‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరిట గాలం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరిట గాలం
ఉద్యోగాలిప్పిస్తామని మోసం...ఢిల్లీ వాసి అరెస్టు
రూ. 4.2 లక్షలు, ఫోన్లు, చెక్కుబుక్‌లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కింద ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలిప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీకి చెందిన ధీరజ్‌సింగ్‌(32) జస్ట్‌డయల్‌, షైన్‌ డాట్‌కామ్‌లాంటి జాబ్‌ వెబ్‌సైట్లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి బయోడేటాలను కొనుగోలు చేస్తుంటాడు. అందులోని వివరాల ఆధారంగా వారిని కాంటాక్ట్‌ చేస్తాడు. దీనికోసం కొంతమంది టెలికాలర్లను నియమించి వారి ద్వారా కాల్స్‌ చేయిస్తాడు. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కింద ఎయిర్‌పోర్టులో గ్రౌండ్‌స్టాఫ్‌ ఉద్యోగానికి మీరు సెలెక్ట్‌ అయ్యారంటూ వారిని నమ్మిస్తాడు. ఖర్చుల నిమిత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెబుతాడు. నకిలీ ఐడీలు సృష్టించి బ్యాంకు అకౌంట్‌లు తెరిచి... ఆ ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాడు. డబ్బులు చెల్లించిన తర్వాత ఆశతో ఎదురు చూసే నిరుద్యోగులకు నిరాశ మిగులుతోంది.
 
వారిని కాంటాక్ట్‌ చేయడానికి బాధితులు ప్రయత్నిస్తే ఫోన్లు స్విచాఫ్‌ వస్తాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఒకరు, ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మోసపోయిన వారు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌కు చెందిన సుక్రితి రూ. 83 వేలు, యాదగిరి లక్షా 70 వేలు, రవూఫ్‌ నాలుగు లక్షల 17 వేల రూపాయలను నిందితుడికి చెల్లించారు. బాధితులు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌లు, మెయిల్‌ ఐడీలు, డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్‌ నెంబర్లు, ఇతర ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి ఈనెల 9వ తేదీన ఢిల్లీలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై అతడిని నగరానికి తరలించి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడి నుంచి రూ. 4.2 లక్షలు, 16 మొబైల్‌ ఫోన్లు, చెక్కుబుక్‌లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.