గురుకుల మెయిన్స్‌ వాయిదా Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
గురుకుల మెయిన్స్‌ వాయిదా
జాబితా తయారీలో సీజీజీ గజిబిజి
ఒక అభ్యర్థి వివరాలు మరో అభ్యర్థికి
టీఎ్‌సపీఎస్సీ పరిశీలనలో గుర్తింపు
జాబితా వెల్లడికి ముందే నిలిపివేత
సీజీజీ రూపొందించిన జాబితా రద్దు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గురుకుల మెయిన్స్‌ పరీక్షలను టీఎ్‌సపీఎస్సీ వాయిదా వేసింది. మెయిన్స్‌కు ఎంపిక చేసిన మెరిట్‌ జాబితాను ప్రకటించడానికి ముందే రద్దు చేసింది. మెరిట్‌ జాబితాను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) గజిబిజిగా తయారు చేయడమే ఇందుకు కారణం. గురుకుల జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.
 
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్థుల సమాచారంతోపాటు పరీక్షకు ముందు, తర్వాత నిర్వహించే ప్రక్రియ మొత్తం సీజీజీనే చేపడుతోంది. గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్‌ సాధించిన వారి నుంచి ఒక్కో పోస్టుకు 15 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు సీజీజీ జాబితా సిద్ధం చేసి టీఎస్‌పీఎస్సీకి పంపింది. అయితే ఈ జాబితా తయారీలోనే తప్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఒక అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని మరో అభ్యర్థికి చూపిస్తూ మెయిన్స్‌కు అర్హుల జాబితాను సీజీజీ తయారు చేసింది. అభ్యర్థుల వివరాలు కూడా గజిబిజిగా రూపొందించింది. అయితే, అభ్యర్థుల సమాచారాన్ని, ఎంపిక విధానాన్ని టీఎస్‌పీఎస్సీ మరోసారి పరిశీలించడంతో లోపాలు బయటపడ్డాయి. జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు మ్యాచ్‌ కాలేదు. దాంతో, సంబంధిత జాబితాలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. వాటిని మరోసారి పరిశీలించిన తర్వాతే గురుకుల పోస్టుల మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించాలని నిర్ణయించింది.
 
ఈనెల 19 నుంచి మార్చి 23వ తేదీ వరకు జరగాల్సిన గురుకుల పోస్టుల మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేసింది. మెయిన్స్‌ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. కాగా, ఈసారి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించక ముందే తప్పిదాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అభ్యర్థులు గందరగోళంలో పడకుండా, మరోసారి పరువు పోకుండా టీఎస్‌పీఎస్సీ సిబ్బంది, కమిషన్‌ వర్గాలు బయటపడ్డాయి.
 
గ్రూప్‌-1 తుది ఫలితాల్లోనూ..
సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌..! చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోంది! ప్రభుత్వ కొలువుపై కోటి ఆశలు పెట్టుకున్న యువత జీవితాలతో ఆడుకుంటోంది. సీజీజీ నిర్వాకం ఫలితంగా గతంలో 2011 గ్రూప్‌-1 తుది ఫలితాలనే నిలిపి వేయాల్సి రాగా.. ఇప్పుడు గురుకుల మెయిన్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. 2011 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాల్లో సీజీజీ తప్పులు చేసిన విషయం తెలిసిందే. దాంతో, మెరిట్‌ అభ్యర్థులకు అప్రధాన పోస్టింగులు వస్తే, పెద్ద ర్యాంక్‌ వచ్చిన వారికి కీలక పోస్టింగులు దక్కాయి. అభ్యర్థులు ఆందోళన చేయడంతో టీఎ్‌సపీఎస్సీ పోస్టింగులు రద్దు చేసింది కూడా. మెరిట్‌ అభ్యర్థులకు పోస్టింగుల కేటాయింపులో సీజీజీలో తప్పిదం జరిగిందని అప్పట్లో గుర్తించారు. అభ్యర్థుల నుంచి మళ్లీ వెబ్‌ ఆప్షన్లు స్వీకరించి తప్పును సరి చేశారు.
ఇక, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు నిర్వహణలో భాగంగా టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వ్యక్తిగత సమాచారంలోనూ భారీగా తప్పులు దొర్లాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థుల వ్యక్తిగత సమాచారంలో తప్పుల సవరణకు టీఎ్‌సపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా, ఎడిట్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకుని అభ్యర్థులు తప్పులు సవరించుకున్నారు. కానీ, దరఖాస్తుల పీడీఎఫ్‌ కాపీల్లో ఆ సవరణలు కనిపించలేదు. తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీషు మీడియం, ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్టు రావడమే కాకుండా జెండర్లు కూడా మారలేదు. దాంతో, అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించి సమస్యను వివరించారు. దాంతో, వారి విజ్ఞప్తులను టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తోంది.