మరో 12 ల్యాబ్‌ కోర్సుల అభ్యర్థులకూ అవకాశం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మరో 12 ల్యాబ్‌ కోర్సుల అభ్యర్థులకూ అవకాశం
ల్యాబ్‌ టెక్నిషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులకు అర్హత
సర్కారు నిర్ణయం.. ఒకటి రెండ్రోజుల్లో ఉత్తర్వులు
దరఖాస్తుకు చివరి తేది ఈ నెల 25 !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ల్యాబ్‌ టెక్నిషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో 12 ల్యాబ్‌ సంబంధిత కోర్సులు చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబరు 23న రాష్ట్రంలోని 200 ల్యాబ్‌ టెక్నిషీయన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేవలం డిప్లొమో ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సులు చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. దీంతో ల్యాబ్‌ సంబంధిత వివిధ కోర్సులు చేసిన అభ్యర్థులు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో సదరు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు కూడా అవకాశమివ్వాలని ఆయా కోర్సుల అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారికీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఒకటి రెండ్రోజుల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. కాగా, ల్యాబ్‌ టెక్నిషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 24నే చివరి తేదీ. కాగా తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 25 వరకు గడువు పెంచనున్నారు. జీవో విడుదల చేసిన వెంటనే టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌లో 12 కోర్సుల ఆప్షన్‌ కూడా కనిపించనుంది.