జాబ్‌ సెర్చ్‌కి 8 పుస్తకాలు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జాబ్‌ సెర్చ్‌కి 8 పుస్తకాలు
ఏ వయస్సులోనైనా సరే ఉద్యోగ అన్వేషణ అంటే కొంచెం సవాలుతో కూడుకున్న పనే. ఇందులో ఎన్నో రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. రెజ్యూమె తయారీ, జాబ్‌ సైట్స్‌ ఉపయోగించుకోవడం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌, శాలరీ డిస్కషన్‌, వర్క్‌టైమ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంప్లాయి రిలేషన్స్‌ తదితరాలన్నీ కూడా ఒక ఉద్యోగి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటన్నింటికీ సమాధానం అన్నట్టు ఎనిమిది పుస్తకాలు ప్రపంచ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కొన్ని పుస్తకాలు కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతుంటే, మరికొన్ని దశాబ్దాలుగా పాఠకులను అలరిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణ ప్రకియలో ఈ పుస్తకాలు అందించే సహకారం ఎంతో మేలైనది, మరువలేనిది.
 
వాట్‌ కలర్‌ ఈజ్‌ యువర్‌ పారాచూట్‌: రిచర్డ్‌ ఎన్‌ బోలెస్‌
ఉద్యోగాన్వేషణలో భాగంగా కేవలం ఒక్క పుస్తకమే చద వాలని భావిస్తే ఎంచుకో దగ్గది ఇదేనంటే అతిశయోక్తి కాదు. చూడగానే ఆకట్టు కునే రెజ్యూమె, కవర్‌ లెటర్‌, నెట్‌వర్క్‌ మెరుగుదల, ఇంటర్వ్యూయింగ్‌, జీతభత్యాలు బేరమాడేం దుకు అవసరమైన నైపుణ్యాలు వంటివన్నీ పుస్తకం మొదటి సగంలో ఉంటాయి. రెండో భాగం యావత్తు ఐడియల్‌ కెరీర్‌ను గుర్తించడంపై దృష్టి కేంద్రీకరిం చింది. జాబ్‌ హంటింగ్‌ గైడ్‌గా సుప్రసిద్ధం. ఏటా రివైజ్‌ అవుతున్న ఈ పుస్తకం ఇప్పటికి పది మిలియన్‌ కాపీలు అమ్ముడుపోయింది. ఎప్పటికప్పుడు జాబ్‌ మార్కెట్‌లోని పరిస్థితులు, ఉద్యోగాన్ని పొందేందుకు అవసరమైన వ్యూహాలను తెలియజేస్తోంది. ఏయే ఎత్తుగడలు పనికొస్తాయో కూడా విశదీకరిస్తుంది. తద్వారా ఫలితాలన్నిచ్చే ఎత్తుగడలపై ఉద్యోగార్థులు దృష్టి కేంద్రికరించవచ్చు. మంచి జాబే కాదు, ఆకర్షణీ యమైన వేతనాన్ని అభ్యర్థులు కోరుకుంటారు. అయితే జాబ్‌కుతోడు వేతనాన్ని రాబట్టుకునేందుకు అనుసరిం చాల్సిన చిట్కాలను కూడా ఈ పుస్తకం అందిస్తుంది. అన్వేషణలో అదే మొదటి జాబ్‌ కావచ్చు, లేదంటే మిడ్‌ కెరీర్‌లో ఉద్యోగ మార్పు కావచ్చు... దేనికైనా ఈ పుస్తకం ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు.
 
