ఇంటర్వ్యూలో స్ట్రెంత్స్‌..మీ బలాన్ని నిజంగా గుర్తించారా? Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇంటర్వ్యూలో స్ట్రెంత్స్‌..మీ బలాన్ని నిజంగా గుర్తించారా?
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలం ఉంటుంది. అదే మనిషిని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ప్రతి దశలోనూ దాని ప్రభావం కూడా ఉంటుంది. కెరీర్‌కు వర్తిస్తుంది. అయితే, ఇంటర్వ్యూలో మీ బలాలు లేదా శక్తిసామర్థ్యాలు ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పడం మాత్రం సులువు కాదు. అసలు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మన సామర్థ్యాలు ఏమిటో మనకు తెలియాలి.
 
ఏ స్థాయి ఉద్యోగానికైనా నిర్వహించే ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నల్లో ఒకటి అభ్యర్థి సామర్థ్యాలు ఏమిటి అని. ఈ ప్రశ్న అడగడం ద్వారా ఆ వ్యక్తి తమకు ఏ మేరకు అక్కరకు వస్తాడో ఇంటర్వ్యూయర్‌ అంచనా వేస్తాడు. ప్రత్యేకించి ఒక పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో బలాల రీత్యా ఎవరు మెరుగు అన్నది కూడా తేల్చుకునేందుకు ఈ ప్రశ్న ఉపయోగపడుతుంది. అందువల్ల ఇంటర్వ్యూకు వెళ్ళే ప్రతి అభ్యర్థి ఈ ప్రశ్నకు సమాధాన ఇచ్చేందుకు ప్రిపేర్‌ కావాల్సిందే. అర్హతల్లో భాగంగా అధ్యయనం చేసిన అంశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు, బృందంలో సభ్యుడిగా ఆ వ్యక్తి అనుభవాలు... ఇలా ప్రతిదీ ఒక బలంగా మారే అవకాశం ఉంది. ఆ బలం పరిశ్రమలో తను నిర్వ ర్తించబోయే విధులకు ఏ విధంగా ఉపయోగ పడతాయో కూడా ఇంటర్వ్యూలో పరిశీలించవచ్చు.
 
సాధారణంగా చేసే తప్పులు: మిమ్మల్ని మీరు మార్కెట్‌ చేసుకోవడం అంటే నేను సరైన అభ్యర్థిని అని చెప్పుకొనేందుకు ఉపకరించే ప్రశ్న ఇది. అయితే ఎక్కువ మందికి తమ గురించి తమకే తెలియదు. దాంతో తమ బలాన్ని సరైన పద్ధతిలో చెప్పకోలేక చతికిలపడుతూ ఉంటారు. ఒకరకంగా ఆత్మహత్యసదృశానికి పాల్పడు తుంటారు.
 
ఉదాహరణకు...
ఎక్కువ మంది అభ్యర్థులు తమ బలాలను విశ్లేషించుకోరు. కోరుకుంటున్న పొజిషన్‌కు అవీ అవసరమేనని భావించరు. సంబంధిత విషయంలో సలహా కూడా తీసుకోరు.
కొంతమంది కనీసం తమ గురించి కనీసంగా కూడా చెప్పుకోలేని నమ్రత కలిగి ఉంటారు. అంతర్ముఖులై ఉండటం కొంతవరకు దీనికి కారణం. దాంతో తమను తాము సరిగ్గా మార్కెట్‌ చేసుకోలేరు. తమకు సంబంధించి సామర్థ్యాలు లేదంటే బలాలను కూడా తెలుపుకోలేని పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతుంటారు.
మరికొంత మంది అనవసర విషయాలను తమ బలాలుగా ప్రస్తావిస్తుంటారు. సరిగ్గా ఆ పొరపాటు అభ్యర్థిని ఇక్కట్లపాల్జేస్తుంది. ఇంటర్వూలో మైనస్‌ మార్కువైపు తీసుకెళుతుంది. సమయానుగుణంగా సామర్థ్యాలను వ్యక్తం చేయలేకపోవడంతో వ్యతిరేక ఫలితమూ ఎదురవుతుంది.
అసలు తప్పులు దొర్లకుండా బలాలను వ్యక్తపర్చాలంటే కొంత శిక్షణ మరికొంత సన్నద్ధత చాలా అవసరం. అసలు మనకున్న బలాలు ఏవిటి అన్నవి గుర్తించడం మొదట చేయాల్సిన పని.
ఈ క్రమంలో మొదట కుదురుగా ఒక చోట కూర్చుని కనీసం పదింటిని గుర్తించి రాసుకోవాలి. అవి కాస్త క్రియేటివ్‌గా ఉండాలి. మొదట అన్నింటినీ రాసుకోవాలి. ఇదంతా పక్కాగా జరగాలంటే బుర్రకు బాగా పదునుపెట్టాలి. అంటే మేధోమధనం జరగాలి.
అనుభవం అంటే సాఫ్ట్‌వేర్‌ లేదంటే, ప్రత్యేకించి నిర్వహించిన టాస్క్‌, పరిశ్రమలో సాధించిన అను భవం, వెళ్ళిన కంపెనీ ప్రొడక్ట్‌లతో సామీప్యం ఉన్న వాటితో అనుభవం, క్లయింట్స్‌ సంబంధిత ట్రాక్‌ రికార్డ్‌ వస్తాయి.
టాలెంట్స్‌ కిందికి కోరుకున్న లాంగ్వేజ్‌లో ప్రోగ్రామింగ్‌, ప్రతిపాదనలు రాయడం, విడ్జెట్స్‌ అమ్మకం, కేసుల లిటిగేషన్‌, ఈవెంట్ల నిర్వహణ, మేండరిన్‌ నుంచి అనువాదం వంటివి.
సాఫ్ట్‌స్కిల్స్‌లో భాగంగా ప్రోబ్లమ్‌ సాల్వింగ్‌, ప్రభావపర్చడం, టీమ్‌ బిల్డింగ్‌, నెగోషియేషన్‌, మేనేజింగ్‌ తదితరాల్లో సామర్థ్యాలు
జాబ్‌కు తగ్గట్టు అర్హతలు, డిగ్రీలు, సర్టిఫికేషన్లు, సెమినార్ల నిర్వహణ, మెంటారింగ్‌, ఇంటర్న్‌షిప్స్‌ వంటివి ఉంటాయి.
అలాగే పర్సనాలిటీకి సంబంధించి సానుకూల లక్షణాలు, వ్యక్తిగత సామర్థ్యాలు తదితరాలన్నింటినీ కలగలుపుకోవాలి.
 
