ర్యాగింగ్‌ను అణిచేయండి! Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ర్యాగింగ్‌ను అణిచేయండి!
కారకులపై ఉక్కుపాదం మోపండి
లేదంటే నిధులు ఆపేస్తాం
నిట్‌లో ర్యాగింగ్‌ పై కేంద్రం తీవ్ర హెచ్చరిక
ఒక విద్యార్థి అడ్మిషన్‌ రద్దు
ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): స్థానిక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో ఇటీవలి ర్యాగింగ్‌ ఉదంతాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. చర్యలు తీసుకోని పక్షంలో నిధులు ఆపేస్తామని హెచ్చరించింది. బిహార్‌ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై ప్రాథమికంగా తీసుకున్న చర్యలను నిట్‌ వర్గాలు కేంద్రానికి పంపించాయి.
అప్పట్లో ఐదుగురు విద్యార్థులను 40 రోజులపాటు సస్పెండ్‌ చేశారు. దీనిపై సంతృప్తి చెందని కేంద్రం, ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. దీంతో నిట్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. వాస్తవానికి ఈనెల 2న బిహార్‌కు చెందిన ప్రథమ సంవత్సర విద్యార్థిపై 15 మంది ఏపీ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఇది కాస్తా ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల ప్రాంతీయ భేదాలుగా మారిపోయింది. ఉత్తరాదికి చెందిన విద్యార్థులు ధర్నాకు దిగారు. ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారమందించారు.
సీసీ కెమేరా ఫుటేజీలను పరిశీలించి, నిందితులను గుర్తించింది. దీనిపై ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌ సైతం స్పందించింది. కేంద్రానికి, డీజీపీకి సమాచారమందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న కేంద్రం నిట్‌కు ఘాటుగా లేఖ రాసింది. ర్యాగింగ్‌ను అణిచేయాలని, బాధ్యులపై ఉక్కుపాదం మోపాలని సూచించింది.
 
దీంతో నిట్‌ అధికారులు మొత్తం 15 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. అందులో ఒక విద్యార్థి అడ్మిషన్‌నే రద్దు చేశారు. మరో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. మిగిలిన 9 మంది విద్యార్థులకు హాస్టల్‌ వసతిని రద్దు చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించకపోతే నిట్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని, అందుకే తగుచర్యలు తీసుకున్నామని నిట్‌ అధికారి ఒకరు తెలిపారు.