మోడల్‌ స్కూళ్లూ రాష్ట్ర పరిధిలోకే! Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మోడల్‌ స్కూళ్లూ రాష్ట్ర పరిధిలోకే!
పాఠశాల విద్య అధీనంలోకి.. 164 మోడల్‌ పాఠశాలలు
స్వయం ప్రతిపత్తి కొనసాగింపు
ఎమ్మెల్సీల కమిటీ సిఫారసుకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన మోడల్‌ స్కూళ్లు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి. అయితే, వాటి స్వయంప్రతిపత్తిని యాథాతథంగా కొనసాగించనున్నారు. కానీ, ప్రత్యేక యూనిట్లుగా పరిగణించనున్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఏపీ మోడల్‌ స్కూల్‌ సొసైటీ కింద స్వయంప్రతిపత్తితో నడుస్తున్న ఈ పాఠశాలలు త్వరలోనే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి రానున్నాయి. ఎమ్మెల్సీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు చేసిన సిఫారసుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. మోడల్‌ స్కూళ్లు 2018-19 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి వస్తాయి. ఆయా స్కూళ్లన్నీ సొసైటీ నుంచి విడిపోనున్నాయి.
 
దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయి. దేశ వ్యాప్తంగా మోడల్‌ స్కూళ్లను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు నిధులను విడుదల చేసింది. ఆ తర్వాత నిధులను నిలిపివేసింది. ఫలితంగా మోడల్‌ స్కూళ్ల వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. వీటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రంతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది.
 
రాష్ట్రంలో పూర్తిగా ఇంగ్లీషు మీడియం బోధనతో నిర్వహిస్తున్న 164 మోడల్‌ స్కూళ్లలో 2,063 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాళ్లు ఉన్నారు. నాలుగు స్కూళ్లకు తప్ప మిగిలిన అన్నింటికీ సొంత భవనాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. మోడల్‌ స్కూళ్లలో పనిచేసే టీచర్ల జీతాలు, ఎస్టాబ్లిష్ మెంట్‌ కోసం ఏటా రూ.160 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డీలింక్‌ చేసిన పథకాలు/కార్యక్రమాల్లో మోడల్‌ స్కూళ్లను చేర్చడంతో నిధులు ఆగిపోయాయి. ఆయా స్కూళ్లను నిర్వహించుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే పెట్టింది.