ఫోకస్‌: మొదట మన బలాలు అన్నింటినీ రాసుకోవాలి. ఇప్పుడు కనీసం ముఖ్యమైన అయిదింటిని గుర్తించాలి. బాగా చర్చించడానికి సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి.
మీరు బలం అనుకున్న వాటిలో కనీసం ఒకటి తీసుకోండి. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో ఎలా వెల్లడించాలన్నది ఉదాహరణగా ప్రాక్టీస్‌ చేయండి. మీ అనుభవంలో భాగంగా ఆ బలం ఎలా ఉపయోగపడిందీ తెలియజేస్తూ వివరించండి. మీ బలాన్ని ఎంత బలంగా చెప్పారన్నది మీకుగా మీరు అంచనా వేసుకోండి. అదే సమయంలో లోతుగా విశ్లేషించుకుని చెప్పే తీరును మెరుగుపర్చుకోండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో ఇది కూడా ఒకటని గుర్తించండి.
 
సరైన బలాల గుర్తింపు
కచ్చితత్వం: నిజంగా మీరు బలం అనుకుంటున్న వాటిని గుర్తించండి. ఏ జాబ్‌ కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నారో దానికి నప్పే బలాలను ఎంచుకోండి. వృత్తిపరమైన బలం కావాలి. సరైన లేదంటే అందులో కచ్చితత్వం కలిసి ఉన్నప్పుడు ఇంటర్వ్యూయర్‌ని తప్పక ఆకట్టుకుంటుంది.
తగినదై ఉండాలి: ఇంతకు ముందు చెప్పినట్టు మీ బలం జాబ్‌కు సూట్‌ కావాలి. మీకు బలంగా అనిపించినవి చాలా ఉండొచ్చు. వాటిలో ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళుతున్నజాబ్‌కు తగినదై ఉండాలి.
నిర్దుష్టంగా: సంబంధాలను కలుపుకొనే లేదంటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. అవే చెప్పడం అంటే ఇంటర్వ్యూయర్‌ని బోర్‌ కొట్టించడం తప్ప మరొకటి కాదు. అందువల్ల 90 శాతం మంది ఎంచుకోని, మీకుగా ప్రత్యేకంగా అనిపించింది తీసుకోండి. కొత్తదనం అని అర్థం చేసుకోవద్దు. జాబ్‌కు అనువైనది అయి ఉండాలి. అదే సమయంలో ప్రత్యేకత కలిగినదై ఉండాలి.
మరీ మొహమాటం వద్దు: మీతో పని చేయడం అదృష్టం అన్నట్టు మరీ మర్యాదపూర్వకంగా ప్రవర్తించాల్సిన పని లేదు. ఉద్యోగం కోసం అనువుగా ఉండటం అంటే సాగిలపడటం అని మాత్రం కాదు.
డిమాన్‌స్ట్రేషన్‌: ప్రతి బలాన్ని దేనికదిగా విడదీసుకుని ఏది ఏ పోస్టుకు ఉపయోగపడుతుందన్నది తేల్చుకోవాలి. ప్రతి బలం విషయంలో ఒకటి నుంచి రెండు నిమిషాలకు తక్కువ కాకుండా చెప్పుకోగలిగే సామర్థ్యం అలవడాలంటే, ఒకసారి డిమాన్‌స్ట్రేట్‌ చేసి చూసుకోవాలి. అవసరమైన మెరుగులు దిద్దుకునేందుకు ఆ ప్రక్రియ ఉపకరిస్తుంది.