజెన్సీకి బాధ్యతలు అ ప్పజెప్పి అభ్యర్థుల సౌకర్యాల గురించి ఆలోచించకపోవడం బాధాకరం. ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలు కేటాయించి ఏజెన్సీ ఇబ్బందులు పెడుతోంది. నేను పేపర్‌-2, పేపర్‌-3 పరీక్ష రాయాల్సి ఉంది. పేపర్‌-2కు గుంటూరు కేటాయించారు. పేపర్‌-3కి కడప కేటాయించారు. ఎలా వెళ్లాలో.. ఎలా రాయాలో దిక్కు తోచడం లేదు. ప్రభు త్వం ఇలాంటి వాటిపై సీరియ్‌సగా స్పందించి అభ్యర్థులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
 
కేంద్రాల కేటాయింపు అస్తవ్యస్తం
- హరిప్రసాద్‌, డీఎస్సీ అభ్యర్థి
టెట్‌కు కేంద్రాల కేటాయింపు అస్తవ్యస్తంగా ఉంది. నేను ఎస్‌జీటీ పో స్టుకు దరఖాస్తు చేసుకున్నా. పేపర్‌-1 పరీక్ష రాయాలి. గుంటూరు కేంద్రం కేటాయించారు. అనంతపురం నుంచి అక్కడికి వెళ్లి పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి. గంటలకొద్ది ప్రయాణం చేయాలి. ఆర్థికభారం, ఆపైన వ్యయప్రయాసలు. ఒకరోజు ముందుగానే వెళ్లాలి. సెంటర్‌ ఎక్కడుందో వెతుక్కోవాలి. ముందుగానే ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహి స్తున్నారు. ఇప్పుడు పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. అనుకూలమైన ప్రాం తాల్లోనే కేంద్రాలు కేటాయించి పరీక్షలు రాయించేలా చూడాలి.