ఇక కేంద్రం నుంచి చంద్రన్న స్కాలర్‌ షిప్‌లు..! Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇక కేంద్రం నుంచి చంద్రన్న స్కాలర్‌ షిప్‌లు..!
‘స్కాలర్‌షిప్స్ .జీఓవీ.ఇన్‌’లో దరఖాస్తు చేసుకోవాలి!

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): చంద్రన్న బీమా పథకం లబ్ధిదారుల కుటుంబాల్లోని విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు ఇక నుంచి కేంద్రమే నేరుగా ఇవ్వనుంది. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన-చంద్రన్న బీమా పేరుతో అమలవుతున్న ఈ పథకం ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని సెకండరీ విద్య బోర్డు, ఇంటర్మీడియట్‌ బోర్డు, టెక్నికల్‌ ఎడ్యుకేషనల్‌ విభాగాల ద్వారా అమలవుతోంది. సెర్ప్‌ దీన్ని సమన్వయం చేసి పర్యవేక్షిస్తోంది. ఈ విభాగాలు అర్హులైన విద్యార్థుల వివరాలను నేరుగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్‌లోడ్‌ చేస్తుండడంతో, విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్‌లు జమ అవుతున్నాయి.
 
కానీ, ఇక నుంచి విద్యార్థులు నేరుగా స్కాలర్‌షిప్స్ .జీఓవీ.ఇన్‌ వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు మ్యాచింగ్‌ ప్రీమియంగా రూ.259.76 కోట్లు చెల్లించింది. ఇది కాకుండా, ఈ పథకం ప్రకటించిన మొదటి ఏడాది ప్రమాద మరణాలకు చెల్లించే రూ.5 లక్షల బీమా కోసం అదనంగా రూ.80 కోట్లు చెల్లించింది. కాగా కేంద్రం నేరుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఇప్పటి వరకు దీన్ని సమన్వయం చేస్తున్న సెర్ప్‌ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.