నిరుద్యోగులను మోసగించిన ఇద్దరి అరెస్టు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నిరుద్యోగులను మోసగించిన ఇద్దరి అరెస్టు
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 : ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి డబ్బు లు వసూలు చేసి మోసగించిన ఇద్దరిని ద్వారకా పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. శంకరమఠం రోడ్డు శాంతిపురంలో టెక్‌ మీడియా బిజినెస్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థను నెల్లూరు జిల్లాకు చెందిన అమర్‌నాఽథ్‌ మహేంద్రరెడ్డి కొద్ది కాలం క్రితం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఇంటి వద్దనే ఉద్యోగం చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చన్ని నమ్మించాడు. దీంతో కొంత మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలను నిర్వహించాడు. కొంత నగదు వసూలు చేశాడు. ఇతడికి నెల్లూరు జిల్లాకే చెందిన పిలక విజయ్‌ భాస్కర్‌రెడ్డి సహకరించేవాడు. కొద్ది రోజుల క్రితం సంస్థను మూసివేశారు. దీంతోనిరుద్యోగ బాధితులంతా ద్వారకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదనరావు నిందితులను అరెస్టు చేశారు.