జాబ్‌ పేరుతో మోసాలు.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జాబ్‌ పేరుతో మోసాలు..
నిందితున్ని అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్‌ వెకెన్సీస్‌ ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇస్తాడు. జాబ్‌ కోసం సంప్రదించిన గ్రాడ్యుయేట్స్‌ను ఫోన్‌లోనే ఇంటర్వ్యూ చేసి కొంత డబ్బు బ్యాంక్‌ ఎకౌంట్లో డబ్బు జమచేయాలని సూచిస్తాడు. వాటిలో డబ్బు జమ కాగానే ఫోన్‌ స్విచాఫ్‌ చేస్తాడు. ఈ విధంగా బెంగళూరు హైదరాబాద్‌లలో అనేక మందిన మోసం చేసి డబ్బులు దండుకుంటున్న కేటుగాడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. హేమ శివకుమార్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని నిజాంపేట్‌ నకిలీ చిరునామాతో మాధురి ఆకాశ్‌ అనే నకిలీ పేరుతో రెండు బ్యాంకు ఖాతాలను తెరిచాడు. ఎంఎన్‌సీ కంపెనీల్లో జాబ్స్‌ ఉన్నాయని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చి ఫోన్‌లో ఇంటర్వ్యూలు చేసేవాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన సీఎస్‌ రెడ్డి ఆన్‌లైన్‌లో ప్రకటన చూసి ఆకాశ్‌కు ఫోన్‌ చేశాడు. క్యాప్‌జెమినీ కంపెనీలో జావా డెవలపర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇంటర్వ్యూ అనంతరం రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.1.70లక్షలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు రూ.50వేలు చెల్లించాడు. తనకు తనకు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ పంపాలని కోరగా... అతను స్పందించ లేదు. మిగిలిన డబ్బు చెల్లిస్తేనే ఆఫర్‌ లెటర్‌ పంపిస్తానని ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్‌ నెంబర్‌, కాల్‌డాటా ఆధారంగా నిందితున్ని అరెస్ట్‌ చేశారు.