కష్టాన్ని దిగమింగి నిలదొక్కుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కష్టాన్ని దిగమింగి నిలదొక్కుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌
పెళ్లయిన రెండేళ్లకే భర్తను మింగేసిన మృత్యువు
సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోని కుదుపు
మూడు నెలల గర్భిణిగా పుట్టింటికి చేరిన విధివంచిత
ఉద్యోగం కంటే స్వయం ఉపాధి వైపు మొగ్గు
డెయిరీ ఏర్పాటుతో ఆదాయ మార్గానికి శ్రీకారం
రెండేళ్లు దాటేసరికి నిలదొక్కుకున్న వైనం
ప్రస్తుతం నెల ఆదాయం రూ.70 వేలు పైమాటే
సకురు పద్మజ విజయగాథ ఇది

అనకాపల్లి, విశాఖపట్టణం, జనవరి 12: ఆమె ఇంజనీర్‌...ఉద్యోగం చేద్దామనుకునేలోగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భర్తగా లభించాడు. వైవాహిక జీవితం మూడు నవ్వులు, ఆరు టూర్లుగా సాగిపోతున్న వేళ అనుకోని షాక్‌. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను మృత్యువు కబళించింది. కడుపులో మూడు నెలల బిడ్డ పెరుగుతుండగా ఎదురైన ఈ పరిస్థితుల్లో మరొకరైతే ఏమయ్యేవారోగాని, ఆమె మాత్రం ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడింది. స్వయం ఉపాధితో తనకంటూ అస్థిత్వాన్ని ఏర్పర్చుకుని శెభాష్‌ అనిపించుకుంటోంది.
 
జీవితం వడ్డించిన విస్తరిలా అందరికీ ఉండదు. ఆటు పోట్లు సహజం. వాటికి ఎదురొడ్డి నిలిచిన వారే ధీరోదాత్తులు. పెద్ద చదువు, ఉద్యోగం, లక్షల్లో సంపాదన...అదే జీవితం అనుకుంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదేమో. కానీ ‘తానొకటి తలస్తే దైవం మరొకటి నిర్ణయించినా’ ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యమే ఆలంబనగా పరిస్థి తులతో పోరాడి నిలదొక్కుకుంది. పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆమె పేరు సకురు పద్మజ. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. పెళ్లయి మూడు నెలల గర్భిణిగా ఉండగా భర్తను ఏక్సిడెంట్‌ రూపంలో మృత్యువు మింగేసింది. ఒక్కసారిగా జీవితాన్ని చీకట్లు కమ్మేసినట్టయింది. ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని నిలబెట్టుకోవాలా... ఉపాధి మార్గాన్ని వెతుక్కుని బిడ్డకు బంగారు భవిష్యత్తు అందించాలా’ అన్న మీమాంసలో ఆమె రెండో వైపే మొగ్గుచూపింది. డెయిరీ ఏర్పాటుచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కంటే ఎక్కువ సంపాదిస్తూ తానేంటో నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే...
 
అనకాపల్లి రింగ్‌ రోడ్డులో నివాసం కంఠం రెడ్డి అప్పారావు, దేవికల రెండో సంతానం పద్మజ. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే పద్మజ టెన్త్‌లో 85 శాతం, ఇంటర్‌లో 87 శాతం మార్కు లు సాధించి కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో డిస్టింక్షన్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఇంజనీరింగ్‌ డిగ్రీ చేస్తున్నప్పుడే బెంగళూరులోని ఎడ్యుకామ్‌ కంపెనీ, కోయంబత్తూరులోని హరిజన్‌ టెక్‌ కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైంది. ఈలోగా తల్లిదండ్రులు పెళ్లి కుదర్చడంతో ఉద్యోగం ఆలోచన వదిలేసి వివాహానికి సిద్ధ మైంది. అనపర్తికి చెందిన విజయమధు బాబు ను 2012లో వివాహం చేసుకుంది. ఉద్యోగ రీత్యా దంపతులు రెండేళ్లు బంగ్లాదేశ్‌లో ఉండి తిరిగి సెలవుపై హైదరాబాద్‌ వచ్చారు.
 