గెటింగ్‌ థింగ్స్‌ డన్‌: డేవిడ్‌ ఎల్లెన్‌
జాబ్‌ మార్కెట్‌లో జరుగు తున్న పరిణామాలను అంతకు మించి వాటి కదలికలను కూడా తీసుకుని అన్వేషణ ఎలా సాగించాలనేది ఈ పుస్తకం తెలియజేస్తుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అలాగే ఆర్గనైజేషన్‌కు సంబంధించి ప్రాథ మిక అంశాలను కూడా వివరిస్తుంది. లక్ష్యాలను ఎప్పటి కప్పుడు అంచనా వేసుకోవడమే కాదు ఆ దిశగా ఫోకస్‌ పెట్టడం ఎలా అన్నది బోధిస్తుంది. పరివర్తన దశలో జాబ్‌ దొరకబుచ్చుకునే వ్యూహాలను తెలియజేస్తుంది. బిజినెస్‌, పర్సనల్‌ ప్రొడక్టివిటీకి బైబిల్‌గా ఈ పుస్తకాన్ని లైఫ్‌హక్‌ అభివర్ణించారు. ప్రచురించి దశాబ్దంన్నర కావస్తున్న ఈ పుస్తకం హవా ఇంతా అంతా కాదు. పర్సనల్‌ ఆర్గనైజేషన్‌ విషయాల్లో కీలకమైన పుస్తకంగా ప్రశంసలు అందుకుంది. రచయిత పేరుతో కలిపి సంక్షిప్త నామం ‘జిటిడి’గా సుప్రసిద్ధమైంది. పర్సనల్‌, ప్రొఫెషనల్‌ టాస్క్‌లను డీల్‌ చేయడంలో ఉపకరిస్తుంది. సంబంధిత వెబ్‌ సైట్స్‌, ఆర్గనైజేషనల్‌ టూల్స్‌, సెమినార్ల సమాహారమిది. అయితే ఈ పుస్తకాన్ని తరవాతి రోజుల్లో అల్లెన్‌ తిరగ రాశారు. కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులను కూడా కలుపుకొని మొదటి నుంచి చివరి వరకు అంతా మార్చుకుంటూ వెళ్ళిన పుస్తకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొత్త తరం కూడా దీనిని ఆదరించడం విశేషం.
 
హౌ టు విన్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లూయన్స్‌ పీపుల్‌: డేల్‌ కార్ని
తోటి మనుషులను ఆకట్టుకో వడం ఒక కళ. అదెలా అన్నది ఈ పుస్తకం విశదీకరిస్తుంది. ఏ తరానికైనా ఉపకరించే పుస్తక మిది. పర్సనల్‌, ప్రొఫెషనల్‌ జీవితాన్ని చక్కగా మలుచుకు నేందుకు మార్గనిర్దేశం చేస్తుంది. నెట్‌వర్కింగ్‌ అంటే ఎక్కువమందితో మంచి సంబంధాలను నెలకొల్పు కునేందుకు తోడ్పడుతుంది. వివిధ వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడి అభిమానించేలా చేసుకోవడం ఎలాగో నేర్పుతుంది. వ్యక్తులతో గరిష్ఠ స్థాయిలో ఇంటరాక్షన్‌కు దోహదపడే అంశాలపై కార్నెగి దృష్టి కేంద్రీకరించారు. చర్చలో ఆధిక్యం కంటే, ఎదుటి వారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా ఇద్దరికీ ఆసక్తి ఉన్న అంశాలపై మాట్లాడుకోవచ్చని రచయిత సూచించాడు. ఈయన సూచనలు తరాలుగా పలువురిని ఆకట్టుకున్నాయి. వ్యక్తులు నిన్ను ఇష్టపడటానికి ఆరు మార్గాలు, మనషులను ఆకట్టుకునేందుకు పన్నెండు మార్గాలు వంటివి వీటలో కొన్ని అంశాలు మాత్రమే. సుమారుగా కోటిన్నర ప్రతులు అమ్ముడు పోయాయంటే ఈ పుస్తకం విలువ ఏ పాటిదో ఆర్థం చేసుకోవచ్చు.
 
