వేసవి ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్స్‌ 100% Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
వేసవి ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్స్‌ 100%
విశాఖ ఐఐఎం సరికొత్త రికార్డు
62 మందికి రెండు నెలలు శిక్షణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): విశాఖ ఐఐఎం అరుదైన రికార్డు సాధించింది. వేసవి ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్లను 100% సాధించింది. వరుసగా మూడవ ఏడాది కూడా ప్రథమ సంవత్సరం విద్యార్థులు అందరూ వేసవి శిక్షణకు ఎంపికయ్యారు. ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలు, బ్యాంకులు, ఇతర సంస్థల్లో విద్యార్థులు రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేస్తారు. 2017-19 బ్యాచ్‌లో మొత్తం 62 మంది ఉండగా 61 మంది స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ఎంపిక కాగా, ఒకరు పరిశోధనకు మొగ్గుచూపారు.
61 మందిలో 49 మంది ఇక్కడ క్యాంప్‌సలో ఎంపికకాగా, మిగిలిన 12 మంది బెంగళూరు ఐఐఎంలో గత నవంబరులో నిర్వహించిన సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయ్యారు. వినియోగదారులతో సంబంధాలు, వ్యాపార విస్తరణలో పనిచేయడానికి ప్రఖ్యాత బ్యాంకులు, ఇతర సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. వేసవి ఇంటర్న్‌షి్‌పలో వంద శాతం ప్లేస్‌మెంట్లు సాధించడంపై విశాఖ ఐఐఎం డైరెక్టర్‌ ఆచార్య చంద్రశేఖర్‌ సంతృప్తి వ్యక్తంచేశారు.