మంచిగా సదువుకోండ్రా Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మంచిగా సదువుకోండ్రా
లవ్వులు.. గివ్వులు మనకొద్దు
సదువుతూ ఎంజాయ్ చేయండి
అమ్మ అయ్యలను చూసుకోండి
సినీ హీరో విజయ్ దేవరకొండ

కంది, మెదక్, ఫిబ్రవరి 12: ‘మంచిగా సదువుకోండ్రా తమ్ముళ్లు.. సదువుకుంటే మంచి ఉద్యోగం వస్తది.. మంచి పెళ్లాం వస్తది, కుటుంబం మంచిగుంటది. అమ్మా అయ్యా సంతోషిస్తరు..’ అంటూ సినీ హీరో విజయ్ దేవరకొండ ఐఐటీ విద్యార్థులకు హితబోధ చేశాడు. ఐఐటీ ఎలాన్, ఎన్‌విజన్ ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో యువతకు చక్కటి సందేశమిచ్చాడు. ఎవ్వడైన సదువుకుంటేనే బాగుపడ్తడు. లేకుంటే సంకనాకిపోతాడంటూ నొక్కి చెప్పాడు. అమ్మాయిల వెంట తిరుగతూ లవ్వు గివ్వులంటూ సమయం వృథా చేయకుండా మంచిగా సదువుకోవాలె బిడ్డా అని తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించాడు. మంచి ఊపు మీదున్నారు ఎంజాయ్ చేయండ్రా, కానీ సదువుకుంటూ ఎంజాయ్ చేయాలన్నాడు. సదివితే మంచి భవిష్యత్తు ఉంటది... అమ్మ అయ్యలను బాగా చూసుకోవచ్చు. జన్మనిచ్చిన వారి కోసం మంచి పనులు చేయండని యువతకు విజయ్ హితవు పలికాడు.
 
సినిమాను సినిమాగానే చూడండి
నిజజీవితానికి సినిమాకు ముడిపెట్టవద్దని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. సినిమాను సినిమాగానే చూడాలనీ, సాధారణ కుటుంబంలో పుట్టిన తనకు సినిమా కష్టాలు తెలుసునన్నాడు. గతంలో తనకు ఓ లవర్ ఉండేదనీ, అన్నీ వదిలేసి సినిమాలో వేషాలు వేస్తున్నానని గుర్తు చేశారు. మంచిగా సదువుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరాడు. జన్మనిచ్చిన వారికి తలవంపులు తేకుండా సార్థకం చేసుకుంటూ మంచి పనులు చేయాలన్నాడు. ఎలాన్ ముగిసింది.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని యువతీ, యువకులను విజయ్ కోరాడు. ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండకు ఓ అభిమాని తన మెడలోని పూసల దండను అందజేయగా.. అందుకు ప్రతిస్పందించిన ఆ హీరో తన వేలి ఉంగరాన్ని ఆ అభిమానికి బహుమానంగా ఇచ్చాడు.