వెయిట్‌, హౌ డు ఐ రైట్‌ దిస్‌ ఈమెయిల్‌: డేనీ రూబిన్‌
ఈ టైటిల్‌ నిజానికి తప్పుదోవ పట్టిస్తుంది. ఈ మెయిళ్ళు ఎలా రాయాలన్న విషయానికే ఈ పుస్తకం పరిమితం కాదు. అందులో ఈ మెయిళ్ళ విషయం కూడా ఉంటుంది. జాబ్‌ సెర్చ్‌ పరిస్థితులను ఈ పుస్తకం లోతుగా చర్చిస్తుంది. ఉద్యోగం విషయంలో రాత అంశాన్ని ఇది కవర్‌ చేస్తుంది. సంబంధిత గైడెన్స్‌ అందిస్తుంది. లింక్డిన్‌ ఫ్రొఫైల్‌ మొదలుకుని రెజ్యూమె, కవర్‌ లెటర్‌ వరకు అన్నింటిపై సూచనలు ఉన్నాయి. జీవితంలో ఇంతవరకు ఒక అక్షరం కూడా రాయని వ్యక్తులు సైతం తమ భావాలను కాగితంపై పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఉద్యోగ వెతుకలాటలో రాత అంశానికి సంబంధించి ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఈ పుస్తకం కొత్త ప్రింట్‌ లభ్యం కావటం లేదన్నది సమాచారం. జాబ్‌ సెర్చ్‌లో వంద వరకు క్లిష్టమైన ఈమెయిళ్ళు, డాక్యుమెంట్లను రచయిత లోతుగా విశ్లేషించారు. ప్రతి టెంప్లేట్‌ నుంచి టైమ్‌ ఆదాకు తోడు ఒత్తిడి నుంచి బైటపడేందుకు ఉపకరించేలా ఆయన రాశారు. ఒక్కో పేజీ పూర్తి చేస్తుంటే నెట్‌వర్కింగ్‌పై వివరంగా సూచనలు ఉంటాయి. అంటే ఓపెనింగ్‌ నుంచి ఉత్కంఠ కలిగిస్తూ రచన సాగుతుంది. గుర్తుంచుకోదగిన విధంగా చేతిరాత నోట్స్‌తో రచయిత పుస్తకాన్ని చాలా అందంగా, ఆకట్టుకునేవిధంగా మలిచారు. మొత్తమ్మీద కథలా పుస్తకం సాగుతుంది.
 
ద ఎలిమెంట్స్‌ ఆఫ్‌ స్టయిల్‌: విలియం స్ట్రంక్‌ జూనియర్‌, ఇబి వైట్‌
రెజ్యూమె, కవర్‌ లెటర్‌ ఎడిటింగ్‌పై ఈ పుస్తకం లోతుగా చర్చిస్తుంది. గ్రామర్‌, పంక్చు యేషన్‌, స్పెల్లింగ్‌ తప్పులు ఎక్కు వగా దొర్లుతుంటాయి. ఒక్కోసారి ఈ తప్పులతో అర్థమే మారే ప్రమాదం ఉంటుంది. అలాంటి తప్పులు చేయకుండా ముఖ్యంగా వ్యాకరణ దోషం లేకుండా రాయడంపై ఈ పుస్తకంలో పలు సలహాలను పొందుపరిచారు. ఒక రకంగా ఇది వ్యాకరణ పుస్తకమే. దీన్ని ఫాలో అయితే రాతను మెరుగుపర్చుకోవచ్చు. ప్రస్తుతం దీని నాలుగో ఎడిషన్‌ మార్కెట్లో లభ్యమవుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ పుస్తకాన్ని వినియోగించి కూడా ఉండొచ్చు. ఇంగ్లీష్‌ స్టయిల్‌కు సంబంధించిన ప్రిన్సిపుల్స్‌ను ఈ బుక్‌ లోతుగా వివరిస్తుంది. పుస్తకం చిన్నదైనా రాత విషయంలో మంచి ప్రభావం చూపుతుంది.
 
