టీఆర్టీ అభ్యర్థులకు సాంకేతిక కష్టాలు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
టీఆర్టీ అభ్యర్థులకు సాంకేతిక కష్టాలు
జెండర్‌, లాంగ్వేజీ, సబ్జెక్టు తారుమారు..
24 నుంచి పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు
న్యాయం కోసం టీఎస్‌పీఎస్సీ ముందు అభ్యర్థుల ఆందోళన
 
హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి: ఆమె పేరు సురేఖ. హైదరాబాద్‌ బోరబండ నివాసి. టీచర్‌ ఉద్యోగం కోసం ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. కానీ, ఆమె అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో జెండర్‌లో పొరపాటు దొర్లింది. ‘మహిళ’కు బదులు ‘పురుషుడు’గా నమోదైంది. దీంతో ఆందోళన చెందిన ఆమె.. టీఎస్‌పీఎస్సీకి వద్దకు వెళ్లి తన సమస్యను అధికారులకు వివరించారు. కానీ, ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరికొద్ది రోజుల్లోనే పరీక్ష ఉండడం, సాంకేతిక కారణాలను పరిష్కరించుకోవడానికే సమయమంతా పోతుండడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఆయన పేరు సోమ సాయికిరణ్‌. మెదక్‌ జిల్లా వాసి. ఉపాధ్యాయుడు కావాలన్నది ఆయన కల. ఇందుకోసం టీఆర్‌టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెలుగు మీడియంలో సోషల్‌ స్టడీస్‌ కోసం సన్నద్ధమవుతున్న సాయికిరణ్‌కు ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష రాయాల్సిందిగా అక్‌నాలెడ్జ్‌మెంట్‌ వచ్చింది. గతంలో ఎడిట్‌ ఆప్షన్‌లో వివరాలు సరిచేసుకున్నా అది మారలేదు. దీంతో ఏళ్ల తరబడి చదివిన చదువు వృథా కాబోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
వీరిద్దరిదే కాదు.. చాలా మంది టీఆర్‌టీ అభ్యర్థులు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సుమారు 2.50 లక్షల మంది టీఆర్‌టీకి సిద్ధమవుతుండగా.. సాంకేతిక ఇబ్బందులు వారి సమయాన్ని వృథా చేస్తున్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నాక వచ్చే అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో జెండర్‌, లాంగ్వేజీ, సబ్జెక్టులు తారుమారయ్యాయి. తాను తెలుగు మీడియంలో మ్యాథ్స్‌ సబ్జెక్టుకు సన్నద్ధమవుతున్నానని, కానీ, అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో ఇంగ్లిష్‌ మీడియం అని వచ్చిందని నల్లగొండకు చెందిన నాగమణి అనే అభ్యర్థిని చెప్పారు.
 
కాగా సోషల్‌ సబ్జెక్టుకు తెలుగు మీడియంలో దరఖాస్తు చేసుకున్న మహబూబ్‌నగర్‌కు చెందిన హరిబాబుకు మీడియంతోపాటు సబ్జెక్టు కూడా మారిపోయింది. సోషల్‌కు బదులు తెలుగు సబ్జెక్టు నమోదైందని ఆయన వాపోయారు. ఇక మహబూబ్‌నగర్‌కే చెందిన రాజేశ్వరి తెలుగు మీడియంలో పీఈటీకి దరఖాస్తు చేసుకొని పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. కానీ, ఆమె ఇంగ్లిష్‌ మీడియంగా అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో వచ్చింది. ఎడిట్‌ ఆప్షన్‌లో సరిచేసుకున్నాక కూడా ఇబ్బందులు ఎదురవుతుండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. దీంతో సోమవారం సుమారు 40 మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణికి వినతిపత్రం సమర్పించారు. టెక్నికల్‌ బోర్డుతో చర్చిస్తామని చైర్మన్‌ చెప్పినట్టుగా అభ్యర్థులు తెలిపారు.