2014లో హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధుబాబు కన్నుమూశాడు. అప్పటికి పద్మజ మూడు నెలల గర్భిణి. జీవితం హాయిగా సాగి పోతోందనుకుంటే అనుకోని షాక్‌. వైధవ్యంతో ఇంటికి చేరిన బిడ్డను చూడగానే ఆమె తల్లి దేవిక మనోవేదనతో మంచం పట్టేసింది. ఇటు భర్త మరణం, అటు తల్లి అనారోగ్యం, మరోవైపు కడుపులో పెడుతున్న బిడ్డ...ముప్పేట సమస్యల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో కూడా పద్మజ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. నవమాసాలు నిండి ఆడపిల్లకు జన్మనిచ్చాక జీవితాన్ని గెలవాలన్న దృఢనిశ్ఛయానికి వచ్చింది. చేతిలో చంటిబిడ్డ, ఇంట్లో అనారోగ్యంతో తల్లిని చూడగానే ఉద్యోగం కంటే ఉపాధి వెతుక్కోవడం మేలనిపించింది . ఉద్యోగం కంటే స్వయం ఉపాధి సృష్టించుకోవాలనుకుని పద్మజ డెయిరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
 
ఒక గేదెతో డెయిరీకి శ్రీకారం
తండ్రికి స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో 30 సెంట్ల స్థలం ఉండడంతో తొలుత ఒక గేదెను కొని తన ప్రయత్నానికి పద్మజ శ్రీకారం చుట్టారు. దాని ఆలనాపాలనా చూస్తూ వచ్చిన పాలను తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో నివాసితులకే విక్రయించి వచ్చిన డబ్బును పొదుపు చేస్తూ క్రమేపీ డెయిరీలో గేదెల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం ఎనిమిది గేదెలు, ఒక ఆవు సమకూరాయి. కొన్ని పాలిస్తుండగా, మరికొన్ని చూలు కట్టి ఉన్నాయి. రోజుకు 40 నుంచి 50 లీటర్ల పాలు వస్తున్నాయి. వీటిని అపార్ట్‌మెంట్లలో నివాసితులకు, టీ దుకాణాల వారికి సరఫరా చేస్తున్నారు. వీటి విక్రయం ద్వారా నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేలు సమకూరుతున్నాయి. పశువుల సంఖ్య పెరగగానే మరో ఎకరా భూమిని లీజుకు తీసుకుని అందులో గడ్డి పెంపకం చేపట్టారు.
 
ఎండుగడ్డి కూడా ఏడాదికి సరిపడా తెచ్చి నిల్వచేస్తున్నారు. పత్తిచెక్క, గానుగపిండి, కాల్షియం,పోషకాలు వంటి ఆహారాన్ని పశువులకు పెడుతున్నారు. నెట్‌లో పశుపోషణ గురించి తెలుసుకుని దాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. డెయిరీ నిర్వహణ, గేదెల దాణా తదితర అవసరాలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతుండగా నికరంగా నెలకు రూ.40 వేలు ఆదా అవుతోంది. ఇల్లు, ఊరు, తల్లిదండ్రులను వదిలి చంటిబిడ్డను చంకన పెట్టుకుని ఉద్యోగం పేరుతో ఎక్కడికో వెళితే ఇంతకంటే కాస్త ఎక్కువ సంపాదిస్తే సంపాదించవచ్చునేమోకాని, అమ్మానాన్నల వద్దే ఉన్నానన్న భరోసా ఉండేది కాదని, తానెంచుకున్న మార్గమే ఇప్పుడు మంచిదనిపిస్తోందని పద్మజ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
 
నాకంటూ ఉపాధి ఉండాలని...
నాన్న రిటైర్డు ఉద్యోగి. ఆయనకు పింఛన్‌ వస్తుంది. ఓ అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నన్ను పోషించడం వారికి కష్టం కాదు. కానీ నాకంటూ ఉపాధి సృష్టించుకోవాలనే సొంతంగా డెయిరీ నడుపుతున్నాను. ఎవరి మీదో ఆధారపడడం కంటే స్వశక్తిని నమ్ము కోవడం ఉత్తమమని నా ఉద్దేశం. బ్యాంక్‌ రుణం లభిస్తే పశువుల సంఖ్య పెంచి డెయిరీని మరింత విస్తరించే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పశుగణాభివృద్ధి శాఖ అధికారులను కలిసి సమస్య చెబుతున్నా, ఓపెన్‌ కేటగిరీ కావడంతో రుణ మంజూరు అవకాశాలు లేవని చెబుతున్నారు. నాలాం టి వారికి సహకారం అందిస్తే మంచి ఫలితాలు సాధించగలనని నమ్మ కంతో చెబుతున్నాను.
- సకురు పద్మజ, అనకాపల్లి