ద టు అవర్‌ జాబ్‌ సెర్చ్‌: యూజింగ్‌ టెక్నాలజీ టు గెట్‌ ద రైట్‌ జాబ్‌ ఫాస్టర్‌: స్టీవ్‌ డాల్టన్‌
ఇంటర్నెట్‌ జాబ్స్‌ పొందేందుకు అవసరమైన ప్రాక్టికల్‌ టిప్స్‌ను ఈ పుస్తకం అంది స్తుంది. అతి తక్కువ సమ యంలో ఎక్సెల్‌, గూగుల్‌, లింక్డిన్‌ తదితర డేటా బేస్‌ నుంచి ఉపాధి పొందేందుకు ఉద్దేశించిన మూడు స్టెప్స్‌ను వివరిస్తుంది. టార్గెట్‌ ఎంప్లాయిర్లను గుర్తించడం, కాంటాక్ట్‌ చేయడం, రిక్రూట్‌మెంట్‌ విషయాలను తెలుసుకోవచ్చు. జాబ్‌ సెర్చ్‌ చాలా పద్ధతిగా టెక్‌సావే ఫార్ములాను అనుసరించి ఉంటుంది. పై మూడింటి డేటా బేస్‌ నుంచి సమాచారం తీసుకోవడం నుంచి ఏవి ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి, ఇంటర్వ్యూ వరకు యావత్తు విషయాల సమాహారమిది. జాబ్స్‌కు సంబంధించి మధ్యంతర దశ క్లిష్టంగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ ఆవరించి కూడా ఉంటుంది. ఆయా అంశాలపై కూడా దృష్టి కేంద్రీకరించి మరీ రాసిన పుస్తకమిది.
 
స్టీల్‌ ద షో: మైఖేల్‌ పోర్ట్స్‌
ఇంటర్వ్యూ వ్యవహారాలను చర్చించే పుస్తకమిది. ఏదైనా ఉద్యోగానికి నేనే బెస్ట్‌ పర్సన్‌ అని ఆకట్టుకునేలా చెప్పే టిప్స్‌ను అందించే బుక్‌ ఇది. రిక్రూట్‌ చేసే వ్యక్తిని ప్రభావం చేసేలా ఆయ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియజేస్తుంది. మా సమాధానాలకు సంతృప్తి కనబర్చడమే కాదు, ఉద్యోగిగా తీసుకోవాలని రిక్రూటర్‌ భావిస్తే ఎలా వ్యవహరించాలో కూడా అభ్యర్థులకు చెబు తుంది. రచయిత అభిప్రాయం ప్రకారం ప్రతి ఇంటరాక్షన్‌ ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తికి సమా చారం అందించడం, మోటివేషన్‌, ప్రభావ పర్చడం అన్నది నిజానికి రోజూ జరిగేదే. ఇది అందరికి తెలిసిన వ్యవహా రమే. అయితే అదే టెక్నిక్‌ను ఇంటర్వ్యూలో ఉపయోగిం చాలి. అదెలాగో ఈ పుస్తకంలో రచయిత తెలియిజేశారు.

గెటింగ్‌ టు ఎస్‌: నెగోషియేటింగ్‌ అగ్రిమెంట్‌ వితౌట్‌ గివింగ్‌ ఇన్‌: రోగర్‌ ఫిషర్‌, విలియం ఎల్‌.యూరి, బ్రూస్‌ పాటన్స్‌
జీత భత్యాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఎలా పొందాలో, ఆ విషయమై ఎంప్లాయిర్‌తో ఎలా చర్చించాలో ఈ పుస్తకం తెలియజేస్తుది. ముప్పయ్‌ సంవత్సరాలుగా మార్కెట్లో ఈ పుస్తకం ఉంది. హార్వర్డ్‌ నెగోసియేషన్‌ ప్రాజెక్ట్‌ ఆధారంగా జీత భత్యాలను చర్చించడానికి అచరణాత్మక విధానాలను ఈ రచయితలు పొందుపర్చారు. అలాగే ఈ పుస్తకాన్ని అప్‌డేట్‌ చేశారు. ‘గెటింగ్‌ టు ఎస్‌’ అన్నది అసలు దీని ఒరిజినల్‌. దాన్ని ఇప్పుడు ఈ రూపంలోకి మార్చారు. స్టెప్‌ బై స్టెప్‌ స్రాటజీని అందించిన పుస్తకంగా గెటింగ్‌ టు ఎస్‌కు మంచి పేరుంది. సవరించిన తరవాత కూడా అన్వయించ కలిగిన విధానాలతో ప్రొఫెషనల్‌ టచ్‌ ఈ పుస్తకంలో ఉంది.
 
https://www.businessinsider.in/8-books-every-job-seeker-should-read/Richard-N-Bolles-What-Color-is-Your-Parachute/slideshow/ 51786703.cms